Karthika Deepam 2 May 2nd: అన్ని విషయాలు బావకు తెలుసంటున్న జోత్స్న.. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో అనసూయ!
తాగి కార్ యాక్సిడెంట్ చేస్తుంది జోత్స్న. దీప నిజం చెప్పటంతో జోత్స్న ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీప మీద జోత్స్న మనసు విరిగిపోయేలాగా చేస్తుంది పారిజాతం. బంటు ఇచ్చిన సలహాతో దీప కి డబ్బిచ్చి అక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. పారిజాతం మాటలకు బాధపడిన దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే2 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 34వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మీరు వాళ్ళని అనుమానించవలసిన అవసరం లేదు, దీప ఎక్కడ ఉందో నాకు తెలుసు నేను వెళ్లి తీసుకు వస్తాను అని దీపని తీసుకురావడానికి వెళ్తాడు కార్తీక్. దీప వెళ్లిపోవడం వెనక అత్తగారి హస్తం ఉందని భావించిన సుమిత్ర దీపని మీరేమైనా అన్నారా నిజం చెప్పండి అని పారిజాతాన్ని అడుగుతుంది. తప్పు తను చేస్తే నువ్వు గ్రానీని నిలదీస్తావేంటి, తను ఇంట్లోంచి వెళ్లిపోవడం మనకి తెలియలేదు కానీ ఎక్కడో ఉన్న బావకి తెలిసింది.

వెళ్లి తీసుకు వస్తాను అన్నాడంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో బావకు తెలుసు అంటుంది జ్యోత్స్న. మరోవైపు ఆటో ఎక్కబోతున్న దీపని ఆపి జరిగిందంతా చెప్తాడు కార్తీక్.మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటుంది దీప. పని అయిపోయిన వెంటనే నేనే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తాను అంటాడు కార్తీక్. నమ్మొచ్చా అంటుంది దీప. ఈసారి నమ్మొచ్చు అంటాడు కార్తీక్. కూతుర్ని తీసుకొని కారెక్కుతుంది దీప. దారిలో శౌర్యకి అనసూయ కనిపిస్తుంది. అమ్మ.. నానమ్మ అంటుంది శౌర్య. నానమ్మ ఇక్కడెందుకు ఉంటుంది అంటుంది దీప.
కావాలంటే చూడు అని దీపతో చెప్పి, కారు ఆపమని కార్తీక్ కి చెప్తుంది శౌర్య. కార్ లోంచి అనసూయని చూసిన దీప కిందికి దిగి ఆమె దగ్గరికి వెళుతుంది. కార్తీక్ శౌర్యతో ఆవిడ ఎవరు అని అడుగుతాడు, మా నానమ్మ అని చెప్తుంది శౌర్య. దీప అనసూయతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ కి ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో త్వరగా వెళ్దాం పదండి ఉంటాడు. మా అత్తయ్య కూడా మాతో వస్తుంది అంటుంది దీప. సరే అని ఆమెను కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్.
దారిలో ఊర్లో మల్లేష్ చేసిన గొడవ గురించి చెప్పి సైకిల్ అమ్మేసిన విషయం కూడా చెప్తుంది అనసూయ. అనసూయ మీద కోప్పడుతుంది శౌర్య. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం కాసేపు ఆగండి అని ఇద్దరినీ వారిస్తుంది దీప. దీప కార్లో తిరుగుతుంది ఏంటి అని అనుమాన పడుతుంది అనసూయ. కార్తీక్ ఒక పెద్ద ఇంటి ముందు ఆపడంతో ఎక్కడికి తీసుకువచ్చారు అనుకుంటుంది. కారు దిగి కార్తీక్ లోపలికి వెళ్తాడు. అక్కడ పోలీసుల్ని చూసిన అనసూయ ఏమైంది అని కోడల్ని అడుగుతుంది.
తర్వాత చెప్తాను అని చెప్పి తనతో పాటు లోపలికి తీసుకు వెళుతుంది దీప. దీప మీద కోపంతో ఉన్న సుమిత్ర చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేదేమిటి, నా మాటంటే అంత ఖాతరు లేకుండా పోయిందా అని చివాట్లు పెడుతుంది. ఆవిడ ఎవరు దీపని సొంత మనిషిని తిట్టినట్లుగా తిడుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అయోమయం పడుతుంది అనసూయ.

సుమిత్ర గారు నిజంగానే నీ మీద కోప్పడుతున్నారా లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోమని చెప్పి అందరి ముందు నిన్ను తిడుతున్నారా అని దీపని అడుగుతాడు సీఐ. అలా అంటున్నారు ఏంటి అంటాడు కార్తీక్. ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతున్నా దీప ఏమి మాట్లాడటం లేదంటే దీని వెనక ఏదో కారణం ఉంది,నువ్వు వెళ్ళిపోవటం వెనుక ఏదైనా కారణం ఉందా అని దీప ని అడుగుతాడు సీఐ. నిజం చెప్పేస్తుందేమో అని కంగారుపడుతుంది పారిజాతం. అలాంటిదేమీ లేదు అని చెప్తుంది దీప.
సీఐ చూపించిన అనుమానితుడు సుమిత్ర ని కొట్టిన వాడు కాదు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ కేసు ఏ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు ఆఫీసర్స్ మాత్రం మారుతున్నారు అంటాడు. నా సిన్సియారిటీ నే అనుమానిస్తున్నారు కదా వారం రోజుల్లోగా ఆ వ్యక్తిని తెచ్చి మీ ముందు నిలబెడతాను అప్పటివరకు దీప బాధ్యత మీదే అని చెప్తాడు సిఐ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











