Karthika Deepam 2 May 9th: నక్లీస్ మా బ్యాగ్ లోనే ఉందంటూ షాకిచ్చిన శౌర్య.. బంటుని ఇంట్లోంచి గెంటేసిన దశరథ్!
కొడుకు గురించి నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది అనసూయ. కోడలికి ఎలాగైనా న్యాయం చేస్తానంటుంది.కానీ కొడుకుతో చేరి దీపని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది అనసూయ. బయటికి వెళ్లిన తల్లి గురించి భయపడుతూ ఉంటుంది శౌర్య. కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి భరించలేక కోపంతో ఒక్కర్తె ఇంటికి వచ్చేస్తుంది జ్యోత్స్న. దీప మీద దొంగతనం అంటగడుతుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే9 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 40వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప కూతురుతో దొంగతనం చేయించిందని ఆమె మీద కేకలు వేస్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ పారిజాతంపై కోప్పడతాడు. నేను గిఫ్ట్ గా ఇస్తానంటేనే చైన్ తీసుకోవటానికి ఇబ్బంది పడింది ఆ పిల్ల అలాంటిది తను దొంగతనం చేస్తుందా, ఎవరినైనా మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు అంటాడు. అంతలోనే అక్కడికి శౌర్య వచ్చి ఎందుకు తాత గ్రానీని కోప్పడుతున్నావు అని అడుగుతుంది.

అంతా నీ వల్లే అంటుంది పారిజాతం. నేనేం చేశాను అంటుంది శౌర్య. తనతో ఈ నెక్లెస్ గురించి ఏమి మాట్లాడొద్దని కార్తీక్, సుమిత్ర పారిజాతానికి చెప్తారు కానీ జ్యోత్స్న మాత్రం పారిజాతాన్ని అడగమంటుంది. పారిజాతం కూడా పిల్లల్ని అడిగితేనే నిజాలు తెలుస్తాయి అంటూ ఇంట్లో నెక్లెస్ పోయింది అది మీ ఇంట్లో ఉందా అని శౌర్యని అడుగుతుంది. ఉంది, మా బ్యాగ్ లోనే ఉంది అంటుంది శౌర్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దీప కూడా షాకవుతూ మన బ్యాగ్ లో ఎందుకు ఉంది నువ్వు పెట్టావా అని అడుగుతుంది.
లేదు ఆ అంకుల్ పెట్టాడు అంటూ బంటుని చూపిస్తుంది శౌర్య. అక్కడే ఉన్న బంటు ఒక్కసారిగా షాకవుతాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు కార్తీక్. నేను మంచం పక్కన డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటే ఆ అంకుల్ నెక్లెస్ తెచ్చి బ్యాగ్ లో పెట్టాడు. అమ్మమ్మ అమ్మ కోసం ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందేమో అని నేను కూడా ఏమీ మాట్లాడలేదు అంటుంది శౌర్య. నువ్వు వెళ్లి ఆ నెక్లెస్ తీసుకొని నెమ్మదిగా రా ఈ లోపు నేను ఆ అంకుల్ కి థాంక్స్ చెప్తాను అంటాడు కార్తీక్.
సరే అంటూ నక్లిస్ తేవటానికి వెళ్తుంది శౌర్య. అప్పుడే బంటు అక్కడ నుంచి తప్పించుకోబోతుంటే కార్తీక్ అతనిని పట్టుకొని నువ్వు ఈ పని ఎందుకు చేశావు, తను నీకేం అన్యాయం చేసింది, నువ్వే చేసావా లేదంటే నీకు ఎవరైనా ఈ పని చేయమని చెప్పారా అని అడుగుతాడు. నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతుంది పారిజాతం. కార్తీక్ బంటు ని దీప కాళ్ల మీద పడేసి క్షమాపణ అడగమంటాడు. క్షమాపణ చెప్తాడు బంటు. నింద వేసిన వాళ్ళకి నిజం తెలిసింది అంతే చాలు నాకు క్షమాపణలు వద్దు అంటుంది దీప.
నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేశావు ఇంక నిన్ను భరించే ఓపిక లేదు నువ్వు ఇకమీదట ఇంట్లో ఉండొద్దు, అసలు నా కంటికి కనిపించదు అని బంటుని ఇంట్లోంచి బయటికి పంపేస్తాడు దశరథ్. అప్పుడే నక్లిస్ తీసుకుని శౌర్య ఇంట్లోకి వస్తుంది. తన దగ్గర నెక్లెస్ తీసుకొని జ్యోత్స్న చేతిలో పెడుతూ నెక్లెస్ వెనక్కి తీసుకున్నంత తేలిక కాదు మాట వెనక్కి తీసుకోవడం అంటాడు కార్తీక్. మనసుల్ని అర్థం చేసుకోవటం కూడా అంత తేలిక కాదు అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జోత్స్న.
శివ నారాయణ కూడా పారిజాతాన్ని మందలించడంతో ఆమె కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమిత్ర కార్తీక్ తో మాట్లాడుతూ నీకు జ్యోత్స్న కుమధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. అవన్నీ ఎప్పుడూ ఉండేవే కదా లైట్ తీసుకో అని సుమిత్ర కి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మరోవైపు పారిజాతం కాంచన కి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన గొడవకి కార్తీక్ జోత్స్న కి సపోర్ట్ చేయకుండా ఆ దీపకి సపోర్ట్ చేశాడు అంతేకాదు దీపతో చనువుగా ఉంటున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది.
ఆ విషయం భర్తకు చెప్తుంది కాంచన. ఇక మనం ఉపేక్షించకూడదు, బావగారు వాళ్ళతో పెళ్లి ముహూర్తాల గురించి సీరియస్ గా మాట్లాడాలి అంటాడు కాంచన భర్త. మరోవైపు దీప బాబాయ్ దగ్గరికి ఉప్మా చేసి తీసుకు వస్తుంది, ఎలా ఉంది అని అడుగుతుంది. బాగుంది కానీ నాకు ఒక డౌట్ నువ్వు అంత డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండి కూడా నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావు అని అడుగుతాడు బాబాయ్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











