Karthika Deepam June 8th episode: దీపని ఇంట్లోంచి వెళ్లిపోమన్న సుమిత్ర.. పారుకి ఊహించని షాకిచ్చిన కార్తీక్!
పాప ఇంటి దగ్గరే ఉందని పారిజాతం చెప్పడంతో అందరూ ఇంటికి వస్తారు. పాప కనిపించకపోవటానికి కారణం నర్సింహా అని తెలుసుకొని అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. శౌర్య కి పిజ్జా తినిపించిన కార్తీక్ తో పాపకి కొత్త కొత్త రుచులు అలవాటు చేయవద్దు అని చెప్తుంది దీప. కార్తీక్ ప్రవర్తనని కాంచన తప్పు పడుతుంది, అర్థం చేసుకోమని తల్లికి నచ్చ చెప్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 8 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 66వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప సడన్ గా తన దగ్గరికి రావటాన్ని చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఏంటి బాబు నన్ను చూసి నవ్వుతున్నారు నేను చూసేసరికి చూపు తిప్పేస్తున్నారు అని అడుగుతుంది దీప. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అంటాడు కార్తీక్. ఎందుకు అని అడుగుతుంది దీప. మీరు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లారో నాకు తెలిసింది అంటూ అనసూయ చెప్పిన సంగతి అంతా చెప్పి మీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు కార్తీక్.

అది నేను కావాలని చేయలేదు బాబు, నా బిడ్డ జోలికి వస్తే నేను భరించలేను ఆ విషయమే వాళ్లకి అర్థమయ్యేలాగా చెప్పాను అంటుంది దీప. ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు నేను కూడా అంతే, నా కూతురు బాధపడాలంటే వాడు పాపకి తండ్రిని అని చెప్తే చాలు దాని గుండె బద్దలే పోతుంది.
అప్పుడు అది వేసే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అంటుంది దీప. ఎన్నాళ్ళని దాస్తారు అంటాడు కార్తీక్. దాచ గలిగినంత కాలం దాస్తాను అంటుంది దీప. అసలు ఇలా జరగటానికి కారణం మీరే అంటాడు కార్తీక్. నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది దీప. మీ వల్లే, మీ దగ్గర ఒక ఫోన్ ఉండి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు,రౌడీ గురించి నిన్న మీరు అంత టెన్షన్ పడి ఉండేవారు కాదు అందుకే మీకోసం నేను ఒక ఫోన్ తీసుకున్నాను అని ఫోన్ ఇస్తాడు కార్తీక్.
అది తీసుకోవటానికి ఇష్టపడదు దీప. నేను కొనుక్కుంటాను లెండి అంటుంది. అదేదో నా దగ్గరే కొనుక్కోండి అని బిల్ కూడా ఇస్తాడు కార్తీక్. మీరు నాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బుల్ని ఆ డబ్బాలో వేసేయండి, అన్నీ కలిపి తీసుకుంటాను అంటాడు. సరే అంటూ ఫోన్ తీసుకుంటుంది దీప. ఇదంతా శౌర్య చూస్తుంది కార్తీక్ అమ్మకి ఫోన్ ఇచ్చాడు, అమ్మ స్పెషల్ పాయసం చేసింది కదా అందుకే ఇచ్చి ఉంటాడు అనుకుంటుంది.
మరోవైపు పారిజాతంని కేక్ కోయమంటారు ఇంట్లో వాళ్ళు, అంతకన్నా ముందు దీప చేసిన స్పెషల్ పాయసం తిందాము దీప ఏది అంటుంది పారిజాతం. దీప అక్కడికి వచ్చి అందరికీ పాయసం ఇస్తుంది, పాయసం తిన్న సుమిత్ర దీపనే కోప్పడి పాయసం చేయడం ఇష్టం లేకపోతే మానేయాలి కానీ ఇలా చేస్తావా అంటూ ఇంట్లోంచి బయటికి పొమ్మని కేకలు వేస్తుంది. మంచి పని అయింది అంటూ ఆనందంగా కేకలు వేస్తుంది పారిజాతం.
ఆమెని భుజం మీద తట్టి ఎందుకలా కేకలు వేస్తున్నావ్ అని అడుగుతాడు శివ నారాయణ. స్పృహ లోంచి బయటకు వచ్చిన పారిజాతం నేను కలగన్నానా అనుకుంటుంది అయినా కాసేపట్లో ఇదే జరుగుతుంది అనుకుంటుంది. దీప ని పాయసం తీసుకు రమ్మంటే నేను తీసుకు వస్తాను అని కార్తీక్ పాయసం తీసుకువచ్చి అందరికీ ఇస్తాడు. పారిజాతానికి కూడా పాయసం ఇచ్చి తాగమంటాడు నేను తర్వాత తాగుతాను అంటుందిపారిజాతం.
పాయసం తిని వాళ్ళందరూ బాగుంది అనడంతో షాక్ అవుతుంది పారిజాతం. అప్పుడు కార్తీక్ పారిజాతంతో మాట్లాడుతూ నువ్వు పాయసంలో ఏదో కలపటం నేను చూశాను మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు పాయసం తాగు అంటాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వచ్చి ఏదో చేసేస్తాను అన్నావు ఏమీ చేయలేకపోయావు అంటూ పారిజాతం పై ఫైర్ అవుతుంది.
నేనేదో అనుకుంటే ఇంకేదో జరిగింది, మనవడు గట్టి దెబ్బ కొట్టాడు అనుకుంటుంది పారిజాతం. తరువాత శివ నారాయణ ఏదో కోరిక కోరుతానన్నావు కదా అదేదో అడుగు అంటాడు. కార్తీక్ ని జ్యోత్స్న దగ్గరికి రమ్మంటుంది పారిజాతం. జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనే విషయం చెప్తుందేమో అనుకుంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











