Karthika Deepam: పారిజాతానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శివ నారాయణ.. శ్రీధర్ నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్!

శౌర్య కార్తీక్ కావాలి అనడంతో తప్పనిసరి పరిస్థితులలో అతనికి ఫోన్ చేస్తాడు బాబాయ్. బాబాయ్ ని శౌర్య ని తీసుకొని దీప ఇంటికి వెళ్తాడు కార్తీక్. ఇదంతా కార్తీక్ ని ఫాలో అవుతున్న జ్యోత్స్న చూస్తుంది. జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది. నా నిశ్చితార్థం జరగకుండా ఆపే వాళ్లెవ్వరినీ క్షమించను అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. దీప కూతుర్ని తీసుకుని మళ్ళీ సుమిత్ర ఇంటికి చేరుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 22 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 103వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మీరు ఈ పెళ్లి చేసుకుని తీరాలి కార్తీక్ బాబు,మీరు ఎవరినైనా ఇష్టపడి ఉంటే నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు, ఈ పెళ్లి వద్దు అనటానికి కారణాలు కూడా లేవు అందుకే చెప్తున్నాను మీరు ఈ పెళ్లి చేసుకోండి మీరు పెళ్లి చేసుకుంటే తల్లిగా నేను బ్రతుకుతాను, ఎవరి అపనిందల కి బలి అవ్వను అంటుంది దీప. అయినప్పటికీ కార్తీక్ ఈ పెళ్లి జరగదు..

Karthika Deepam 2 Serial 22th July 2024 Episode Number 102 Here is full story

అవసరమైతే పాప కోసం జీవితాంతం పెళ్లి చేసుకోవడం మానేస్తాను అని చెప్తాడు.అలాంటి నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్లందరినీ బాధ పెట్టకండి. కోడల్ని చేసుకోవాలని మీ అమ్మగారు, మిమ్మల్ని అల్లుడు చేసుకోవాలని మీ మామయ్య ఎన్నో కలలు కన్నారు.జ్యోత్స్న ని పెళ్లి చేసుకోకపోవడానికి మీ దగ్గర కారణాలు లేకపోవచ్చు కానీ తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి.తను మీ మీదే ప్రాణాలు పెట్టి బ్రతుకుతుంది.

మీ పెళ్లి చాలా ప్రశ్నలకి సమాధానం మీరు పెళ్లి చేసుకుంటే నేను నా కూతురు కూడా ప్రశాంతంగా ఉంటాం అంటుంది. ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మంచి నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తున్నాను అనుకుంటుంది దీప. మరోవైపు దీప తనంతటతానుగా ఇంటికి రావడం గురించి చర్చించుకుంటూ ఉంటారు జ్యోత్స్న, పారిజాతం.

మీ బావ దీపని ఇంటికి తీసుకువచ్చి హాస్పిటల్లో చెప్పిన మాటలే ఇక్కడ కూడా చెప్తాడేమో అంటుంది పారిజాతం. ఆ మాటలకి కోప్పడుతుంది జోత్స్న. శత్రువుని మన కళ్ళ ముందే పెట్టుకోవాలి అని దీపని తీసుకు వద్దామని చెప్పావు తీరా తను వస్తే ఇప్పుడు ఇలా అంటున్నావు అంటుంది. నేను నీ పెళ్లి జరగడం కోసమే టెన్షన్ పడుతున్నాను అంటుంది పారిజాతం. నువ్వేమి టెన్షన్ పడకు రిలాక్స్డ్ గా ఉండు బావ హాస్పటల్లో చెప్పినలాంటి మాటలు వంద చెప్పినా కూడా బావే నా భర్త అంటుంది జ్యోత్స్న.

పారిజాతం ఇంకేదో మాట్లాడే లోపు తననే కోపంగా చూస్తున్న భర్తను చూసి షాక్ అవుతుంది. శివ నారాయణ కోపంతో రగిలిపోతూ మనకన్నా చిన్నవాళ్ళ తో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో కాస్తయినా ఆలోచించవా అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా మళ్లీ నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే మడిచి మూలన కూర్చోబెడతాను అని భార్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మనవరాలి తో నీ గ్రానీకి కొంచెం దూరంగా ఉంటే మంచిది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు.

తాతయ్య మాటలు లైట్ తీసుకో గ్రానీ ఆయనకి జరిగిందేమీ తెలియదు కదా అందుకే అలా మాట్లాడుతున్నారు అని పారిజాతాన్ని ఊరడిస్తుంది జ్యోత్స్న. మరోవైపు కారులో వెళ్తున్న కార్తీక్ తన పెళ్లి గురించి ఆలోచనలో పడతాడు, దీప నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది గాని బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఇటు నాతో పాటు అటు జ్యోత్స్న కూడా బాధపడాలి. అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారంటే నాన్న అమ్మని అంతగా ప్రేమిస్తాడు, భర్తగా ఆయనే నాకు ఇన్స్పిరేషన్ భర్త అంటే అలా ఉండాలి అనుకుంటాడు.

అంతలోనే రోడ్డు మీద కనిపించిన తండ్రిని చూసి షాక్ అవుతాడు కార్తీక్. క్యాంపుకు వెళ్తానని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటూ అతని దగ్గరకు వెళ్లే లోపు అక్కడికి స్వప్న, కావేరి రావటం చూసి షాక్ అవుతాడు. స్వప్నకి తండ్రి శ్రీధర్ అని వాళ్ళ మాటల ద్వారా తెలుసుకొని భరించలేక పోతాడు. ఆ తర్వాత స్వప్నని పిలిపించి స్వప్న తండ్రి గురించి ఎంక్వయిరీ చేస్తాడు. స్వప్న తన ఫ్యామిలీ ఫోటో చూపించి తన ఫ్యామిలీ విషయాలన్నీ చెప్తుంది.

మీ నాన్న వేరే ఎవరితోనో కనిపించారు అన్నావు కదా నిలదీస్తానన్నావు అడిగావా అంటాడు కార్తీక్. దీప అడగొద్దంది అందుకే అడగలేదు అయినా దీప ని ఇకమీదట నేను కలవను ఆరోజు రెస్టారెంట్లో మమ్మీని అవమానపరిచింది మమ్మీ చాలా ఫీల్ అయింది అంటుంది స్వప్న. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుతెచ్చుకుంటాడు కార్తీక్. స్వప్న నా చెల్లెలని దీప కి ముందే తెలుసు అందుకే తన బాధ్యతలు నాకు అప్పగించింది, నాన్నని కావాలనే ఆరోజు తప్పించింది అనుకుంటాడు.

సరే నువ్వు వెళ్ళు మనం మళ్ళీ కలుద్దాం అంటూ కారు దగ్గరికి వెళ్లిన కార్తీక్ స్వప్నని చూస్తూ ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను కానీ నాన్న పిన్నిని కూడా గిఫ్ట్ గా ఇస్తాడు అనుకోలేదు అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతాడు. బాస్ ఏమిటి ఈ రోజు ఇంత సీరియస్ గా ఉన్నాడు అనుకుంటుంది స్వప్న. కార్లో వెళ్తున్న కార్తీక్ నాన్న నన్ను నా తల్లిని ఎంత మోసం చేశాడు, అయినా నాన్న రెండో పెళ్లి గురించి దీప కి ఎలా తెలుసు అని ఆలోచనలో పడతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X