Karthika Deepam 2 May 7th: కొత్త జీవితం ప్రారంభించిన దీప.. కార్ లో ఉండాల్సిన జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది?
ఇంటికి పోలీసులు రావటంతో కార్తీక్ మళ్ళీ ఆమెని వెనక్కి తీసుకువస్తాడు. దీప భర్త గురించి అనసూయ కి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ సుమిత్ర వింటుంది. కొడుకు గురించి నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది అనసూయ. కోడలికి ఎలాగైనా న్యాయం చేస్తానంటుంది.కానీ కొడుకుతో చేరి దీపని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది అనసూయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే7 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 38వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
భర్త చేతిలో మోసపోయిన భార్యనే అనుకున్నాను కానీ ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడల్ని చేశావు, ఇప్పుడు నాకు శౌర్య మాత్రమే మిగిలింది, ఊరికి వెళ్లలేను అలా అని ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఆధారపడలేను. పాపని ఎలాగైనా చదివించాలి, ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి 12 నెంబర్ బస్సు వచ్చిందా అని అడుగుతాడు. తెలియదు అంటుంది దీప.

దీప ఏడుస్తుందని గమనించిన ఆ వ్యక్తి ఏం జరిగిందమ్మ నువ్వు కూడా పట్నంలో బ్రతకడానికి వచ్చావా.. ఈ పట్నం అందరికీ నీడనివ్వదు అంటాడు. నేను వచ్చింది వేరే పని మీద బాబాయ్ కానీ ఇప్పుడు ఇక్కడే బ్రతకాలి అంటుంది. నేను కూడా పట్నంలో బ్రతుకుదామని వచ్చాను కానీ కుదరక వెళ్ళిపోతున్నాను అంటూ అతని కథంతా చెప్తాడు బాబాయ్. ఆ కథ విన్న దీపకి ఒక ఆలోచన వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు బాబాయ్ నీ హోటల్, నువ్వు రన్ చెయ్యు నేను నీకు సహాయంగా ఉంటాను.

నీకు వ్యాపారం చేసినట్లుగా ఉంటుంది, నాకు ఉపాధి దొరికినట్లుగా ఉంటుంది అని ఒప్పించి అతనితో పాటు మూసేసిన కాకా హోటల్ కి వెళ్తుంది. మరోవైపు కార్తీక్, శౌర్య ఆడుకుంటూ ఉంటారు. అమ్మ ఇంకా రాలేదు ఏంటి కార్తీక్, నాకు భయంగా ఉంది అంటుంది. ఎందుకు మేమందరం ఉన్నాం కదా అంటాడు కార్తీక్. నా భయం నా గురించి కాదు, అమ్మ గురించి మళ్లీ ఆ బూచాడు దారిలో కనిపించి అమ్మని ఏమైనా అంటాడేమో అంటుంది.

అలాంటి భయాలు ఏమి పెట్టుకోకు ఆడుకో అంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి జోత్స్న, పారిజాతం వస్తారు. నువ్వు కార్తీక్ కి ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకువెళ్ళు ఈ శౌర్య సంగతి నేను చూసుకుంటాను అంటుంది పారిజాతం. జోత్స్న కార్తీక్ దగ్గరికి వచ్చి బయటికి తీసుకు వెళ్ళమంటుంది. కార్తీక్ కి ఇష్టం లేకపోయినా జోత్స్న రిక్వెస్ట్ చేయడంతో ఆమెను తీసుకొని బయటికి వెళ్తాడు. మరోవైపు మూసేసిన కాకా హోటల్ ని ఓపెన్ చేసి టీ కాస్తుంది దీప.

అదే సమయంలో కారులో వెళ్తున్న కార్తీక్ ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతాడు. మంచి కాఫీ తాగుదాం అంటుంది జోత్స్న. ఎప్పుడూ కాఫీ యేనా ఈసారి టీ తాగుదాము, ఏదైనా కాకా హోటల్ లో ట్రై చేద్దాం అంటాడు కార్తీక్. సరే అంటుంది జ్యోత్స్న. కార్తీక్ కారు ఆపిన దగ్గరే దీప కాకా హోటల్ ఉంటుంది. జ్యోత్స్న ని టీ తాగటానికి రమ్మంటాడు కార్తీక్, నేను రాను నువ్వు వెళ్లి తాగు అంటుంది జోత్స్న. సరే అని వెళ్ళిన కార్తీక్ అక్కడ దీపని చూసి షాక్ అవుతాడు. కార్తీక్ ని చూసి మొదటి కస్టమర్ వచ్చినందుకు ఆనందపడతాడు బాబాయ్.
దీప చేత్తోనే కార్తీక్ కి టీ ఇమ్మని చెప్తాడు. టీ చాలా బాగుంది అంటాడు కార్తీక్. మీరు ఇక్కడ పని చేస్తున్నట్టు ఇంట్లో వాళ్లకు తెలుసా అంటాడు కార్తీక్. ఈవిడ మీకు ముందే తెలుసా అంటాడు బాబాయ్. తెలుసు మా తాతయ్య గారి ఇంట్లోనే ఉంటుంది అంటాడు కార్తీక్. అంత గొప్ప ఇంట్లో ఉండి ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు అంటాడు బాబాయ్. నా కాళ్ళ మీద నేను నిలబడటం కోసం అంటుంది దీప. మీకోసం శౌర్య భయపడుతుంది ముందు ఇంటికి రండి అంటాడు కార్తీక్.

బాబాయ్ నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. రాను అనుకోవద్దు మనం ఈ వ్యాపారం కచ్చితంగా చేస్తున్నాం అంటుంది దీప. కార్తీక్ ఎంతకీ రాకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది జోత్స్న. అక్కడ దీప కనిపించడంతో తన కోసమే ఇక్కడ టీ తాగుదామని చెప్పావా.. అంటే దానికి ఉన్న విలువ కూడా నాకు లేదా అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. దీపని తీసుకొని కార్తీక్ కారు దగ్గరికి వచ్చేసరికి అక్కడ జ్యోత్స్న కనిపించదు. షాక్ అవుతాడు కార్తీక్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











