Karthika Deepam:కొడుక్కి అవమానం జరిగితే భరించలేనంటున్న దాసు..భర్త దగ్గర బలవంతంగా మాట తీసుకున్న పారిజాతం!

అస్తమానం కార్తీక్ కి ఫోన్ చేస్తున్న శౌర్యతో ఆయనని ఇబ్బంది పెట్టవద్దు అని మందలిస్తుంది దీప. ఫోన్ ఆపకపోవడంతో ఆ మాటలు విన్న కార్తీక్ శౌర్యని తన నుంచి దూరం చేయవద్దు అని దీపతో చెప్తాడు. కూలి పని చేసుకుంటూ తన కంటపడిన అనసూయని తన ఇంటికి వచ్చేలా ఒప్పిస్తుంది దీప. శౌర్య గుండెజబ్బు గురించి మందుల షాపు వాడి ద్వారా తెలుసుకున్న అనసూయ బాధపడుతుంది. దారిలో కనిపించిన నర్సింహ ఇల్లు తన పేరు మీద రాయమని తల్లి తో గొడవ పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 29 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 135వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తల్లి కోసం ఎదురుచూస్తున్న దాసు అమ్మ ఇక్కడికే రమ్మంది కదా ఇంకా రాలేదేమిటి అనుకుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన తల్లితో నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు దాసు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అంటుంది పారిజాతం. అంత పెద్ద తప్పు చేసావా అని అడుగుతాడు దాసు. వీడేమిటి అన్ని తెలిసినట్లే మాట్లాడుతున్నాడు అనుకుంటుంది పారిజాతం. తర్వాత దాసుని తీసుకొని తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఆ ఇంట్లో నాకే చోటు లేదు ఇంకా నా కొడుకు ఏం వస్తాడు అయినా శివ నారాయణ గారు రానిస్తారా, అయినా ఎందుకు రమ్మంటున్నావు అని అడుగుతాడు దాసు.

Karthika Deepam season 2 Episode Number 135 August 29th 2024 Deepa is shocked to know that Kashi is Parijatam s grandson

జ్యోత్స్న చేత వాడికి రాఖీ కట్టిస్తాను, నా మనవడిని ఆ ఇంటికి దగ్గర చేస్తాను అంటుంది పారిజాతం. దాసు ముందు అభ్యంతరం చెప్తాడు కానీ అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి కొడుకుని ఒప్పిస్తుంది పారిజాతం. సరే నేను కూడా నీతో మాట్లాడాలి అంటాడు దాసు. ఏమిటి అంటుంది పారిజాతం. ఇప్పుడు కాదు రేపు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. మరోవైపు అనసూయ దీప మాట్లాడుకుంటూ పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడే అనసూయ దేవుడి దగ్గర డబ్బా చూసి ఇది ఏమిటి అని అడుగుతుంది. కార్తీక్ బాబుకి ఇవ్వవలసిన డబ్బు అంటూ జరిగిందంతా చెబుతుంది దీప.

తమ్ముడు ఫోటో మీకు చూస్తూ నీ పెంపకానికి, నా పెంపకానికి ఎంత తేడా ఇప్పుడు కూడా నువ్వే గెలిచావు అనుకుంటుంది అనసూయ. అప్పుడే మంచం మీద గెంతులు వేస్తున్న శౌర్య ని చూసి కంగారు పడి ఆమె దగ్గరికి వెళ్లి గెంతొద్దు అని చెప్తుంది. ఎందుకు అని అడుగుతారు దీప, శౌర్య. నిజం చెప్పబోయి ఆగిపోతుంది పారిజాతం. పడితే దెబ్బలు తగ్గుతాయి అందుకే వద్దన్నాను, అయినా ఆడావంటే నేను కార్తీక్ బాబుతో చెప్తాను అంటుంది. కార్తీక్ తో చెప్పొద్దు అంటుంది శౌర్య.

Karthika Deepam season 2 Episode Number 135 August 29th 2024 Deepa is shocked to know that Kashi is Parijatam s grandson

సరే అన్న అనసూయ దీప తో వెళ్లి వంట చేయమని చెప్పి శౌర్య గెంతులు వేయకుండా ఉండటం కోసం కథలు చెప్పడం ప్రారంభిస్తుంది. అత్తలో వచ్చిన మార్పుకి ఆనందపడుతుంది దీప. మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన పారిజాతం తన మనవడి సంగతి చెప్పి రాఖీ కట్టించడానికి ఇంటికి రమ్మన్నాను అని చెప్తుంది. ఆమె మాటలకి కోప్పడతాడు శివ నారాయణ, దాసుకే దిక్కులేదు అంటే వాడి కొడుకుని రప్పిస్తానంటావేంటి అంటాడు. అప్పుడు పారిజాతం మాట్లాడుతూ మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనిని రక్షించలేదని కార్తీక్ జ్యోత్స్న మీద చాలా కోపంగా ఉన్నాడు అంటుంది పారిజాతం.

