Karthika Deepam 2 May 1st: దీప బలహీనతపై పారిజాతం దెబ్బ.. బంటు స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని జోత్స్న ని రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. తాగి కార్ యాక్సిడెంట్ చేస్తుంది జోత్స్న. దీప నిజం చెప్పటంతో జోత్స్న ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీప మీద జోత్స్న మనసు విరిగిపోయేలాగా చేస్తుంది పారిజాతం. బంటు ఇచ్చిన సలహాతో దీప కి డబ్బిచ్చి అక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే1 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 33వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నీవల్ల ఇంట్లో జరిగిన రచ్చ చాలు, ఈ డబ్బు తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపో. సుమిత్ర ఇప్పటికే కూతురు దగ్గర కూర్చుని ఏడుస్తుంది. లేదు, తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉంది కాబట్టి ఆత్మ అభిమానం చంపుకొని ఇక్కడే ఉంటాను అంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది పారిజాతం. ఆమెని ఆపి ఆమె విసిరేసిన డబ్బుని తిరిగి ఆమె చేతిలోనే పెట్టి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య అమ్మమ్మ లేదంట జో దగ్గర ఉందంట అని చెప్తుంది.

దీప పదా మనం బయలుదేరుదాం అంటుంది. ఎక్కడికి అంటుంది శౌర్య. మనం ఊరు వెళ్లి సైకిల్ తీసుకొని వద్దాం అంటుంది దీప. ఆ మాటలకి ఆనందపడుతుంది శౌర్య. కూతురి మెడలో చైన్ తీసేసి కబోర్డ్ లో పెట్టి మేము ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నామమ్మా అని మనసులోనే అనుకోని కూతురిని తీసుకొని బయలుదేరుతుంది దీప. రోడ్డు మీద నడుస్తూ నేను ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను నన్ను తిట్టుకుంటారేమో అనుకుంటుంది.
ఇంతలోనే వాళ్ళని కార్తీక్ చూసి ఇంట్లో జరిగిన రచ్చకి ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో అని కారు దిగి వాళ్ల దగ్గరికి వస్తాడు. శౌర్య తో మాట్లాడుతూ నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెడతాను వెళ్లి కారులో కూర్చో అని చెప్పి శౌర్య ని కార్లో కూర్చోబెట్టి దీప దగ్గరికి వచ్చి ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అందుకే వెళ్ళిపోతున్నారా అని అడుగుతాడు. నేను ఈ ఊరు వచ్చిన పని అయిపోయింది అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంది దీప. కానీ శౌర్య దృష్టిలో వాళ్ళ నాన్న దొరకలేదు కదా అంటాడు కార్తీక్.
వాళ్ల నాన్న ఎప్పటికీ దొరకడు తన నాన్నను చూసి బూచాడు అనుకుంటుంది, తను అనుకునే మంచి నాన్నని నేను తీసుకురాలేను అంటుంది దీప. మరి తను తండ్రి గురించి అడిగితే ఏమని చెప్తారు అని అడుగుతాడు కార్తీక్. చనిపోయాడని చెప్తాను అంటుంది దీప.ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అక్కడ మల్లేష్ మిమ్మల్ని బ్రతకనిస్తాడా అంటాడు కార్తీక్. దీప ఆశ్చర్యంగా చూస్తే జరిగిందంతా చెప్తాడు కార్తీక్. అప్పుడు దీప బాధపడుతూ మీరు వాడిని చెంప మీద కొడితే వాడు నా గుండె మీద కొట్టాడు అని చెప్పి జరిగిందంతా చెబుతుంది దీప.
ఇంత చేసిన మీరు మంచివారు అనిపించుకోవడం కోసం రేపు నా కూతుర్ని నా నుంచి దూరం చేసినా చేస్తారు అంటూ కార్లో ఉన్న కూతుర్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు సుమిత్ర గారి కేసుకి సంబంధించి ఒక అనుమానితుడిని తీసుకొని వచ్చాను దీపని తీసుకొని రండి అని సుమిత్ర వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. దీపని తీసుకొని రమ్మని దశరధ్ కూతురితో చెప్తాడు. దీప గదికి వెళ్లిన జోత్స్న కి ఇల్లు ఖాళీగా ఉండటం, కబోర్డ్ లో చైన్ కనిపించడంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని నిర్ధారించుకొని అదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి చైన్ తల్లికి ఇస్తుంది.
ఎక్కడ మీ కూతురికి ఇబ్బంది అవుతుందో అని మీరే సాక్షిని మాయం చేసేసారా అంటూ సుమిత్ర వాళ్లపై కోప్పడతాడు పోలీస్. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ దీపని ఎవరు పంపించలేదు తనే వెళ్ళిపోయింది అంటాడు. తను ఎక్కడ ఉందో మీకు తెలుసా అంటాడు ఎస్ఐ. తెలుసు ఇప్పుడే వెళ్లి తీసుకు వస్తాను అంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











