Karthika Deepam 2 April 8th: ఆ ఇంట్లో కార్తీక్ ని చూసి షాకైన తల్లి కూతుర్లు.. ఇరకాటంలో పడ్డ పారిజాతం!

సుమిత్రను గుర్తు తెలియని ఎటాక్ చేయడంతో దీప కాపాడుతుంది. ఆ సమయంలో దీప తలకు గాయం అవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. తలకు జరిగిన గాయానికి చికిత్స చేసిన తర్వాత సుమిత్ర తమ ఇంటికి తీసుకెళ్లింది. ఆ ఇంట్లో కార్తీక్ ని చూసిన సౌర్య, దీప షాక్ అవుతారు.దీప చూపుకి కార్తీక్ కూడా గిల్టీ గా ఫీల్ అవుతాడు. సుమిత్ర దీప కష్టాన్ని తెలుసుకోవాలనుకుంటుంది కానీ దీప చెప్పటానికి ఇష్టపడదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 8 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 13వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది శౌర్య. ఆమెని సముదాయిస్తూ ఉంటారు సుమిత్ర దంపతులు. అంతలోనే అక్కడికి కార్తీక్ రావడంతో దీప వాళ్ళని పరిచయం చేస్తుంది కార్తీక్ మరదలు. దీప, సౌర్య ఇద్దరూ కార్తీక్ ని చూసి షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో సౌర్య మాట్లాడుతూ అంకుల్ మనం ఎక్కడికి వెళితే అక్కడ కనిపిస్తున్నారు మన వెనకే వస్తున్నారా.. ఈ ఇల్లు కూడా అతనిదే అంటుంది. రెండు రోజులు ఉండు ఉండి వెళ్ళిపోయే దానికి ఎవరి ఇల్లు అయితే ఏంటి అంటుంది దీప.

Karthika Deepam 8th April

అది కాదమ్మా ఆ అంకుల్ మూడుసార్లు కనిపించారు కానీ నాన్న ఒకసారి కూడా కనిపించలేదు ఎందుకు అని అడుగుతుంది సౌర్య. సౌర్యని దగ్గరికి తీసుకొని నీ తండ్రి మోసం చేశాడు అని చెప్తే అర్థం చేసుకోలేని పసివయసు నీది అని కన్నీరు పెట్టుకుంటుంది. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియని శౌర్య ఆమె కన్నీరు తుడుస్తుంది. మరోవైపు దీప తనని చూసిన చూపుకి గిల్టీగా ఫీల్ అవుతాడు కార్తీక్. నేను మీ నాన్నని చంపలేదు, అసలు ఆరోజు జరిగిన సంగతి ఏమిటో నీకు చెప్పడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటాడు.

మరోవైపు దిగులుగా కూర్చున్న తల్లి కూతుర్ల దగ్గరికి ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది సుమిత్ర. ఆ ఫ్రూట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది సౌర్య. ఆ తర్వాత దీప కష్టాలు ఏమిటో అని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది సుమిత్ర. తల్లిదండ్రుల గురించి చెప్తుంది కానీ భర్త గురించి చెప్పడానికి ఇష్టపడదు దీప. రెండు రోజుల్లో ఉండి వెళ్ళిపోయేదాన్ని నాకష్టం మీకెందుకులెండి అంటుంది. నేను నీ దగ్గర అవ్వాలనుకుంటున్నాను కానీ నువ్వు దూరంగానే ఉండాలి అనుకుంటున్నావు.

Karthika Deepam season 2 Episode Number 14 April 8th 2024

కానీ నువ్వు ఎప్పుడు కష్టం చెప్పుకోవాలి అనుకున్నా నీకు దగ్గరలోనే ఉంటానని మాత్రం గుర్తుంచుకో అంటుంది సుమిత్ర. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూస్తాడు పనివాడు. నేరుగా సుమిత్ర అత్త దగ్గరికి వెళ్లి ఆమె నన్ను గుడిలో చూసినట్లుగా ఉంది మీరే ఏదో ఒకటి చేయండి అని బాంబు పేలుస్తాడు. అప్పటికే టెన్షన్లో ఉన్న సుమిత్ర అత్త మరింత టెన్షన్ పడిపోతుంది. ఎలాగైనా దీప ని ఇంట్లోంచి పంపించేయాలి లేదంటే తను నాకు ఎప్పటికైనా ప్రమాదమే అనుకుంటుంది సుమిత్ర అత్త.

మరోవైపు నిద్రపోకుండా తన సైకిల్ నానమ్మ అమ్మేస్తుందేమో అని తల్లిని అనుమానంగా అడుగుతుంది శౌర్య. అలాంటిదేమీ జరగదులే అని ధైర్యం చెబుతుంది దీప. మనసులో మాత్రం కూతురికి కూడా అన్యాయం చేశావు, రేపటి రోజు ఎలాగో ఏమిటో అనే సందిగ్ధం లో పడేసావు అని భర్తని తిట్టుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X