Karthika Deepam 2 May 23rd: దీపకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కార్తీక్ ని తప్పుపడుతున్న కాంచన!

దీపకి చెప్పకుండా పాపని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. అది జోత్స్న, పారిజాతం చూస్తారు.దీపతో గొడవ పడుతుంది పారిజాతం. పాప తండ్రి స్థానంలో కార్తీక్ సంతకం పెట్టాడని తెలుసుకొని దీపతో గొడవపడతాడు నర్సింహ. ఇదంతా చూసిన కార్తీక్ నర్సింహ మీద పోలీస్ కేసు పెడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 23వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 52వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

బంటుని రేపు పొద్దున్న రమ్మని పంపించేస్తుంది పారిజాతం. తర్వాత సుమిత్ర ని కాపాడిన దీప ఇంట్లో ఉంటే నన్ను కాపాడిన బంటుగాడు కూడా ఇంట్లోనే ఉండాలి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. భార్యని తిట్టుకుంటూ శివ నారాయణ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అత్తయ్య బంటుని మళ్లీ ఇంట్లోకి రప్పించిందంటే దీపని ఇంట్లోంచి పంపించే ప్రయత్నాలు ఏవో చేస్తుంది.

Karthika Deepam season 2 Episode Number 52 May 23 rd 2024 Parijatham says that Karthik has done all this

బంటు గాడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది సుమిత్ర. తర్వాత సుమిత్ర దీపని పిలిపించడంతో సుమిత్ర దగ్గరికి వచ్చిన దీప ఏంటమ్మా రమ్మన్నారట అంటుంది. ఆయన పాప స్కూల్ గురించి నీతో మాట్లాడతారంట అందుకే రమ్మన్నారు అంటూ భర్తని పిలుస్తుంది సుమిత్ర. ఇంతలో అనసూయ వచ్చి దీప ఇంట్లో లేకపోవడంతో నేరుగా సుమిత్ర ఇంట్లోకి వచ్చి దీపతో గొడవ పడుతుంది.

నీ బ్రతుకు నువ్వు బ్రతకకుండా వాడినందుకు రోడ్డు మీదకి లాగుతున్నావు, అసలు నువ్వు చేస్తున్న పనులను చూస్తుంటే నువ్వు దీప వేనా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు సుమిత్ర అనసూయతో మాట్లాడుతూ కోడలికి న్యాయం చేస్తానని వెళ్లిన దానివి కొడుకుతోనే ఉండిపోయావు, ఎంత స్వార్థంతో బ్రతుకుతున్నావు అడిగేవాళ్లు ఎవ్వరూ లేరని ధీమా నా అంటుంది.

Karthika Deepam season 2 Episode Number 52 May 23 rd 2024 Parijatham says that Karthik has done all this

అవును నేను స్వార్థంతోనే బ్రతుకుతున్నాను. ఈ దీప మాత్రం ఏం చేసింది నా కొడుకుని రెచ్చగొట్టి వాడికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. నాతో పాటు వచ్చి నా కొడుకుని విడిపించు దీప అంటుంది. ఏం జరిగింది అంటుంది దీప. ఏమీ తెలియనట్లు నటించకు,నా కొడుకు మీద కేసు పెట్టావు కదా వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టారు అంటుంది అనసూయ. నేను పెట్టలేదు అంటుంది దీప. మీరు పెట్టారా అని సుమిత్ర ని అడుగుతుంది.

నేను కూడా పెట్టలేదు మరి ఎవరు పెట్టి ఉంటారు అంటుంది సుమిత్ర. ఇంకెవరు కార్తీక్ పెట్టి ఉంటాడు అంటుంది పారిజాతం. ఆమె మీద కోప్పడుతుంది సుమిత్ర. గ్రానీని ఎందుకు అంటావు దీప గురించి అంత శ్రద్ధ తీసుకునేది బావ మాత్రమే కావాలంటే ఫోన్ చేసి కనుక్కో నిజం తెలుస్తుంది అంటుంది జ్యోత్స్న. దశరథ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు కానీ కార్తీక్ లిఫ్ట్ చేయడు. మీరు ఎవరికి ఫోన్ చేయకండి నా సమస్య నేనే తీర్చుకుంటాను అంటుంది దీప.

Karthika Deepam season 2 Episode Number 52 May 23 rd 2024 Parijatham says that Karthik has done all this

నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని ఇలాంటి వేషాలు వేస్తున్నావా,నువ్వు చెప్పకుండానే అతను పోలీస్ కేసు పెట్టాడా.. నా సంగతి వాళ్ళందరూ కన్నా నీకే బాగా తెలుసు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఒక గంటలో నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి నా కొడుకుని విడిపించకపోతే మీ అందరిని రోడ్డు మీదకి లాగుతాను, మీ పరువు ని బజారులో పెడతాను అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ.

సమస్య మీదైతే మీ అత్త మాకు వార్నింగ్ ఇస్తుంది ఏంటి అంటూ దీపని కసురుకుంటుంది పారిజాతం. దీప కార్తీక్ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నర్సింహ మీద పోలీస్ కేసు పెట్టారా అంటుంది. నీ భర్త మీద వాడెందుకు పోలీస్ కేసు పెడతాడు అంటుంది కాంచన. పెట్టాను అంటాడు కార్తీక్. కాంచన వాళ్ళు ఒకసారి గా షాక్ అవుతారు. ఎందుకు పెట్టారు బాబు అంటుంది దీప. వాడు నిన్ను రోడ్డు మీద అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటాడు కార్తీక్.

Karthika Deepam season 2 Episode Number 52 May 23 rd 2024 Parijatham says that Karthik has done all this

మాటలు పడటం కంటే చనిపోవడం మంచిది అంటూ ఇంట్లో జరిగిందంతా చెప్తుంది దీప. నాతో రండి నర్సింహని విడిపిద్దాం అంటుంది. రెండు రోజులు జైల్లో ఉంటే వాడికి బుద్ధి వస్తుంది అంటాడు కార్తీక్. దీపకు చెప్పకుండా కేసు పెట్టడమే తప్పు, తన భర్తని విడిపించమని తనే చెప్తుంది కదా వెళ్లి విడిపించు అంటుంది కాంచన. పరిధికి మించిన సాయం చేస్తే అది అందరినీ ఇబ్బంది పెడుతుంది అంటాడు శ్రీధర్.

తప్పనిసరి పరిస్థితులలో నర్సింహని విడిపించడానికి వెళ్తాడు కార్తీక్ వెనకే దీప కూడా వెళుతుంది. అనసూయ వచ్చి అంత గొడవ చేసిందంటే వదిన వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో అంటుంది కాంచన. మరోవైపు తల్లితో మాట్లాడుతున్న జ్యోత్స్న నేను చెప్తే నమ్మలేదు ఇప్పటికైనా బావలో మార్పు వచ్చిందని నమ్ముతావా అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X