Karthika Deepam 2 May 10th: నర్సింహని దీప మీదికి రెచ్చగొడుతున్న శోభ.. నిజం తెలుసుకున్న కార్తీక్ ఇలాంటి నిర్ణయం

కోడలికి ఎలాగైనా న్యాయం చేస్తానంటుంది.కానీ కొడుకుతో చేరి దీపని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది అనసూయ. బయటికి వెళ్లిన తల్లి గురించి భయపడుతూ ఉంటుంది శౌర్య. కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి భరించలేక ఒక్కర్తె ఇంటికి వచ్చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం దీప మీద దొంగతనం అంటగడితే శౌర్య నిజం చెప్పి ఆ నిందని చెరిపేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే10 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 41వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

బాబాయ్ దీపతో మాట్లాడుతూ అంత పెద్ద ఇంట్లో ఉంటూ కూడా నువ్వు నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావు అని అడుగుతాడు. జరిగిందంతా చెప్పిన దీప ఎన్నాళ్ళని ఆ ఇంట్లో ఉంటాను, అక్కడ నా అవసరం తీరిపోయిన వెంటనే నా కూతుర్ని తీసుకొని వచ్చేస్తాను అంటుంది. అప్పుడు బాబాయ్ కంగారుపడుతూ ఊరెళ్ళి పోతావా నిన్నే నమ్ముకొని ఈ హోటల్ తీసుకున్నాను అంటాడు. కంగారు పడకు బాబాయ్, నాకు ఎవరూ లేరు నేను ఎక్కడికి వెళ్ళను నా కూతురిని చదివించుకోవాలి.

Karthika Deepam May 10th Episode

ఇక్కడే ఉంటాను అని చెప్పి అతనికి చేయవలసిన పనులు పురమాయించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నర్సింహ,అనసూయ. అనసూయ శోభ ని మంచినీళ్లు తీసుకురమ్మని చెప్తుంది.శోభ నీళ్లు తెస్తూ నిన్ను ఇంట్లో ఉంచుకున్నది నీకు సేవలు చేయటానికి కాదు.

నీ ద్వారా ఆ దీప ని ఇంట్లోకి రాకుండా చేయడానికి, ఆ తరువాత నిన్ను కూడా నీ కొడుకు చేత ఇంట్లోంచి బయటికి గెంటించేస్తాను అనుకుంటుంది. అత్తకి నీళ్లు ఇచ్చిన తర్వాత దీప సంగతి చూడమని అవసరమైతే ఆమె ఆత్మ అభిమానం మీద దెబ్బ కొట్టి ఆమెని ఊర్లోంచి గెంటిచేయమని లేదంటే తన తల్లిని తీసుకువచ్చి తానే ఆ పని చేస్తానని భర్తని రెచ్చగొడుతుంది శోభ.

Karthika Deepam season 2 May 10th 2024 Episode Number 41 Here is full story

ఆమె వెళ్లిపోయిన తర్వాత అది రెచ్చగొట్టిందని నువ్వు రెచ్చిపోకు, ఆ దీప వెనుక ఆ సుమిత్ర కుటుంబం ఉంది. దీప కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కొడుక్కి సలహా ఇస్తుంది అనసూయ. మరోవైపు కూతురికి అన్నం తినిపిస్తూ ఉంటుంది దీప. నువ్వు, నానమ్మ ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు కదా నానమ్మ తిరిగి రాలేదేమి అని అడుగుతుంది శౌర్య. అప్పుడే అక్కడికి సుమిత్ర చాక్లెట్స్ తీసుకొని వస్తుంది.

నానమ్మ ఊరు వెళ్ళిపోయింది అని అబద్ధం చెప్తుంది దీప. చాక్లెట్స్ తీసుకొని శౌర్య ఇంటిలోకి వెళ్లిపోయిన తర్వాత నువ్వు చెప్పిన అబద్ధం నీ కూతురు నమ్ముతుందేమో కానీ నేను నమ్మను అని చెప్పి దీపని కొంచెం దూరంగా తీసుకెళ్లి మాట్లాడుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు ఇంత జరిగాక కూడా నువ్వు నిజం చెప్పకపోవడం ఏమీ బాగోలేదు అంటుంది. జరిగిందంతా చెప్తుంది దీప.కోపంతో రగిలిపోయిన సుమిత్ర వాళ్ల మీద కంప్లైంట్ ఇద్దాం అంటుంది.

Karthika Deepam season 2 May 10th 2024 Episode Number 41 Here is full story

బంధమే వద్దనుకున్న వాళ్ళ మీద ఏమని కేసు పెడతాము, ఎలాంటి పోలీస్ కంప్లైంట్ వద్దు, ఇప్పుడు నేను నా కూతురు అనాధలం అయిపోయాము. నాకు ఎవరూ లేకపోవచ్చు కానీ నేను నా కూతురికి నేను ఉన్నాను తనని చదివించుకుంటాను అందుకే ఒక హోటల్లో పనికి కుదిరాను అంటుంది దీప. నీకు నీ తండ్రి నుండి ఉంటే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు,నీ కూతురికి నువ్వు ఉంటే నీకు నేను ఉన్నాను.

అయినా నువ్వు ఎక్కడో పనిచేయటం ఎందుకు నిన్ను నేను చూసుకుంటాను అంటుంది సుమిత్ర. కానీ సుమిత్ర కి నచ్చ చెప్తుంది దీప. సరే అని లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర. అయితే ఈ మాటలు అన్నీ అనుకోకుండా కార్తీక్ వింటాడు. దీప కి జరిగిన అన్యాయం తెలుసుకొని బాధపడతాడు, తన తండ్రి ఉండి ఉంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు అని గిల్టీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X