Karthika Deepam June 25th Episode: తండ్రి విషయంలో స్వప్న కన్ఫ్యూజ్ .. దీపకి డెడ్ లైన్ పెట్టిన నర్సింహ!

శోభకి పిల్లలు పుట్టరని తెలిసిన అనసూయ దీప కూతుర్ని తెచ్చుకోమని కొడుక్కి సలహా ఇస్తుంది. రోడ్డుమీద మరొక స్త్రీ తో శ్రీధర్ ని చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు నర్సింహ దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకి చేయమని అడుగుతాడు. కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 25 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 80వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నువ్వు చాలా ధైర్యవంతురాలివి, భర్త అలాంటి పని చేసినా తట్టుకొని నిలబడగలిగావు కానీ నేనైతే తట్టుకోలేను, విషం మింగి చచ్చిపోతాను అంటుంది కాంచన. ఇంతకీ ఎవరు వాళ్ళు,పేరు చివరలో చెప్తానన్నావు, ఆ మోసం చేసిన వాడెవరో చెప్తే మా ఆయనతో చెప్పి పోలీస్ కేసు పెట్టిద్దాము అంటుంది. ఆ మోసపోయిన వ్యక్తి మీరే నమ్మ కానీ ఎలా చెప్పాలి, చెప్తే మీ ప్రాణం పోతుందని తెలిసి ఎలా చెప్పగలను అనుకుంటుంది దీప.

Karthika Deepam season 2 Episode Number 80 June 25th 2025 Deepa wanted to tell the truth to Kanchana but could not

కార్తీక్ బాబే మా నాన్న ప్రాణాలు తీశాడు అనుకొని అపోహ పడ్డాను కానీ ఇప్పుడు నిజం చెప్పి కార్తీక్ బాబు తల్లి ప్రాణాలు తీయలేను, మీ పాపం పండిన రోజు మీరే మీ పిల్లల కంటపడతారు శ్రీధర్ గారు అనుకుంటుంది దీప. మరోవైపు సుమిత్ర ఇంటికి బంధువులు పెళ్లి పిలుపుల కోసం వస్తారు వారం రోజుల ముందే వస్తాను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని మాటిస్తాడు శివ నారాయణ. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఊర్లో ఉన్న ఆడపిల్లలు అందరికీ పెళ్లిళ్లు చేయండి కానీ మీ మనవరాలి పెళ్లి మాత్రం చేయకండి అని కోప్పడుతుంది పారిజాతం.

తన మాటలు పట్టించుకోకండి అది అలాగే మాట్లాడుతుంది అని సుమిత్ర వాళ్లతో చెప్తాడు శివ నారాయణ. అత్తయ్య చెప్పిందాంట్లో తప్పులేదు మామయ్య, మనం ఈ విషయంలో తొందరపడాలి అంటుంది సుమిత్ర. అయితే కాంచన వాళ్ళని రేపు మన ఇంటికి రమ్మందాము ఇక్కడే పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడదాము అంటాడు దశరథ్. ఎంతైనా వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు, మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటుంది సుమిత్ర. రేపు మీ దంపతులిద్దరూ వెళ్లి రండి అంటాడు శివ నారాయణ. ఈ ఇంటికి మీరే పెద్దవారు మావయ్య మీరు వెళ్లి మాట్లాడితేనే బాగుంటుంది అంటుంది సుమిత్ర.

Karthika Deepam season 2 Episode Number 80 June 25th 2025 Deepa wanted to tell the truth to Kanchana but could not

మరోవైపు తండ్రిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న. అంతలోనే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులని మీరు గుడికి వెళ్లారా అని అడుగుతుంది. అవును అంటాడు శ్రీధర్. మీరు ఇంకా సినిమాకి వెళ్లారేమో అనుకున్నాను అంటుంది స్వప్న. గుడి అయితే బెటర్ ఆప్షన్ అని అక్కడికి వెళ్ళాము అంటూ కూతురికి చాక్లెట్ ఇస్తాడు శ్రీధర్. చాక్లెట్ కన్నా కొబ్బరి బోండం అయితే బాగుండేది కదా నాన్న అంటుంది స్వప్న.

