Karthika Deepam July 30th episode: శోభ చెంప పగలగొట్టిన అనసూయ.. జ్యోత్స్న ప్రవర్తనతో దీప కంటతడి!
నిశ్చితార్థం రోజున శౌర్య ని తీసుకుపోవటానికి శివ నారాయణ ఇంటికి వస్తారు నరసింహ, అనసూయ. నరసింహ తన తండ్రి అని తెలుసుకున్న శౌర్య భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది, నిశ్చితార్థం ఆగిపోయినందుకు జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. హాస్పిటల్ కి వచ్చిన సుమిత్ర దీపకే ధైర్యం చెప్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ జూలై 30వ తేదీ కార్తీకదీపం సీజన్ 2 లో 110 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే..
జ్యోత్స్న దగ్గరికి ఆమె ఫ్రెండ్స్ వస్తారు, నీ నిశ్చితార్థం ఆగిపోయింది అని తెలిసి చాలా బాధనిపించింది, నాకెందుకో మీ బావ నిన్ను ప్రేమించడం లేదేమో అనిపిస్తుంది అంటుంది ఒక ఫ్రెండ్. అలా అని నీతో చెప్పాడా అంటుంది జ్యోత్స్న. చెప్పక్కర్లేదు, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, ఆ రోజు నీ బర్త్ డే అప్పుడు కూడా కార్తీక్ ప్రవర్తన అలాగే ఉంది, గౌతమ్ అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేదు, నువ్వా, శౌర్య అనే ప్రశ్న వచ్చినప్పుడు తను శౌర్యనే చూజ్ చేసుకున్నాడు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో అంటుంది ఫ్రెండ్. ఆ మాటలు విన్న సుమిత్ర వాళ్ళని కోప్పడుతుంది. తన బాధని మీరు మరిచిపోయేలా చేయాలి గానీ మీరు మరింత రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎలాంటి ఫ్రెండ్సో అని అంటూ కోప్పడుతుంది.

సుమిత్ర మాటలకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జ్యోత్స్న ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు వాళ్ల మీద కేకలు వేసినట్లు దీప మీద వేసి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, అయినా నిన్నని ఏం లాభం అనాల్సిన వాళ్ళనే అనాలి అంటూ పారిజాతాన్ని పిలుస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇప్పుడు దీప దగ్గరికి వెళ్లి ఏం గొడవ పెట్టుకుంటుందో అనుకుంటుంది సుమిత్ర. మరోవైపు అనసూయ దగ్గరికి వెళ్లిన శోభ నా భర్తని అందరి ముందు ఎందుకు తిట్టారు అంటూ నిలదీస్తుంది.
తండ్రి అన్నవాడు ఎవడైనా పిల్ల స్పృహ తప్పిపోతే ముఖం మీద నీళ్లు జల్లి ఎలా ఉందో అని తపన పడతాడు అంతేగాని ఎలా పోతే ఏంటి అని భుజాన్ని వేసుకొని రాడు అంటుంది అనసూయ. అయితే ఆ బిడ్డకు తండ్రి కార్తీకా, అందుకే అంత తపనపడ్డాడా అంటుంది శోభ. ఆమె చెంప పగలగొడుతుంది అనసూయ, శౌర్య పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను, ప్రేమ చూపించినంతమాత్రాన తండ్రి అయిపోడు అంటూ కోప్పడుతుంది.

శౌర్య ని ఇంటికి తీసుకువస్తానన్నారు అదీ లేదు, ఇప్పుడు మా పిన్ని మనవరాలిని వేరే ఎవరో దత్తత తీసుకున్నారు అంట ఇప్పుడు రెంటికి చెడిపోయాను మీరు ఏదో ఒకటి చేయకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ. కోడల్ని తిట్టుకుంటూ శౌర్య ఆరోగ్యం ఎలా ఉందో అని బాధపడుతుంది అనసూయ. మరోవైపు బూచోడొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అని భయపడుతున్న శౌర్యకి భయం లేదు అని ధైర్యం చెప్తాడు కార్తీక్.
అయితే నాకు నువ్వు తోడుగా ఉంటావని ప్రామిస్ చెయ్యు అంటుంది శౌర్య. కార్తీక్ ఆమె చేతిలో ప్రామిస్ చేయబోతే అడ్డుకుంటుంది దీప. శౌర్యకి ధైర్యం చెప్పి బయటకు వస్తాడు కార్తీక్. అప్పటికే అక్కడ పారిజాతం, జ్యోత్స్న ఉంటారు. శౌర్య ని చూడటానికి వచ్చారా అని అడుగుతాడు కార్తీక్. అవును కానీ అంతకన్నా మంచి సీన్ చూసాను అంటుంది జ్యోత్స్న.అంతలోనే దీప బయటికి వస్తుంది.పాప ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది జ్యోత్స్న. బానే ఉంది అంటుంది దీప.

ఎవరు ఎలా పోయినా మీరు మాత్రం బానే ఉంటారు అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. తర్వాత జీవితకాలం తోడుంటానని ఎవరికి మాట ఇస్తున్నావు తల్లికా పిల్లకా అని కోపంగా అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాటలకి కార్తీక్ కోప్పడితే దీప కన్నీరు పెట్టుకుంటుంది. పారిజాతం కార్తీక్ తో మాట్లాడుతూ నువ్వు ఎన్ని చేసినా ఆఖరికి నా మనవరాలునే పెళ్లి చేసుకోవాలి అది గుర్తుంచుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పారిజాతం, జోత్స్న.
మీరు ఎందుకు పాపని రక్షించారు, మీరు మాకు చేస్తున్న సాయం వేరే వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది పాప కోలుకున్న వెంటనే నేను పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ శౌర్య దగ్గరికి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు పారిజాతాన్ని భోజనానికి రమ్మంటుంది జ్యోత్స్న ఈ సమయంలో ఎవరికి మాత్రం భోజనం చేయాలనిపిస్తుంది అంటుంది పారిజాతం. ఆమెకి ధైర్యం చెప్పి ఇంట్లో వాళ్ళని కూడా భోజనానికి తీసుకువస్తాను నువ్వు రా అని భోజనానికి తీసుకువెళ్తుంది జ్యోత్స్న.

డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న తల్లిదండ్రులని, తాతని చూసి నా నిశ్చితార్థం ఆగిపోయిందనే బాధ ఏమాత్రం లేకుండా ఎలా తింటున్నారో అనుకుంటూ కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. భోజనం చేస్తూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర దంపతులు, శివ నారాయణ. అప్పుడే కార్తీక ఫోన్ చేసి త్వరగా హాస్పిటల్ కి రా అని సుమిత్రకి ఫోన్ చేస్తాడు. ఏమైంది అని కంగారుగా అడుగుతుంది సుమిత్ర తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











