Karthika Deepam June 28th episode: స్టేజ్‌పై శౌర్య సూపర్ ట్విస్ట్.. దీపకి ప్రిన్సిపాల్ క్షమాపణలు!

దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకిచ్చేయమని అడుగుతాడు నర్సింహ. కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. అక్కడ శ్రీధర్ గురించి కాంచనతో చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. ఫాదర్స్ డే రోజు ఇంటికి వచ్చిన శౌర్యని బాధ పెట్టి పంపిస్తుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 28 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 83వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

స్కూల్ కి వచ్చిన జ్యోత్స్న దీప పక్కన కూర్చుంటూ శౌర్య బాధ్యత నాది కాబట్టి నేనే వచ్చాను మరెవ్వరూ రారు అంటుంది. నేను రావడం మీకు ఇష్టం లేదా అని కూడా అడుగుతుంది. ఎందుకు ఇష్టం లేదు, నువ్వు రావటం సంతోషంగా ఉంది అంటుంది దీప. స్కూల్ కి వచ్చిన నర్సింహ కి ఈరోజు ఫాదర్స్ డే ఫంక్షన్ అవుతుంది అందరూ అక్కడే ఉన్నారు అని అటెండర్ చెప్పటంతో అందరి ముందు నేనే శౌర్య తండ్రిని అని చెప్పటానికి ఇదే మంచి అవకాశం అనుకొని వెన్యూ దగ్గరికి వస్తాడు.

Karthika Deepam season 2 Episode Number 83 June 28th 2024 Jyotsna thinks of breaking the friendship between Shaurya and Karthik

అక్కడ దీప శౌర్యలని చూసి వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు ఏంటి సార్ కనిపించడం లేదు ఏంటి, ఇక్కడే ఎక్కడో ఉండాలి కదా అనుకుంటాడు, తనే తండ్రీ అని చెప్పేయాలి అని సమయం కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంటాడు. కార్తీక్ కూడా అప్పుడే వస్తాడు కానీ నర్సింహని, జ్యోత్స్న ని చూసి అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు కానీ స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపల్ ఈరోజు ఫాదర్స్ డే కావడంతో తండ్రి గురించి అందులో ఒక పల్లెటూరి నుంచి వచ్చిన పాపకి మొదటి బహుమతి వచ్చింది అని శౌర్య ని స్టేజ్ మీదకి పిలవటం విని ఆగిపోతాడు.

బెలూన్ ల వెనుక దాక్కొని శౌర్య ఏం మాట్లాడుతుందా అని వింటాడు. ప్రిన్సిపల్ శౌర్యతో మాట్లాడుతూ నువ్వు ఏమి రాశావో నీ మాటలలోనే అందరికీ చెప్పు అని చెప్పటంతో తండ్రి అంటేనే తెలియని శౌర్య తండ్రి గురించి ఏం రాసిందా అని ఆసక్తిగా నర్సింహ, జ్యోత్స్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. శౌర్య మాట్లాడుతూ నా తండ్రి నేను ఆడుకున్నప్పుడు బొమ్మ అవుతాడు, ఊగినప్పుడు ఉయ్యాల అవుతాడు అంటూ తండ్రి గురించి గొప్పగా చెప్తుంది. దీప వాళ్ళు శౌర్య ఎవరి గురించి చెప్తుందా అని అయోమయంలో పడతారు.

Karthika Deepam season 2 Episode Number 83 June 28th 2024 Jyotsna thinks of breaking the friendship between Shaurya and Karthik

నీ తండ్రి గురించి నువ్వు ఇంతలా చెప్తుంటే మాకు కూడా చూడాలనిపిస్తుంది, మీ నాన్నగారిని పిలువు అంటాడు ప్రిన్సిపల్. నాన్న స్టేజ్ మీదకి రా అంటుంది శౌర్య. ఎవరిని పిలుస్తుందో అర్థం కాదు దీప వాళ్ళకి. మీ నాన్నగారు రాలేదా అంటాడు ప్రిన్సిపాల్. వచ్చారు, నేను వెళ్లి తీసుకు వస్తాను అని దీపని స్టేజ్ మీదకి తీసుకు వస్తుంది శౌర్య. అందరూ షాక్ అవుతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావు అనుకుంటుంది జ్యోత్స్న.

నాకు తండ్రి గురించి తెలియదు కానీ నా తల్లే నాకు తల్లి తండ్రి అయి చూసుకుంటుంది నేను నా తండ్రి గురించి చెప్పిందంతా నా తల్లి గురించే అని దీప గురించి గొప్పగా చెప్తుంది శౌర్య. అందరూ చప్పట్లు కొడతారు. బుడ్డది ఏం చెప్పింది, ఇప్పుడు వెళ్లి నేనే నీ తండ్రిని అని చెప్తే వెంటనే ఇక్కడ నుంచి పారిపోతుందేమో, జనాలు నన్ను కొడతారు అనుకుంటాడు నర్సింహా. ఇంతలో ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది దీప. కార్తీక్ చెప్పాడు అంటుంది శౌర్య. కార్తీక్ ఎవరు అంటాడు ప్రిన్సిపల్.

Karthika Deepam season 2 Episode Number 83 June 28th 2024 Jyotsna thinks of breaking the friendship between Shaurya and Karthik

నాకు అమ్మ తర్వాత అన్ని అతనే, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ కార్తీక్ ని డయాస్ మీదకి పిలుస్తుంది శౌర్య. కార్తీక్ బాబు రాలేదు అంటుంది దీప. లేదు, నా ఫ్రెండ్ నాకోసం వచ్చాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అంటూ కార్తీక్ ని స్టేజి మీదకి రమ్మని పిలుస్తుంది శౌర్య. ఇదంతా చాటుగా వింటున్న కార్తీక్ బాగా ఎమోషనల్ అవుతాడు, నేను నీకోసమే అక్కడికి రావడం లేదు, వస్తే సమస్యలు వస్తాయి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రిన్సిపల్ మాట్లాడుతూ మీరు మీ పాపని ఎంత ఉన్నతంగా పెంచుతున్నారో తన మాటల్లోనే తెలుస్తుంది.

మొదట్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక చులకనగా మాట్లాడాను క్షమించండి అని దీపతో అంటాడు. పేరెంట్స్ అందరు చేత దీపకి క్లాప్స్ కొట్టిస్తాడు. కార్తీక్ మాట వినిపించేసరికి కోపంగా అయిపోతుంది జ్యోత్స్న. నువ్వు కూతుర్ని అడ్డం పెట్టుకొని కార్తీక్ ని నీ చుట్టూ తిప్పుకుంటున్నవని అర్థమైంది ముందు ఈ శౌర్య, కార్తీక్ లో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X