Karthika Deepam July 31th episode: జరుగుతున్న సంఘటనలకి కుమిలిపోతున్న శివ నారాయణ.. జ్యోత్స్న కి క్షమాపణ చెప్పి
నిశ్చితార్థం రోజున కూతుర్ని తీసుకుపోవడానికి శివ నారాయణ ఇంటికి వస్తారు నర్సింహ, అనసూయ. అక్కడ నర్సింహ తన తండ్రి అని తెలుసుకున్న శౌర్య భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. నిశ్చితార్థం ఆగిపోయినందుకు జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఇంట్లో గొడవ గొడవ చేస్తుంది. మరోవైపు శౌర్య ఆరోగ్యం ప్రమాదంగా ఉందని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు డాక్టర్ ఆ విషయం దీపక్ చెప్పడు కార్తీక్. హాస్పిటల్ కి వచ్చి జ్యోత్స్న,పారిజాతం ఇద్దరూ గొడవ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 31వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 111వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ సుమిత్ర కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. సుమిత్ర కంగారు పడకు నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ తింటున్న పళ్లెంలోనే చేతులు కడిగేసి హాస్పిటల్ కి బయలుదేరబోతుంది. ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ తింటున్న పళ్లాన్ని నేలకేసి కొడుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆగిపోయిన నిశ్చితార్థం గురించి ఎవరికీ బాధ లేదు, నేను ఇందాకట్నుంచి ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టుకోలేదు అది కూడా ఎవరు గమనించలేదు.

ఒకరు హోటల్ రెన్నోవేషన్ గురించి, ఒకళ్ళు ఆరోగ్య సూత్రాలు గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకరు సంబంధమే లేని మనిషి కోసం ప్లేట్లో చేతులు కడిగేసి వెళ్ళిపోతున్నారు అంటూ కోపంగా మాట్లాడుతుంది. జ్యోత్స్న మీద కోప్పడుతుంది సుమిత్ర. నిన్నేమీ ఆపటం లేదు కదా మమ్మీ కావాలంటే క్యారియర్ కూడా పట్టుకెళ్లు,పాపం దీప తిందో లేదో అంటుంది జ్యోత్స్న. దీప మీద నాకు ఉన్నది జాలి మాత్రమే ఉంటుంది సుమిత్ర.
శివ నారాయణ కూడా అన్నాన్ని నేలకేసి కొట్టావు అది ఎంత పాపం తెలుసా అని మనవరాల్ని మందలిస్తాడు. అన్నం నేల పాలైయిందని బాధే గాని నా బాధ ఎవరికి అక్కర్లేదు,పాపమైతే అది నేను మోస్తాను ఇప్పుడు మోస్తున్న భారం కంటే అదేమీ ఎక్కువ కాదు అని బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స. బాధపడుతున్న సుమిత్ర అని నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు నేను జ్యోత్స్న తో మాట్లాడతాను అని భార్యని హాస్పిటల్ కి పంపిస్తాడు దశరధ్.

శివ నారాయణ కొడుకుతో మాట్లాడుతూ మనవరాలు బాధలో కూడా అర్థం ఉంది కానీ మనం ఇంటికి పిలిచిన దీప పరిస్థితి బాగోకపోతే ఏమీ పట్టకుండా ఉండలేము కదా, పాప మీద ప్రేమ పెంచుకున్న కార్తీక్ తనకే తెలియకుండానే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోయాడు ఇందులో తప్పు ఎవరిది? దీపదా? కార్తీక్ దా? జ్యోత్స్న దా? లేదంటే ఇదంతా చూస్తూ ఏమి చేయలేకపోయినా మనదా అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్ కి వెళ్లిన సుమిత్ర కార్తీక్ ని కలుస్తుంది.
జ్యోత్స్న, పారిజాతం హాస్పిటల్ కి వచ్చిన విషయం చెప్తాడు కార్తీక్. నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తుంది సుమిత్ర. నీ కూతురుతో నిశ్చితార్థం ఆగిపోయినందుకు నీకు బాధగా లేదా, నా మీద కోపం లేదా అంటాడు కార్తీక్. నువ్వు వేరే కారణంతో నిశ్చితార్థం ఆపేస్తే కోపం ఉండేది కానీ ఒక పసి దాని ప్రాణం కాపాడావు ఎందుకు కోపం అంటుంది సుమిత్ర. నిశ్చితార్థం ఆపేసినందుకు ఇప్పటివరకు గిల్టీగా ఉంది ఇప్పుడు నీ మాటలతో రిలాక్స్డ్ గా ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

తర్వాత దీప దగ్గరికి వెళ్లిన సుమిత్ర తన మాటలతో దీపని ఒప్పించి తనతో పాటు తీసుకు వెళ్తుంది. మరోవైపు భోజనం ముందు కూర్చున్న నర్సింహ తల్లితో హాస్పిటల్ కి వెళ్ళిన విషయం చెప్తాడు. అక్కడ ఏమి గొడవ చేయలేదు కదా అని కంగారుగా అడుగుతుంది అనసూయ. గొడవ చేస్తే ఇంత ప్రశాంతంగా ఎందుకు భోంచేస్తాడు అంటుంది శోభ. అసలు ఇదంతా నీ వల్లే, నీకే పిల్లలు పుట్టి ఉండి ఉంటే ఆ బుడ్డదానితో మనకి బాధలు వచ్చేవి కాదు అంటుంది అనసూయ.
నన్ను మీ అమ్మ గొడ్రాలు అంటుంది అని ఏడుస్తుంది శోభ. ప్రేమగా ఆమెని ఓదార్చి భోజనం తినిపిస్తాడు నర్సింహ. ఈ ప్రేమ నీ కూతురు మీద చూపించి ఉండి ఉంటే అది నీ దగ్గరికి వచ్చేది. బిడ్డ కావాలి అనుకుంటే రాక్షసుడి లాగా కాకుండా ఒక తండ్రి లాగా ప్రవర్తించు అని కొడుక్కి సలహా ఇస్తుంది అనసూయ. మరోవైపు ఇంటికి వచ్చిన దీప సుమిత్ర తో మాట్లాడుతూ మీ మాట కాదనలేక ఇక్కడికి వచ్చాను కానీ జ్యోత్స్న ఏమనుకుంటుందో అంటుంది దీప.


Click it and Unblock the Notifications











