Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!

గుడిలో దీప భర్త ఆమెని అవమానించేలాగా మాట్లాడతాడు. కార్తీక్ అతని చెంప చెళ్ళు మనిపిస్తాడు. జోత్స్న పుట్టిన రోజున వంటలు చేయటానికి ఒప్పుకుంటుంది దీప. దీపని ఒప్పించి శౌర్య ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు కార్తీక్. అక్కడ నర్సింహ దంపతులని చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్. దీప ని ఊరు నుంచి పంపించేయమని నర్సింహాని హెచ్చరిస్తుంది శోభ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 20 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 24వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శౌర్య పువ్వులు కోస్తూ ఉంటే వద్దంటాడు బంటు. ఇప్పుడే నీ పని అమ్మతో చెప్తాను అంటూ దీపకి విషయం చెప్తుంది శౌర్య.అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం దానితో నీకెందుకు, పూలు కోసుకోనీ అంటుంది. మన ఇంట్లో వాళ్ళ పెత్తనం ఏంటమ్మా అంటాడు బంటు. ఇది అసలు మన ఇల్లే కాదు అనుకో మొన్నే గొడవైంది మళ్ళీ గొడవ అయితే మనల్నే అంటారు అంటూ శౌర్య ని పూలు కోసుకోమని చెప్పి బంటు ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది పారిజాతం.

Karthika Deepam season 2 Episode Number 24 April 20th 2024 narasimha wants revenge on deepa

మరోవైపు రెడీ అయిన జ్యోత్స్న పెద్ద వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటుంది. కాంచన కోడల్ని దీవిస్తూ వచ్చే సంవత్సరం పుట్టిన రోజు నా ఇంట్లో నా కోడలిగా జరగాలి అంటుంది. కార్తీక్ కూడా జోత్స్న కి బర్త్డే విషెస్ చెప్తాడు. ఓన్లీ విషెస్ ఏనా నాకోసం ఏమీ తేలేదా అంటుంది జోత్స్న. వెంటనే పారిజాతం తన చేతిలో ఉన్న రెడ్ రోజ్ ని ఎవరూ చూడకుండా కార్తీక్ చేతిలో పెడుతుంది. కార్తీక కంగారుగా అదేమిటో చూసుకునే లోపే జ్యోత్స్న ఆనందపడిపోతూ నాకోసం నీ లవ్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావా అంటూ ఆనందపడిపోతుంది.

Karthika Deepam season 2 Episode Number 24 April 20th 2024 narasimha wants revenge on deepa

పారిజాతం ని కోపంగా చూస్తాడు కార్తీక్, నిజం చెప్పమంటూ సైగ చేస్తాడు. సరే అన్నట్టు కంటితోనే సైగ చేస్తుంది పారిజాతం. కేక్ కటింగ్ ప్రిపరేషన్ ప్రారంభమవుతాయి. అప్పుడే కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్లి ఈరోజు దీపకి కూడా పుట్టినరోజు అని చెప్తాడు. అంతలోనే శౌర్య వచ్చి అమ్మమ్మ బయటికి రా, అమ్మ వేసిన ముగ్గు చూడు అంటుంది. చూస్తాను గాని అమ్మని లోపలికి రమ్మను అంటుంది సుమిత్ర. దీప ని తీసుకొని ఇంట్లోకి వస్తుంది శౌర్య. అక్కడ వాళ్ళందరూ దీప కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు.

Karthika Deepam season 2 Episode Number 24 April 20th 2024 narasimha wants revenge on deepa

దీప కార్తీక్ ని కోపంగా చూస్తుంది ఈ విషయం సుమిత్ర గారికి చెప్పడం అవసరమా అంటూ కార్తీక్ ని కళ్ళతోనే నిలదీస్తుంది. శౌర్య మాట్లాడుతూ మా ఊర్లో మా అమ్మకి నేను తప్పితే ఎవరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పరు, ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారో అని ఆనందపడుతుంది. కేక్ కటింగ్ సెట్టింగ్ అంతా చూసి ఇదంతా ఏంటి అని అడుగుతుంది. పుట్టినరోజు కదా కేక్ కట్ చేయాలి అంటుంది సుమిత్ర.

కేక్ అంటే ఇది కాదు కదా అంటుంది శౌర్య. మరేంటి అంటుంది సుమిత్ర. ఇప్పుడే తీసుకు వస్తాను అని పరిగెత్తుకొని వెళ్లి తన రూమ్ కి వెళ్తుంది. అప్పుడే దీపతో పాపని ఇక్కడే చదివిద్దామనుకుంటున్నాము అంటాడు దశరథ్. అందుకు దీప ఒప్పుకోకపోతే జ్యోత్స్న దీపకి నచ్చ చెప్తుంది. ఇంతలో శౌర్య బన్ తీసుకువచ్చి ఇదే బర్త్డే కేక్ అంటే అంటుంది.

Karthika Deepam season 2 Episode Number 24 April 20th 2024 narasimha wants revenge on deepa

సరే మీ ఊర్లో మీకోసం ఎవరూ లేకపోయి ఉండవచ్చు కానీ ఇక్కడ మీకోసం ఒక పెద్ద కుటుంబమే ఉంది అని చెప్పి దీపని కూడా ఇక్కడే కేక్ వేయమని చెప్తారు. దీప అందుకు ఒప్పుకోదు అయినా సుమిత్ర ఊరుకోదు.చేసేదిలేక దీప బన్ కట్ చేస్తుంది, జ్యోత్స్న కేక్ కట్ చేస్తుంది. మరోవైపు దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు నర్సింహ. శోభ ని మంచినీళ్లు తీసుకు రమ్మంటే గాజులు లేని చేత్తో మంచినీళ్లు ఇస్తుంది. గాజులు ఏమయ్యాయి అంటాడు నర్సింహ.

ఎవరు వేసుకోవాలో తెలియక పక్కన పెట్టాను, మా అమ్మ వస్తుంది తనే చెప్తుంది ఎవరు వేసుకోవాలో అంటుంది. ఇప్పుడు మీ అమ్మ ఎందుకు అని కంగారు పడతాడు నర్సింహ. మర్యాదగా ఆ పిల్లని దీపని ఊర్లో నుంచి పంపించేయ్,నాకెందుకో ఆ పిల్ల నీకు పుట్టలేదేమో అనిపిస్తుంది. ముందు ఆ సంగతి తేల్చుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ. ఇంట్లో విలువ లేకుండా చేసేసింది దానిని ఊరికే వదిలిపెట్టను అని దీప మీద కోపంతో రగిలిపోతాడు నర్సింహ.

మరోవైపు ఊర్లో అప్పులు తీర్చక పోవడంతో ఇల్లు జప్తు చేస్తాను అంటాడు ఊరిపెద్ద. నా కోడలు కొడుకుని తీసుకొని వస్తుంది లేకపోతే నేనే వెళ్లి తీసుకొని వస్తాను అంటుంది అనసూయ. నీ కోడలు కూడా అలాగే చెప్పి వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు, నువ్వు కూడా వెళ్లి ఉండిపోతే మా సంగతేమిటి అంటాడు మల్లేష్. ఏం మాట్లాడలేక నిస్సహాయంగా ఉండిపోతుంది అనసూయ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X