Karthika Deepam May 11th Episode: నా భార్యను ఇంట్లో పెట్టుకొంటారా? దీపతో సంబంధంపై కార్తీక్‌ను నిలదీసిన నర్సింహ
బంధమే వద్దనుకున్న వాళ్ళ మీద ఏమని కేసు పెడతాము, ఎలాంటి పోలీస్ కంప్లైంట్ వద్దు, ఇప్పుడు నేను నా కూతురు అనాధలం అయిపోయాము. నాకు ఎవరూ లేకపోవచ్చు కానీ నేను నా కూతురికి నేను ఉన్నాను తనని చదివించుకుంటాను అందుకే ఒక హోటల్లో పనికి కుదిరాను అంటుంది దీప. నీకు నీ తండ్రి నుండి ఉంటే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు,నీ కూతురికి నువ్వు ఉంటే నీకు నేను ఉన్నాను.
అయినా నువ్వు ఎక్కడో పనిచేయటం ఎందుకు నిన్ను నేను చూసుకుంటాను అంటుంది సుమిత్ర. కానీ సుమిత్ర కి నచ్చ చెప్తుంది దీప. సరే అని లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర. అయితే ఈ మాటలు అన్నీ అనుకోకుండా కార్తీక్ వింటాడు. దీప కి జరిగిన అన్యాయం తెలుసుకొని బాధపడతాడు, తన తండ్రి ఉండి ఉంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు అని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇదంతా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన కథ. కార్తీకదీపం 2 సీరియల్‌లో ఏప్రిల్ 11వ తేదీ 42 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

దీప, శౌర్యను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు చేసిన ప్రయత్నంలో బయటకు పంపించేసిన బంటూ అర్ధరాత్రి పారిజాతాన్ని కలిశాడు. వారిద్దరూ కలిసి దీప భర్త గురించి, దీప జీవితం గురించి తెలుసుకోవాలని మరో ప్లాన్ వేశాడు. అందుకు బంటూని దీప ఊరు ముత్యాలపురానికి వెళ్లమని పారిజాతం చెప్పింది. దాంతో భయపడిన బంటూ.. అమ్మో అంటే.. చేతిలో నుంచి డబ్బు తీసి చెతిలో పెట్టగానే... పారిజాతం పెదవి మీద చిరునవ్వు చూసేందుకు ఎంతకైనా సిద్దం అంటూ బంటూ డైలాగ్ కొడితే.. తెలుగు సీరియల్ డైలాగ్స్ చెప్పకుండా.. పని చేసుకురా అంటూ పంపించేస్తుంది.
అయితే సడెన్‌గా ఇంట్లో దీప పడిపోతుంది. దాంతో సుమిత్ర, కార్తీక్ లేపి ఏమైందని అడుగుతుంటే.. నర్సింహా ఎంట్రీ ఇచ్చారు. దాంతో అతడిని చూసి ఎందుకొచ్చావు అంటే.. నా పెళ్లాన్ని ఇంట్లో పెట్టుకొని నన్ను ఎందుకు వచ్చావని అడుగుతున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో ఇక్కడ గొడవ వద్దు.. బయటకు వెళ్లి మనం మనం తెల్చుకొందా అని దీప అంది.. ముందు వాడి సంగతి తేల్చుకొంటా.. రారా అంటూ నర్సింహ అరిచింది. ముందు మనం ఇక్కడ నుంచి బయటకు పోదాం అంటే.. వాడి సంగతి చూడకుండా వెళ్లను. వాడిని ఎలా రప్పిస్తానో చూడు.. అంటూ దీప సిగ పట్టుకోబోతుండగా.. కార్తీక్ వచ్చి నర్సింహ మెడను పట్టుకొన్నాడు.
