Karthika Deepam 2 April 6th దీపపై సుమిత్ర అత్త కుట్రలు.. వంటలక్క సంచలన నిర్ణయం!

నీవు నా ఉంచుకొన్న భార్యవు.. నాకు అవసరమైనప్పుడు వచ్చి నీతో గడుపుతాను అంటూ నరసింహ చెప్పిన మాటలకు , అలాగే నరసింహ రెండో భార్య అనసూయ అన్న సూటిపోటి మాటలతో దీప బాధపడింది. ఆ బాధలో నడుచుకొంటూ వెళ్తుంటే.. ఓ కారు వచ్చి దీపను, శౌర్యను గుద్దబోయింది. ఇంతలోనే సుమిత్రను గుర్తు తెలియని ఎటాక్ చేయడంతో దీప కాపాడుతుంది. ఆ సమయంలో దీప తలకు గాయం అవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. తలకు జరిగిన గాయానికి చికిత్స చేసిన తర్వాత సుమిత్ర తమ ఇంటికి తీసుకెళ్లింది. ఇదాంత గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 6వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 12వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

హాస్పిటల్‌లో బెడ్ పైన ఉన్న దీపను చూసి.. నీవు బయట ఉంటే.. నీ ప్రాణాలకు ప్రమాదమట కాద..నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారట కద.. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం అని శౌర్య అంటే.. మిమ్మల్ని ఎవరు ఎటాక్ చేయరు. ఎవరైనా అలా చేస్తే నేను తాట తీస్తాను. మీ అమ్మమ్మను నేను ఉన్నానుగా అంటూ సుమిత్ర చెప్పింది. అయితే దీప వద్దని అంటే.. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు నీవు కాపాడావు. నీవు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను కాపాడుకొంటాను అని సుమిత్ర చెప్పింది. సబ్ ఇన్స్‌పెక్టర్‌కు చెప్పి దీపను తమ ఇంటికి సుమిత్ర దంపతులు తీసుకెళ్లారు.

Karthika Deepam season 2 Episode Number 10 April 6th 2024 Deepa shifted to Sumitra house from Hospital

సునీతను కాపాడింది ఈమె. పేరు దీప. మా ఇంటి దీపాన్ని కాపాడావు అంటూ మామ అనగానే.. పీడ వదిలించుకొందామంటే.. నీవు మధ్యలో దాపురించావు అంటూ సునీత అత్త మనసులో అనుకొన్నది. పైకి నవ్వుతూ రా నీకు దిష్టి తీయాలని మంగళహారతితో ముందుకెళ్తే.. ఆగండి అత్తమ్మ.. దిష్టి తీయాల్సింది నాకు కాదు.. నా ప్రాణాలు కాపాడిన దీపకు అని సుమిత్ర తన అత్త చెబుతూ.. మీ ఆనందానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. నాకు తగలాల్సిన గాయం నీకు తగిలింది అని సుమిత్ర చెప్పింది.

అయితే నా జీవితంలో ఆనందం ఉంటే కద.. నాకు దిష్టి తగలేది అని దీప మనసులో అనుకొన్నది. వెంటనే దీపకు దిష్టి తీయండి అత్తయ్య అంటూ సునీత చెప్పగానే.. దిష్టి తీస్తూ.. ఏ ఖర్మరా.. సునీతను కాపాడిన వ్యక్తికి నేను దిష్టి తీయడం ఏమిటి అని మనసులో సునీత అత్త అనుకొన్నది. ఆ తర్వాత దీపను ఇంటిలోకి తీసుకెళ్లారు.

Karthika Deepam season 2 Episode Number 10 April 6th 2024 Deepa shifted to Sumitra house from Hospital

దీప లేకపోతే ఈ రోజు నేను ఉండేదానిని కాదు అని సునీత అంటే.. ఇంతకు సుమిత్ర మీద ఎటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని మామయ్య అడిగితే.. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. త్వరలోనే నిందితులు ఎవరో తెలుస్తుంది. ఎటాక్ చేసిన వారిని దీప గుర్తు పడుతుంది. అప్పటి వరకు ఆమె మన ఇంట్లోనే ఉంటుంది అని సుమిత్ర భర్త అంటే.. మీ ఇల్లు చాలా పెద్దది. నేను ఉండటం మీకు ఇబ్బంది కాకపోవచ్చు. కానీ నాకు ఇబ్బంది ఉంది అని దీప చెప్పింది. దాంతో దీపను ఔట్ హౌస్‌లో ఉండటానికి ఏర్పాటు చేశారు.

సుమిత్రను కాపాడినంత మాత్రాన దీపను నెత్తిన పెట్టుకోవడం అవసరమా? అని అత్త తన తన భర్తతో అంది. దాంతో కోపగించుకొన్న ఆమె భర్త వెంటనే.. నీవు ఇలాంటి మాటలు మాట్లాడితే.. తల మీద ఒక్కటి బాదుతా.. అప్పుడు నీ తల ఉండదు. ఏది ఏమైనా దీప మన ఇంట్లోనే ఉంటుంది. సుమిత్రను చంపాలనుకొన్న వ్యక్తులు ఎవరు అని తెలిసేంత వరకు ఆమెను ఇక్కడే ఉంచి కాపాడుకొంటామని వార్నింగ్ ఇచ్చాడు.

అయితే ఔట్ హౌస్‌లో ఉండటానికి ఇష్టం లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లాలనుకొన్నది. అయితే శౌర్య ఎదురుగా ఉన్న సుమిత్ర ఇంటిని చూసి నాన్న వాళ్ల ఇల్లు కూడా ఇంత పెద్దగా ఉంటుందా? అనగానే దీప ఎమోషనల్ అయింది. అక్కడ నుంచి వెళ్లిపోవాలని మనసులో ప్లాన్ చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X