Karthika Deepam 2 May 8th: కార్తీక్ మీద కోపంతో రగిలిపోతున్న జ్యోత్స్న.. దీప కి దొంగతనం అంటగట్టిన పారిజాతం!
దీప భర్త గురించి అనసూయ కి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ సుమిత్ర వింటుంది. కొడుకు గురించి నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది అనసూయ. కోడలికి ఎలాగైనా న్యాయం చేస్తానంటుంది.కానీ కొడుకుతో చేరి దీపని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది అనసూయ. బయటికి వెళ్లిన తల్లి గురించి భయపడుతూ ఉంటుంది శౌర్య.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే8 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 39వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
జ్యోత్స్న కారులో లేకపోవడం చూసి ఆమెకి కాల్ చేస్తాడు కార్తీక్. కోపంగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోతున్న జ్యోత్స్న కార్తీక్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో సార్ కి ఇప్పుడు గుర్తొచ్చినట్లుగా ఉన్నాను అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు తీరిగ్గా టీ తాగి రా అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. జోత్స్న వెళ్ళిపోయిందంట పదండి మనం వెళ్దాం అని కార్తీక్ చెప్పటంతో దీప కారెక్కుతుంది. అంత డబ్బున్న వాళ్ళతో పరిచయం ఉన్న దీపమ్మ ఇక్కడ ఎందుకు పనిచేస్తుంది అనుకుంటాడు బాబాయ్.

మరోవైపు బంటు చేసిన జ్యూస్ తాగుతూ దీప వాళ్ళని ఇంట్లోంచి ఎలా అయినా బయటికి గెంటేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు పారిజాతం, బంటు. అంతలోనే ఇంట్లోకి వచ్చిన ఆటోని చూసి ఈ పారిజాతం బంగ్లాకి ఆటో రావటం ఏమిటి దీప వాళ్ళే అయ్యుంటారు వాళ్ళని తరిమేయ్ అంటుంది పారిజాతం. అలాగే అంటాడు బంటు కానీ ఆటోలో నుంచి దిగుతున్న జ్యోత్స్న ని చూసి షాక్ అవుతాడు.
అదే విషయం పారిజాతానికి చెప్తే ఆమె కంగారుపడుతూ మనవరాలి దగ్గరికి వచ్చి నీకు ఇదేం కర్మ అంటుంది. జరిగిందంతా చెప్తుంది జ్యోత్స్న. ఆ దీపని ఇంట్లోంచి ఎలాగైనా బయటికి గెంటేయాలి ఆ పని చూడు అని బంటు కి పురమాయిస్తుంది పారిజాతం. మీ మొహంలో చిరునవ్వు చూడటం కోసం నేను ఏమైనా చేస్తాను అంటాడు బంటు. మరోవైపు కారులో వస్తున్న దీపతో ఒకసారి కారు దిగండి మీతో మాట్లాడాలి అంటాడు కార్తీక్.

ముందు ఇంటికి పోనివ్వండి అంటుంది దీప. మాట్లాడాలి అంటున్నాను కదా అంటాడు కార్తీక్. సరే అయితే నేను నడిచి వెళ్ళిపోతాను అని కారు దిగి వెళ్ళిపోతున్న దీప దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలి అన్నాను కదా దేని గురించి అని కూడా అడగరా అంటాడు కార్తీక్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన నర్సింహ కారు ఆపుతాడు. కారెందుకు ఆపావు అంటుంది అనసూయ. ఒకసారి అటు చూడు అని దీపా వాళ్ళని చూపిస్తాడు నర్సింహ.
ఊర్లో ఉండేటప్పుడు ఎలా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత బరితెగించింది దాని సంగతి చెప్తాను అని కారు దిగబోతున్న అనసూయని ఆపుతాడు నర్సింహ. ఇప్పుడు అడిగితే అది ఏదో ఒక అబద్ధం చెప్తుంది అంటాడు. ముందు తనని ఊరికి పంపించేయండి అత్తయ్య, మీరు తలుచుకుంటే చేయగలరు అని అనసూయని రెచ్చగొడుతుంది శోభ. దాని సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు కారు పోనివ్వు అని తల్లి చెప్పడంతో అక్కడినుంచి బయలుదేరుతాడు నర్సింహ. కార్తీక్ శౌర్య చదువు గురించి మాట్లాడుతాడు అవసరమైతే తాను సాయం చేస్తాను అంటాడు.

నా బిడ్డని నేను చదివించుకుంటాను నాకు ఎవరి సాయం అక్కర్లేదు అనటంతో మళ్లీ ఇద్దరూ కారు ఎక్కి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు బావ మారిపోయాడు అంటూ పారిజాతం దగ్గర బాధపడుతుంది జ్యోత్స్న. నేను ఏదైనా భరిస్తాను కానీ బావ నెగ్లిజెన్సీ ని
భరించలేను అంటుంది. మీ బావ మారిపోయాడు అంటే ఎలా నమ్ముతావు, వాడు ముందు నుంచి అంతే కదా అంటుంది పారిజాతం. అలా ఏం కాదు బావ ఇంతకు ముందు బర్త్డేలకి గిఫ్ట్లు ఇచ్చేవాడు.

లాస్ట్ టైం ఇచ్చిన డైమండ్ నెక్లెస్ నేను ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాను కావాలంటే నువ్వే చూడు అని ఆ నెక్లెస్ చూపించాలనుకుంటుంది, అయితే ఆ నెక్లెస్ ఎక్కడా కనిపించదు. ఇంకేముంది ఆ ఇంటికి చేరిపోయి ఉంటుంది అంటుంది పారిజాతం. వెంటనే మామ్మ, మనవరాలు ఇద్దరూ కిందికి వెళ్లి సుమిత్ర దంపతులకు విషయం చెప్తారు. మన ఇంట్లో ఉన్న వస్తువు ఎలా పోతుంది ఇంట్లో అందరూ మనవాళ్ళే కదా అంటుంది సుమిత్ర.
ఈ మధ్య బయట వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా అంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్,దీప ఇంట్లోకి వస్తారు. దీప శౌర్య ని పిలుస్తుంది. బయట వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్పక్కర్లేదు అనుకుంటాను అంటుంది పారిజాతం. అంటే ఆ నెక్లెస్ దీప తీసింది అంటున్నారా అంటుంది సుమిత్ర. తనే తన కూతురితో ఈ పని చేయించి ఉంటుంది అంటుంది పారిజాతం. ఆమెని కోప్పడుతుంది సుమిత్ర.
పారిజాతాన్ని వెనకేసుకొస్తుంది జ్యోత్స్న. పారు కంటే తెలియదు నీకైనా దీప గురించి తెలియదా కాస్తయినా సంస్కారం ఉండాలి అంటాడు కార్తీక్. నీ సంస్కారం ఇందాక టీ కొట్టు దగ్గరే చూశాను అంటుంది జోత్స్న. దీప ఏడుస్తూ నేను నా కూతురుతో ఈ పని చేయించానా అంటుంది. ఏమో నీకు ఏం అవసరం వచ్చి ఈ పని చేయించావో అని వెటకారంగా అంటుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