ఉన్నట్టుండి కొబ్బరి బోండం గురించి మాట్లాడుతుందేంటి నిన్న సుమిత్ర కి కొబ్బరి బొండం ఇవ్వడం స్వప్న చూసిందా అనుకుంటాడు శ్రీధర్. కానీ బయటపడకుండా మనం నెక్స్ట్ వీక్ అవుట్డోర్ వెళ్తున్నామని సప్న కి చెప్పలేదా అనే కావేరిని అడుగుతాడు. స్వప్న కొబ్బరి బొండం విషయంలో తండ్రిని అడగాలా వద్దా అని అనుకుంటుంది, మళ్ళీ నాన్న మంచి వారే అమ్మకి ద్రోహం చేసే మనిషి కాదు ఒకవేళ అలాంటి వారే అయితే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు కదా అనుకుంటుంది.

మరోవైపు కాంచన ఇంటికి శివ నారాయణ దంపతులు వస్తారు, భోజనం చేస్తున్న శివ నారాయణతో ముందే చెప్పొచ్చు కదా నాన్న వస్తున్నట్లు అంటుంది కాంచన. చెప్పకపోతేనే ఇన్ని వెరైటీలు చేశావు చెప్తే ఇంకా ఎన్ని వెరైటీలు చేసి ఇబ్బంది పడతావో అని చెప్పలేదు అంటాడు శివ నారాయణ. వంటలు చాలా బాగున్నాయి అంటుంది పారిజాతం. వంటలు దీప చేసింది అంటుంది కాంచన.

Karthika Deepam season 2 Episode Number 80 June 25th 2025 Deepa wanted to tell the truth to Kanchana but could not

పారిజాతం షాక్ అవుతుంది. ఆ దీప ఎక్కడ వరకు వచ్చింది అంటే ఇంక ఆలోచించకూడదు అని చెప్పి పెళ్లి టాపిక్ తీసుకొస్తుంది. రోజులు బాగోలేవు ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు అందుకే త్వరగా ముహూర్తాలు పెట్టుకుందాం అంటుంది పారిజాతం. నువ్వేమీ కంగారు పడకు పిన్ని జ్యోత్స్న యే నా ఇంటి కోడలు అంటుంది కాంచన. కార్తీక్ ఇంటికి వచ్చిన వెంటనే ఈ విషయం గురించి మాట్లాడతాను అని కూడా చెప్తుంది కాంచన.

మరోవైపు దీప కి ఫోన్ చేసిన నర్సింహ నేను చెప్పిన విషయం ఏం చేశావు రేపు సాయంత్రం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకో, లేదంటే ఎల్లుండి పొద్దున్న ఏం చేస్తానో నాకే తెలియదు అని డెడ్ లైన్ పెట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంది దీప. అప్పుడే అటుగా వెళుతున్న కార్తీక్ దీపని చూసి కంగారుపడి ఆమె దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. నిజం చెప్పి కార్తీక్ సాయం తీసుకోవాలి అనుకుంటుంది.

కానీ మళ్ళీ పోలీస్ కేసు అది ఇది అంటారు అని కంగారుపడి ఊరుకుంటుంది కానీ కార్తీక్ మాట్లాడుతూ మీరు ఎందుకో బాగా కంగారు పడుతున్నారని అర్థమవుతుంది మీ విషయం వరకు నాతో చెప్పకపోయినా పర్వాలేదు కానీ రౌడీ నాకు ఫ్రెండ్, దాని విషయంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి. నాక్కూడా దాని బాధ్యత ఉంది అంటాడు. దీప మౌనంగా ఉండటంతో అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు కార్తీక్ కానీ దీప కార్తీక్ ని ఆపుతుంది తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X