చూశావా? నేను ఎలా రప్పించానో.. నీకు ఏమైనా జరిగితే.. వెంటనే వస్తాడు అని నర్సింహా అంటే.. దీప చుట్టు నీలాంటి వాడు ఉండకుండా చూడటమే నా పని అంటూ నర్సింహ మెడ పట్టుకొని బయటకు నెట్టివేశాడు. ఆ తర్వాత కార్తీక్, నర్సింహ, దీప మధ్య వాగ్వాదం జరిగింది. నా పెళ్లానికి నీకు ఉన్న సంబంధం గురించి చెప్పు అంటూ కార్తీక్‌ను నర్సింహ నిలదీశాడు. దాంతో అందరూ షాక్ తిన్నారు. అయితే అనవసరంగా మాట్లాడి నా చేతిలో దెబ్బలు తినకు అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.
నీకు ఏ సంబంధం లేకుండానే.. నా భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొన్నావా? అని నర్సింహ ప్రశ్నించాడు. ఏ సంబంధం లేకుండానే గుళ్లో నన్ను కొట్టావా? ఏ సంబంధం లేకుండానే నా భార్యను, కూతుర్ని షాపింగ్‌కు తీసుకెళ్లావా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. దాంతో చెంప మీద లాగి కొట్టాడు కార్తీక్. ఒక్క మాట మాట్లాడితే.. చంపేస్తాను అంటే.. అయితే నీ భార్యకు నీకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పు. మీరిద్దరి మాట్లాడుకొంటుంటే.. నేను, మా అమ్మ చూసింది. నీకున్న సంబంధం చెప్పు అంటే.. నీకు దండం పెడుతాను. ఇక్కడి నుంచి వెళ్లు అని నర్సింహపై దీప అరిచింది. అయితే ఇక్కడి నుంచి వెళ్లే వరకు నేను ఇలా చేస్తాను అంటే.. నర్సింహను సుమిత్ర లాగి చెంపదెబ్బ కొట్టింది.
అయితే తన భార్యను తాను ప్రశ్నిస్తే.. ఎందుకు మధ్యలో దూరడం అని పారిజాతం అంటే.. వాడు దీపకు అన్యాయం చేశాడు. దీప ఉండగానే.. మరొకరిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. తనను వెతుక్కొంటూ వస్తే గానీ.. రెండో పెళ్లి గురించి తెలియలేదు అని సుమిత్ర అంది. దాంతో ఈల వేసిన నర్సింహ.. నీ స్టోరీనంతా చెప్పేసి.. నీవు హీరోయిన్ అయి.. నన్ను విలన్ చేశావా? ఉన్నట్టు ఉండి ఊరికి వెళ్తావా? లేదా జుట్టు పట్టుకొని వెళ్లి ఊర్లో వదిలేస్తాను అని అంటే.. మరోసారి నర్సింహ చెంపను సుమిత్ర పగలగొట్టింది. దీప నా కూతురు అని సుమిత్ర అంటే... ఊర్లో భార్యలను వదిలేసిన వారికి నీవు తల్లివా? అని నర్సింహ అన్నాడు.
అయితే న్యూసెన్స్ చేస్తున్న నర్సింహను పోలీసులకు పట్టించాలని అంటే.. వద్దండి.. మా ఇద్దరి మధ్య వివాదం గురించి మేము పరిష్కరించుకొంటాం అని దీప చెప్పింి. అయితే ఏంటి మీ అక్రమ సంబంధాలు.. వింటుంటూనే కంపరంగా ఉంది అంటూ పారిజాతం చీదరించుకొన్నది. అయితే దీపకు ఎవరు లేరని అనుకొంటున్నావా? మేము ఉన్నాం అని కార్తీక్ అన్నాడు. ముందు బయటకు వెళ్లు.. అని కార్తీక్ అంటే.. ఊరికి వెళ్లకపోతే నీ సంగతి చూస్తాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ అక్కడి నుంచి నర్సింహ వెళ్లిపోయాడు. దాంతో అవమానం భరించలేక దీప అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయింది. ఇంకా ఈ సీరియల్‌లో ఏం జరిగిందనే విషయం కోసం.. రేపటి ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి..


Click it and Unblock the Notifications











