Karthika Deepam 2 May 4th: దీపకి న్యాయం చేస్తానంటున్న అనసూయ.. భార్య మీద తల్లికి పితూరీలు చెప్తున్న నర్సింహా!

బంటు ఇచ్చిన సలహాతో దీప కి డబ్బిచ్చి అక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. పారిజాతం మాటలకు బాధపడిన దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటికి పోలీసులు రావటంతో కార్తీక్ మళ్ళీ ఆమెని వెనక్కి తీసుకువస్తాడు. దీప భర్త గురించి అనసూయ కి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ సుమిత్ర వింటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే4 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 36వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నీకు ఉన్న పనులు చాలవా,మళ్లీ ఇవన్నీ అవసరమా అంటుంది కాంచన. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో బైకు సైడ్ స్టాండ్ తీయలేదని, ఎవరో అమ్మాయి చున్నీ చక్రాల్లో ఇరుక్కుపోతుందని చూసి ఊరుకోలేము కదమ్మా, వాళ్ళు ఎవరో తెలియకపోయినా పిలిచి హెచ్చరిస్తాము. ఇది కూడా అలాంటిదే దీనిని తెలుగులో మానవత్వం అంటాము అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. నేనేదో సరదాగా అన్నాను కానీ నిజంగానే వీడికి పేరు మార్చేయాలి అంటాడు కార్తీక్ తండ్రి. వాడు మేమి అనొద్దు అంటూ కొడుకుని వెనకేసుకొస్తుంది కాంచన.

Karthika Deepam season 2 May 4th 2024 Episode Number 36 Here is full story
మరోవైపు దీప, అనసూయ మాటలు విన్న సుమిత్ర దీపని మందలిస్తుంది. నేను నిన్ను కూతురుల భావిస్తుంటే నువ్వు నన్ను పరాయి దానిలా భావిస్తున్నావు. నిన్ను ఆ రోజే అడిగాను కానీ నిజం చెప్పలేదు అంటుంది. చెప్తే ఆ రోజే వాడి సంగతి తేల్చేసేదాన్ని అంటుంది. మా అబ్బాయి మీకు కూడా తెలుసా అంటుంది అనసూయ. తెలుసు, దీపని ఊర్లోంచి వెళ్ళిపోమని ఇంటికి వచ్చి మరీ బెదిరించాడు వాడి మీద పోలీస్ కేసు పెడతాను అంటుంది సుమిత్ర.

అంత పని చేయకండి, పోలీస్ కేసు పెడితే వీళ్ళ బ్రతుకులు రోడ్డు మీదకి ఎక్కడం తప్పితే జరిగేదేమీ ఉండదు. దీపకి నేను న్యాయం చేస్తాను రేపే వాడి దగ్గరికి వెళ్తాను అంటుంది అనసూయ. సరే పరిస్థితులు ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితులలోనూ నీకు నేను అండగా ఉంటాననే విషయం మర్చిపోకు అంటుంది సుమిత్ర. తర్వాత రోజు నర్సింహ శోభ ని టీ పెట్టమంటాడు. ముందు నీ పెళ్ళాన్ని ఊరి నుంచి పంపించు అని చెప్పి భర్తని ఖాతరు చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది శోభ.

Karthika Deepam season 2 May 4th 2024 Episode Number 36 Here is full story

ఇదంతా దీప నుంచే దాని సంగతి చూడాలి అనుకుంటాడు నర్సింహ. ఇంతలోనే తన ఇంటికి వస్తున్న దీపని చూసి ఈరోజు దీని పని చెప్తాను అనుకొని కర్ర పట్టుకుంటాడు. అయితే దీప వెనకే వస్తున్న తల్లిని చూసి షాక్ అవుతాడు. అమ్మకి దొరికితే అయిపోతాను అనుకుంటూ లోపలికి వెళ్లి తలుపు వేసుకోబోతాడు. అయితే అనసూయ ఊరుకోకుండా పరుగున వెళ్లి తలుపు తోసేస్తుంది, కొడుకు మీద కోపంతో రగిలిపోతూ అతని మీద చేయి చేసుకుంటుంది. తల్లి కాళ్లు పట్టుకొని నిన్ను చెప్పేది విను అంటాడు నరసింహా.

అంతలోనే శోభ బయటకు వచ్చి ఆవిడ ఎవరు, ఆవిడ కాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నావు అని భర్తని అడుగుతుంది. శోభని చూసిన అనసూయ ఆమె మీద మండిపడుతూ పెళ్లయి,కూతురు ఉన్న మగవాడిని వల్లో వేసుకోవడానికి నీకు సిగ్గు లేదా అంటూ తిడుతుంది.ఆ మాట నీ కొడుకుని అడుగు, నిన్ను చేసుకోపోతే చచ్చిపోతాను అని నా వెనక తిరిగాడు, మీ వాళ్ళు ఒప్పుకుంటారా అంటే నాకు అమ్మానాన్న చచ్చిపోయారు ఎవరూ లేరు అని చెప్పాడు అంటుంది.

Karthika Deepam season 2 May 4th 2024 Episode Number 36 Here is full story

కొడుకు మీద కోప్పడుతుంది అనసూయ, మరి దీప బ్రతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నిలదీస్తుంది.దీప మంచిది కాదు అది ఎవరో డబ్బున్నోడిని పట్టింది వాడి చేత నన్ను కొట్టించింది, అది ఎక్కడ ఉందో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్లి ఊరు వెళ్ళిపో అని చెప్పటానికి వెళ్తే ఎవరో పెద్ద ఆవిడ చేత కొట్టించింది అని తల్లికి పితూరిలో చెప్తాడు నరసింహ అవన్నీ అబద్ధాలు అంటుంది దీప. జరిగింది ఇది అయితే నాకు మరోలా చెప్పావ్ ఏంటి నాకు అన్యాయం చేసావు అంటుంది శోభ.

నీకేమన్యం జరిగింది నా కొడుకు తెస్తే తేరగా తింటున్నావు కదా అంటుంది అనసూయ. నాకేం కర్మ మా అమ్మ కోటి రూపాయలు ఇల్లు ఇచ్చింది, 10 లక్షలు పెట్టి అల్లుడికి కార్ ఇచ్చింది, పది లక్షలు పెట్టి నాకు నగలు చేయించింది అంటుంది శోభ. ఆ మాటలకి ఆనంద పడిపోతుంది అనసూయ, నీ ఒంటిమీద ఉన్నదంట ఒరిజినల్ బంగారం ఏనా అంటూ ఆశగా ఆ బంగారాన్ని అంతా తడిమి చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X