Karthika Deepam 2 May 6th: కొడుకుతో చేరి దీపని బయటికి పొమ్మన్న అనసూయ.. పారిజాతాన్ని అవమానించిన శివనారాయణ!

పారిజాతం మాటలకు బాధపడిన దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటికి పోలీసులు రావటంతో కార్తీక్ మళ్ళీ ఆమెని వెనక్కి తీసుకువస్తాడు. దీప భర్త గురించి అనసూయ కి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ సుమిత్ర వింటుంది. కొడుకు గురించి నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది అనసూయ. కోడలికి ఎలాగైనా న్యాయం చేస్తానంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 37వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శోభ ఒంటిమీద నగలు చూసి ఆనందపడిపోతుంది అనసూయ. తప్పంతా నర్సింహదే గాని శోభదేమి తప్పు లేదన్నట్లు మాట్లాడుతుంది. అయినా వచ్చి వారం రోజులు అయింది, మొగుడు ఇలా మాట్లాడాడు అంటే వచ్చి నాకైనా చెప్పాలి లేదంటే వాడినైనా పట్టుకుని నిలదీయాలి. నీకు కాపురం కావాలి అంటే వాడు కొట్టినా తిట్టినా ఇక్కడే ఉండాలి అని తిరిగి దీపనే తిడుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వచ్చిన దారినే తిరిగి వెళ్ళు అంటుంది.

Karthika Deepam season 2 May 6th 2024 Episode Number 37 Here is full story

ఎక్కడికి వెళ్ళమంటావు అంటుంది దీప. మన ఊరు వెళ్ళిపో అంటుంది అనసూయ. అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు అంటుంది దీప. అప్పులు మనం చేసుకున్నాము మనమే తీరుద్దాము వాటితో తనకి ఏంటి సంబంధం అంటాడు నర్సింహా.శోభ కూడా అత్తని బుట్టలో వేసుకుంటే దీప అడ్డు తొలగించుకోవచ్చు అనుకుంటుంది.

అవునత్తయ్య మా అమ్మని డబ్బులు తెమ్మని చెప్పాను, వాటితో మన అప్పులన్నీ తీర్చేద్దాం అంటుంది. నీ కొడుకు నిన్ను నడిరోడ్డు మీద వదిలేస్తాడు, కొడుకు వదిలేసినట్లుగా నేను నిన్ను వదిలేయలేనందుకు నువ్వు నాకు బాగా బుద్ధి చెప్పావు, నిన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చాను నన్ను అనుకోవాలి అని ఏడుస్తుంది దీప. నర్సింహ శోభని వదిలి ఉండలేడు నువ్వు ఎవరు లేకపోయినా బ్రతకటానికి అలవాటు పడ్డావు.

Karthika Deepam season 2 May 6th 2024 Episode Number 37 Here is full story

ఎలాగైనా బ్రతికేస్తావు, ఇకనుంచి నీకు, నీ కూతురికి మాకు ఎలాంటి సంబంధం లేదు బయటికి నడువు అంటుంది అనసూయ. అదే అదనగా భావించిన శోభ అత్తగారికి సపర్యలు చేస్తూ కాకా పడుతుంది. ఆ సపర్యలకి పొంగిపోయిన అనసూయ నేను ఇంక ఊరు వెళ్ళను
ఇక్కడే ఉండిపోతాను అనుకుంటుంది. మరోవైపు బాధగా కూర్చున్న జ్యోత్స్న దగ్గరికి వచ్చిన పారిజాతం ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేయు అంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ ఏంటి మనవరాలుకి సలహా ఇస్తున్నావు అని అడుగుతాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సుమిత్ర దంపతులు వచ్చి బయటికి వెళ్దాము అని చెప్తారు. అంతలోనే కార్తీక్ శౌర్య ని ఎత్తుకొని వస్తాడు. మా అల్లుడు చంక ఎక్కావేంటి అని నవ్వుతుంది సుమిత్ర. మీ అల్లుడు కాదు నా కార్తీక్ అంటుంది శౌర్య. అలా అన్నందుకు శౌర్యని కోప్పడుతుంది అనసూయ. గాడిద లాగా ఉన్నావు చంకనెక్కడమేంటి నడిచి రాలేవా అంటుంది.

ఆ మాటలకి పారిజాతాన్ని కోప్పడతాడు శివ నారాయణ. నా ఎదురుగానే చంటి దాన్ని ఇలా అన్నావంటే వాళ్ళ అమ్మని కూడా నువ్వే ఏదో అనుకుంటావు అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంది అంటాడు శివ నారాయణ. మీ అమ్మని పిలువు నాకు పాయసం తాగాలని ఉంది అని శౌర్యతో చెప్తాడు శివ నారాయణ. అమ్మ, నానమ్మ బయటకు వెళ్లారు అంటుంది శౌర్య. తనకి ఏదో తెలియని సమస్యలు ఉన్నాయి కార్తీక్. ఆత్మాభిమానం కల పిల్ల తన బాధని చెప్పుకోలేక పోతుంది.

Karthika Deepam season 2 May 6th 2024 Episode Number 37 Here is full story

తన బాధ్యతను తీసుకున్నావు కాబట్టి ఆ సమస్య ఏమిటో తెలుసుకుని తీర్చే ప్రయత్నం చెయ్యు అని కార్తీక్ కి చెప్తాడు శివ నారాయణ. అందుకు సరే అంటాడు కార్తీక్. మరోవైపు అనసూయ అన్న మాటలకి, చేసిన అవమానానికి గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది దీప. ఇన్నాళ్లు భర్త చేతిలో మోసపోయిన భార్యనే అనుకున్నాను కానీ ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడల్ని చేసేవా అత్తయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X