Karthika Deepam 2 April 22th: దీపకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు.. టెన్షన్ లో పారిజాతం!

కార్తీక్ నర్సింహ చెంప చెళ్ళు మనిపిస్తాడు. జోత్స్న పుట్టిన రోజున వంటలు చేయటానికి ఒప్పుకుంటుంది దీప. దీపని ఒప్పించి శౌర్య ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు కార్తీక్. అక్కడ నర్సింహ దంపతులని చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్. దీప ని ఊరు నుంచి పంపించేయమని నర్సింహాని హెచ్చరిస్తుంది శోభ. పాపని షాపింగ్ తీసుకువెళ్లినందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 22 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 25వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కోడలు కొడుకుని తీసుకొని వస్తుంది మీ అప్పులన్నీ తీర్చేస్తుంది, లేదంటే నేను వెళ్లి నా కొడుకు నీ కోడల్ని తీసుకొని వస్తాను అని చెప్తుంది అనసూయ. వాళ్లు అలాగే చెప్పే పట్నం వెళ్లిపోయి రాలేదు నువ్వు వెళ్ళిపోయి ఉండిపోతే మా గతి ఏంటి, అందుకే నువ్వు వారంలోపు రాకపోతే ఈ ఇంటిని జప్తు చేస్తాము అంటాడు మల్లేష్. ప్రెసిడెంట్ కూడా మల్లేష్ మాటలకి సపోర్ట్ చేస్తాడు. వేరే దారి లేక అందుకు ఒప్పుకుంటుంది అనసూయ. అప్పుడు ప్రామిసరీ నోటి మీద వేలిముద్ర వేయమంటాడు మల్లేష్. ఎందుకు అంటుంది అనసూయ.

karthika-deepam-season-2

నీ మాట ఏమైనా నోటు అనుకున్నావా అంటాడు మల్లేష్.
తప్పనిసరి పరిస్థితులలో నోటు మీద వేలిముద్ర వేస్తుంది అనసూయ. మరోవైపు గుడిలో జ్యోత్స్న పేరు మీద అభిషేకం చేయిస్తుంది సుమిత్ర. అయిపోయిన తర్వాత దీప ని చూపిస్తూ ఈరోజు తన పుట్టినరోజు కూడా తన పేరు మీద కూడా అభిషేకం చేయండి అంటుంది. పూజారి దీపని గోత్రనామాలు అడుగుతాడు. పేరు దీప, నాకు ఈ గోత్రనామాలు తెలియదు అంటుంది. తల్లిదండ్రుల పేర్లు చెప్పమంటే తండ్రి పేరు కుబేర్ అని చెప్తుంది.

ఆస్తులలో ఏమీ లేకపోయినా పేరులో నీ తండ్రి కుబేరుడు అన్నమాట అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. నా తండ్రి ఆస్తులలో బికారి కావచ్చు కానీ నా మీద ప్రేమని పంచడంలో ఎప్పుడూ కుబేరుడే, నన్ను అనండి కానీ నా తండ్రిని ఏమీ అనొద్దు అంటూ పారిజాతం మీద ఫైర్ అవుతుంది దీప. తన చేత మాటలు పడటం అవసరమా అంటూ అత్తని మందలిస్తుంది సుమిత్ర. దీప ఆవేశాన్ని చూసి ఇది బయటికి నెమ్మదిగా ఉంది కానీ లోపల రగులుతున్న అగ్నిపర్వతం అనుకుంటుంది సుమిత్ర.

తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేసి రమ్మని జ్యోత్స్న కి, దీపకి చెప్తుంది సుమిత్ర. కాళ్లు నొప్పులుగా ఉన్నాయి నేను తర్వాత వెళ్తాను అంటుంది జ్యోత్స్న. నేను వెళ్లి ప్రదక్షిణలు చేసి వస్తాను అని వెళ్తుంది దీప. ప్రదక్షిణలు చేస్తూ ఉండగా బంటు సుమిత్ర ని చంపబోయిన వాడితో మాట్లాడటం చూసి షాక్ అవుతుంది. అదే విషయాన్ని కంగారుగా కార్తీక్ వాళ్ళ దగ్గరికి వచ్చి చెబుతుంది.

వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ బంటు మాత్రమే ఉంటాడు. బంటుని నిజం చెప్పమని నిలదీస్తాడు కార్తీక్. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని పారిజాతం కూడా రంగంలోకి దిగి నిజం చెప్పు అంటూ బంటుకి నాలుగు తగిలిస్తుంది. చెప్పొద్దు అంటూ లో గొంతుకుతో రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు బంటు అతను ఎవరో నాకు తెలియదు నేను ఫోన్ మాట్లాడుతుంటే హాస్పిటల్ అడ్రస్ అడుగుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ అతను మనల్ని ఫాలో అవుతున్నట్లుగా ఉన్నాడు.

Karthika Deepam season 2 Episode Number 25 April 22th 2024

మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనటంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఆ తర్వాత టెన్షన్ పడుతున్న పారిజాతం బంటు పై కోప్పడుతుంది. నువ్వు ఇచ్చే షాకులతోనే పోయేలాగా ఉన్నాను అయినా వాడితో నీకు మాటలు ఏంటి అని అడుగుతుంది. పేమెంట్ కోసం వచ్చాడు అంటాడు బంటు. వాడికి ఇచ్చేసాం కదా అంటుంది పారిజాతం. మీరు నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని సగం నేను వాడేసాను అంటాడు బంటు.

వాడిపై కోప్పడి ఇప్పుడే డబ్బులు ఇస్తాను వాడిని ఒక రెండు నెలల పాటు ఊర్లో ఉండొద్దని చెప్పు అంటుంది పారిజాతం. మరోవైపు వంటలు చేస్తున్న దీప దగ్గర ఎలా అయినా తన భర్త గురించి తన జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటుంది సుమిత్ర. దీపకి హెల్ప్ చేస్తున్న భాస్వరానికి వేరే పని చెప్పి పక్కకు పంపించేసి దీప దగ్గర నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X