Karthika Deepam June 1st: కావేరి మీద కోపంతో రగిలిపోతున్న శ్రీధర్.. కార్తీక్ ని బుట్టలో వేసే ప్రయత్నంలో జ్యోత్స

స్కూల్లో కనిపించిన శౌర్య కి తనే తండ్రిని అని చెప్పాలనుకుంటాడు నర్సింహ. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది దీప. దీప హోటల్ దగ్గరికి వచ్చి నానా రచ్చ చేస్తాడు నర్సింహ. పాటల పోటీ కోసం శౌర్య కి పాట నేర్పిస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 1వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 60వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తండ్రి గురించి మాట్లాడుతున్న కార్తీక్ ఆయన రహస్యం బయట పడిపోతుందని వెళ్లిపోయారు అంటాడు. ఈయనకి తండ్రి గురించి నిజం తెలుసా అనుకుంటుంది దీప. మా అల్లుడు బంగారం ఆయన గురించి లేనిపోని అనుమానాలు కలిగించకు అంటుంది పారిజాతం. మా ఆయన గురించి నేను అనుమానపడను ఆయన దేవుడు అంటుంది కాంచన. ఆయన దేవుడు కాదమ్మా నా భర్త లాగే దుర్మార్గుడు అనుకుంటుంది దీప. దీప తన వైపు పదేపదే చూస్తూ ఉండటంతో తనకేమైనా చెప్పాలనుకుంటుందేమో అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam season 2 Episode Number 60 June 1st 2024 Parijatham inciting Jyotsna to Karthik

ఇదంతా చూస్తున్న జ్యోత్స్న వీళ్లిద్దరూ ఏంటి అలా చూసుకుంటున్నారు ఏం జరుగుతుంది అనుకుంటుంది. తర్వాత కార్తీక్ మాట్లాడింది తండ్రి సిగరెట్ల విషయం అని తెలుసుకొని అందరూ నవ్వుకుంటారు. దీప అక్కడినుంచి బయటికి వచ్చేస్తుంది, కార్తీక్ కూడా బయలుదేరుదాం అని తల్లి తో అనటంతో సుమిత్ర ఆడపడుచు కి బొట్టు ఉంచడానికి కూతురితో బొట్టు తీసుకొని రమ్మని చెప్తుంది. అయితే అప్పుడే కార్తీక్ ఫోన్ మాట్లాడటానికి అన్నట్లు బయటికి వచ్చి దీపతో మాట్లాడుతూ మీరు నాతో ఏమైనా చెప్పాలనుకున్నారా, నా వైపు ఎందుకు అలా చూశారు అని అడుగుతాడు.

మీ తండ్రి గురించి చెప్పాలనుకున్నాను కానీ నాలాగా మరో ఆడది బాధపడటం ఇష్టం లేదు అందుకే చెప్పలేకపోతున్నాను అనుకుంటుంది దీప. బయటికి మాత్రం మీ నాన్నగారి గురించి చెప్తుంటే వింటున్నాను అంటుంది. కార్తీక్ తన తండ్రిని పొగుడుతూ మాట్లాడతాడు.తండ్రి గురించి నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అనుకుంటుంది దీప. కుంకుమ తెచ్చి తల్లికి ఇచ్చిన జ్యోత్స్న కి అక్కడ కార్తీక్ కనిపించకపోవడంతో బయటకు వస్తుంది. అక్కడ దీప, కార్తీక్ మాట్లాడుకోవడం చూసి బావని అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Karthika Deepam season 2 Episode Number 60 June 1st 2024 Parijatham inciting Jyotsna to Karthik

తర్వాత కార్తీక్ మీ కష్టాలని పక్కనపెట్టి సంతోషంగా ఉండండి అని సలహా ఇస్తాడు, పాట చాలా బాగుంది అని ఏప్రిషియేట్ చేస్తాడు. మరోవైపు కావేరితో ఐస్ క్రీమ్ తింటున్న శ్రీధర్ పాపకి ఫీజు కట్టు అని డబ్బిస్తాడు. నాకు నిజం తెలుసు కానీ దానికి నిజం నిజం తెలియదు కదా అందుకే నాన్న మనతో ఒక్కరోజు ఉండటానికి కూడా వీలుపడదా అని అడుగుతుంది, ముగ్గురం కలిసి బయటకు వెళ్లాలని ఆశపడుతుంది అంటుంది కావేరి.

తనకి నువ్వు నచ్చ చెప్పాలి కదా నీకు అన్ని విషయాలు తెలుసు కదా అంటాడు శ్రీధర్. అందుకు శ్రీధర్ మీద కోప్పడుతుంది కావేరి. ఆమె అలక తీర్చడానికి బయటకు తీసుకు వెళ్ళటానికి ఒప్పుకుంటాడు శ్రీధర్. ఇంట్లో ఏమని చెప్తారు అంటుంది కావేరి. ఫ్రెండ్ కొడుకు అని పెళ్లి చెబుతాను అంటాడు శ్రీధర్. కాంచనకి నిజం చెప్పొచ్చు కదా అంటుంది కావేరి, నిజం చెప్పలేను అంటాడు శ్రీధర్. కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి.

Karthika Deepam season 2 Episode Number 60 June 1st 2024 Parijatham inciting Jyotsna to Karthik

ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని నేను టెన్షన్ పడుతున్నాను కానీ అవేవీ వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళు అనుకున్నది మాత్రం జరిగిపోవాలి అని కావేరి పై కోపగించుకుంటాడు శ్రీధర్. మరోవైపు ముభావంగా ఉన్న దీప దగ్గరికి వచ్చిన బాబాయ్ మళ్లీ అతను వచ్చాడా అని అడుగుతాడు. లేదు అంటుంది దీప. వచ్చినా కార్తీక్ బాబు ఊరుకోడు కదా అంటాడు బాబాయ్. ఆ తర్వాత మన మంచి కోరి మనకి సలహా ఇచ్చిన వాళ్ళ సలహా తీసుకోవడంలో తప్పులేదు అని చెప్తాడు.

కార్తీక్ ఇచ్చిన సలహా గుర్తు చేసుకుంటుంది దీప. ఒకవైపు కోపంతో రగిలిపోతున్న మనవరాలు దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది పారిజాతం. జరిగిందంతా చెప్పి నాతో మాట్లాడటానికి స్పేస్ ఉండదు కానీ ఆ దీప తో మాట్లాడటానికి మాత్రం స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉండదు మనమే తీసుకోవాలి, నీకు నేను సలహాలు చెప్పటం చాలా ఇబ్బందిగా ఉంది పెళ్లి అయిన వరకు అతని చుట్టూ తిరిగి అతనిని నీ చుట్టూ తిప్పుకునేలాగా చేయు.

ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఇక వాళ్ళ ఆటలు సాగవు అంటూ జ్యోత్స్న ని కార్తీక్ మీదికి రెచ్చగొడుతుంది పారిజాతం.ఆ మాటలకి ఇన్ఫ్లుయన్స్ అవుతుంది జ్యోత్స్న. ఇప్పుడు బావని ఏ కారణం చేత కలవాలి అనుకుంటుంది. ఏదో ఐడియా వచ్చిన దానిలా నవ్వుకుంటూ కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది. కార్తీక్ ఛాంబర్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న లోపలికి రావచ్చా అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X