నిజమే దానికి దీనికి సంబంధం ఏమిటి అంటాడు శివ నారాయణ. ఆక్సిడెంట్ జరిగింది ఎవరికో కాదు నా మనవడికి, అందుకే వాడిని తీసుకువచ్చి వాడికి రాఖీ కట్టిస్తే కార్తీక్ కి జ్యోత్స్న మీద ఉన్న చెడు అభిప్రాయం పోతుంది అని భర్తతో చెప్పి అతడిని బలవంతంగా ఒప్పిస్తుంది పారిజాతం. కానీ వచ్చినవాళ్లు రాఖీ కట్టేసిన వెంటనే వెళ్ళిపోవాలి లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని కోపంగా అంటాడు శివ నారాయణ.

మీరు ఒప్పుకున్నారు అంతే చాలు మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతుంది పారిజాతం. మరోవైపు ఊరికి బయలుదేరిన దీప,అనసూయ శౌర్య కి విషయం చెప్పి సుమిత్ర ఇంట్లో ఉండమని చెప్తారు. శౌర్య తన సైకిల్ విషయం మళ్ళీ నానమ్మకి గుర్తుచేసి సుమిత్ర ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దీప అత్త తో మాట్లాడుతూ మరొకసారి ఆలోచించు అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందేమో అంటుంది.

ఇన్నాళ్ళు అలా భయపడే బ్రతికాము, ఇక భయపడవలసిన పనిలేదు నువ్వు కేసు పెడితే జైల్లో ఉండాలన్న సంగతి నర్సింహకి తెలుసు అంటుంది అనసూయ. అత్త మాటలకి కన్వేన్స్ అవుతుంది దీప. ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో దాసు అతని కొడుకు రావటం చూసి వీళ్ళు ఏమిటి ఇక్కడికి వస్తున్నారు అంటూ అభిమానంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్కడికి వచ్చారేంటి బాబాయ్ నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అంటుంది దీప.

Karthika Deepam season 2 Episode Number 135 August 29th 2024 Deepa is shocked to know that Kashi is Parijatam s grandson

నువ్వు ఎక్కడ ఉన్నావ్ ఏంటి అంటాడు దాసు. అదేంటి మీరు నా కోసం రాలేదా అంటుంది దీప. లేదు,మమ్మల్ని చూసి మీరు ఎలా షాక్ అవుతున్నారో నిన్ను చూసి మేము అలాగే షాక్ అవుతున్నాము అంటాడు దాసు. రెండు ముక్కల్లో దీప ఎందుకు ఎక్కడ ఉందో చెప్పేస్తుంది అనసూయ. పారిజాతం తనకి తల్లి అవుతుందని ఆమె పిలిస్తేనే ఇక్కడికి వచ్చామని చెప్తాడు దాసు. ఈ విషయం కార్తీక్ బాబుకు తెలుసా అంటుంది దీప.

అప్పటికి నాకు కార్తీక్ ఎవరో తెలియదు అందుకే నిజం చెప్పలేదు అంటాడు దాసు. కార్తీక్ బాబు వీళ్ళ గురించి ఎప్పుడూ చెప్పలేదంటే వీళ్ళ మధ్య ఎంత దూరం ఉందో అనుకుంటుంది దీప. మీరు ఈ ఇంటికి వచ్చి ఎన్నాళ్ళు అయింది అని దాసుని అడుగుతుంది. అదంతా పెద్ద కధ తర్వాత మాట్లాడుకుందాం అంటాడు దాసు. తర్వాత కాశీ రాఖీ కట్టమని దీపని అడుగుతాడు. ముందు మొహమాటపడినా తర్వాత దాసు, అనసూయ ఒప్పించడంతో కాశీకి రాఖీ కొడుతుంది దీప.

అప్పుడు కాశీ డబ్బులు ఇవ్వబోతే అక్క అనే పిలుపుని బహుమతిగా ఇచ్చావు అంతకంటా విలువైనదైతే నాకు బహుమతిగా ఇవ్వు అంటుంది దీప. తర్వాత జ్యోత్స్న కోసం మళ్లీ రాఖీ కొనడానికి వెళ్తారు తండ్రి, కొడుకులు. స్వప్న కాశీల ప్రేమ విషయం గురించి ఆలోచిస్తూ కార్తీక్ బాబు పెద్ద సమస్యలో పడ్డారు అనుకుంటుంది దీప. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అనసూయ ఏం లేదు పదా వెళ్దాం అనటంతో ఇద్దరు అక్కడినుంచి బయలుదేరుతారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X