Karthika Deepam 2 April 24th: దీపని చంపేస్తానంటూ బెదిరించిన నర్సింహ.. అసలు విషయం తెలిసి షాకైన సుమిత్ర!
నర్సింహ దంపతులని చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్. దీప ని ఊరు నుంచి పంపించేయమని నర్సింహాని హెచ్చరిస్తుంది శోభ. పాపని షాపింగ్ తీసుకువెళ్లినందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప. సుమిత్ర పై దాడి చేసిన వాడితో మాట్లాడుతూ దీపకీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బంటు. దీప వంటలు బాగా చేయడంతో సుమిత్ర వాళ్ళందరూ దీపని మెచ్చుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 24 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 27వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీపని బెదిరిస్తున్న నర్సింహ చెంప పగలగొడుతుంది సుమిత్ర. తను నీతో రాదు నువ్వు బయటికి నడువు అని హెచ్చరిస్తుంది. ఆ మాట చెప్పటానికి మీరెవరు అంటాడు నర్సింహా. దాని తల్లిని, దానికి ఎవరూ లేరని కదా బెదిరిస్తున్నావు, తనకి నేను ఉన్నాను అంటుంది సుమిత్ర. ఈరోజు మీరు కాపాడుతారు రేపటి రోజున ఎవరు కాపాడతారో నేను చూస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ నిన్ను చంపకుండా వదిలిపెట్టను అని హెచ్చరించి వెళ్లిపోతాడు నర్సింహ.

ఇదంతా బంటు పైనుంచి చూస్తాడు. విషయాన్ని పారిజాతానికి చెప్తాడు. వచ్చినవాడు ఎవడు,వాళ్లు ఏం మాట్లాడుకున్నారు అంటుంది పారిజాతం. వినిపించ లేదమ్మా కనిపించింది అంతే అంటాడు బంటు. సరే వాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటాడు వెతుకు. వాడెవడో తెలిస్తే, వాళ్ల కధేమిటో తెలిస్తే దీపని మనం బయటకు పంపించక్కర్లేదు వాడే లాక్కుపోయేలా చేద్దాం అంటుంది పారిజాతం.
మరోవైపు సుమిత్ర దీపతో మాట్లాడుతూ నీ తల్లిదండ్రుల గురించి చెప్పిన నువ్వు నీ భర్త గురించి ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు అతనితో నీకు సమస్య ఏమిటి అని అడుగుతుంది. ఇవాళో రేపో ఇంట్లోంచి వెళ్లిపోయే వాళ్ళం మా కష్టం మీకెందుకమ్మ, ఎవరైనా మా మీద జాలి పడితే నాకు ఇష్టం ఉండదు నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటుంది దీప. మాట్లాడితే వెళ్ళిపోతాను అంటావు అక్కడ ఎవరున్నారని వెళతావు అంటుంది సుమిత్ర. అక్కడ మా అత్తయ్య ఉంది అంటుంది దీప.
నీ గురించి బాధ్యత తీసుకునే వాళ్లే ఉంటే నువ్వు ఇలా కూతురిని వెంటబెట్టుకుని ఇక్కడి వరకు రావు, ఇప్పుడు బయటికెళ్తావు సరే బయటికి వెళ్తే వాడు నిన్ను నీ కూతుర్ని ఏమైనా చేస్తే నువ్వు భరించగలవా అంటుంది. అంతలోనే శౌర్య ఆ బూచాడు వెళ్లిపోయాడా అని అడుగుతుంది. శౌర్యకి తన తండ్రి ఎవరో తెలియదు అని తెలుసుకున్న సుమిత్ర బాధపడుతుంది. బూచాడు వెళ్ళిపోయాడు గాని నువ్వు నాతో రా అంటుంది సుమిత్ర. మేము ఊరు వెళ్ళిపోతాము అంటుంది శౌర్య.
ఇప్పుడు మీరు ఎక్కడకి వెళ్లడం లేదు అని చెప్పి శౌర్యని తీసుకుని వెళ్ళిపోతుంది సుమిత్ర. మరోవైపు కార్తీక్ ని బర్త్డే పార్టీకి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది జోత్స్న. వస్తే ఇష్టంతో వచ్చాను అనుకుంటుంది అనుకొని ఏమి సమాధానం చెప్పడు కార్తీక్. ఉండు ఇప్పుడే అత్తని నిన్ను పంపించమని అడుగుతాను అంటుంది జోత్స్న. వద్దు, వస్తాను అంటాడు కార్తీక్. సంతోషంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది జోత్స్న. మరోవైపు భర్తని దీప ని ఏం చేశావు,నిన్ను చూస్తే నాలుగు తన్నించుకొని వచ్చినట్లుగా ఉంది అంటుంది శోభ.

దిండు దుప్పటి బయటికి విసిరేసి నిన్ను రూమ్ లోకి రానిచ్చేది లేదు, నాలుగు రోజులలో ఆమెని ఊరి నుంచి పంపించేయకపోతే ఈ దిండు దుప్పటి ఆరు బయట ఉంటాయ్ జాగ్రత్త అని చెప్పి తలుపు గడియ పెట్టుకుంటుంది శోభ. ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన నర్సింహ దీపని తలుచుకొని ఏ ముహూర్తాన ఊర్లో అడుగు పెట్టావో అప్పటినుంచి ప్రశాంతత లేకుండా పోయింది.
నువ్వు ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నావో ముందు వాడు అంతు చూస్తాను అనుకుంటాడు నర్సింహ. మరోవైపు శౌర్య కోసం వచ్చిన దీపని నువ్వు ఇంకా ఇంట్లోంచి వెళ్లలేదా ఎప్పుడు వెళ్తావు అని అడుగుతుంది పారిజాతం. తను ఉంటే మీకేంటి బాధ అని సుమిత్ర దీపని వెనకేసుకొస్తుంది. శివ నారాయణ కూడా పారిజాతానికి చివాట్లు పెడతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











