Karthika Deepam season 2 Weekly Roundup శౌర్య సరదాలు తీర్చేందుకు నువ్వెవరు? కార్తీక్‌ను నిలదీసిన దీప
కార్తీకదీపం సీజన్ 2 నవ వసంతం ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. ఈ సిరియల్‌లో మలుపులు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. బంటు, పారిజాతం చేసే కుట్రలు, అలాగే నర్సింహ నుంచి దీపకు ఎదురయ్యే సమస్యలు, జోత్స పెళ్లి చేసుకోవాలని ఆరాటపడితే కార్తీక్ ఎదుర్కొనే ఇబ్బందులు సీరియల్‌ను చూసేలా ఆకట్టుకొంటున్నది. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్‌లో
కార్తీక్‌పై దీప కోపంగా ఉంటుంది. నా జీవితంలో సుఖసంతోషాలను దూరం చేసిన వాడిని నాకు దూరంగా పెట్టండి అని దేవుడిని మొక్కకొంటుంది. గుడి నుంచి బయటకు వస్తుంటే.. నర్సింహ చూసి.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని కోపగించుకొంటాడు. ఇదిలా ఉండగా, సుమిత్ర ఫ్యామిలీకి శౌర్య దగ్గరవుతుంటుంది. అయితే దీపకు మాత్రం అలా దగ్గరవ్వడం ఇష్టం ఉండదు. ఇక కార్తీక్ పెళ్లికి అతడి తల్లి ప్లాన్ చేస్తుంటుంది. అయితే నా బిజినెస్ పనులు పూర్తయ్యే వరకు ఆగండి అని కార్తీక్ చెబుతాడు.

ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్‌లో
కార్తీక్ పెళ్లి గురించి ఫోర్స్ చేస్తుంటే.. తనకు ఇష్టం లేదని పారిజాతానికి సైగ చేసి వెళ్లిపోతుంటే.. శౌర్య కనిపిస్తుంది. అయితే గుడిలో జరిగిన సంఘటనల గురించి, నర్సింహ గురించి శౌర్యను అడిగి తెలుసుకొంటాడు. ఇదిలా ఉండగా, జ్యోత్స పుట్టిన రోజున దీపతో సుమిత్ర వంటలు చేయిస్తుంది. దీపపై బంటుతో పారిజాతం కలిసి కుట్రలు చేస్తుంటుంది. అయితే బంటూ తనను చూసి బయపడటంతో దీప కంగారు పడుతుంది.
ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్‌లో
పారిజాతంతో బంటూ కట్టు కథలు అల్లుతూ దీపను వణికిస్తాను అని చెబుతాడు. అయితే ఆపు నీ మాటలు.. నీవు చెబితే నేను నమ్మాలా? అని కౌంటర్ ఇస్తుంది. బట్టల షాప్ వద్ద కార్తీక్ కారులో ఉండగా శౌర్య చూసి మీతో రావొచ్చా అని అడిగితే.. జోత్స్య అడ్డుపడుతుంది. చివరకు ఒప్పించి శౌర్యను కార్తీక్ కారులో తీసుకెళ్తాడు. బట్టల షాపులో శౌర్యకు నర్సింహ రెండో భార్య కనిపించగానే దాచుకొనే ప్రయత్నం శౌర్య చేస్తుంది.
ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్‌లో
బట్టల షాపులో నర్సింహ రెండో భార్య చూడకుండా శౌర్య దాచుకొనే ప్రయత్నం చేస్తుంది. ఆమె చూడగానే అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్సింహను చూసి నీ భార్య, కూతురు ఇక్కడే ఉన్నారు. ఇంకా పోలేదా అని అరుస్తుంది. నీ బిడ్డ నిన్ను చూసి రాలేదేంటి? అని భార్య ప్రశ్నిస్తే.. పుట్టిన తర్వాత నా బిడ్డ చూడలేదు అని నర్సింహ సమాధానం ఇస్తాడు. అయితే షాపులో జరిగిన విషయాలన్నీ తల్లికి శౌర్య చెబుతుంది. దాంతో శౌర్యపై దీప కోపం చేస్తుంటుంది. కార్తీక్‌కు శౌర్య దగ్గర కావడం బాధపడుతుంది.
ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్‌లో
శౌర్యకు దగ్గర కావడంపై కార్తీక్‌ను దీప నిలదీస్తుంది. రౌడీకి చిన్న చిన్న సరదాలు ఉన్నాయి కదా అంటే.. వాటిని తీర్చడానికి నీవెవరు అని కార్తీక్‌ను దీప ప్రశ్నిస్తుంది. నీతో జరిగిన సంఘటన విషయంలో బాధపడుతున్నాను. పాప చిరునవ్వుతో దానిని తగ్గించుకొంటున్నాను అని కార్తీక్ అంటాడు. ముగ్గులో పూలు కోస్తుంటే.. బంటు అడ్డుకొంటాడు. అయితే తన తల్లికి చెబుతాను అంటూ శౌర్య వార్నింగ్ ఇస్తుంది.
పూలు కోయడంలో గొడవ జరిగితే బంటును తిట్టి పారిజాతం అక్కడి నుంచి పంపిస్తుంది.
పుట్టిన రోజున పారిజాతం కాళ్లకు నమస్కరించి జ్యోత్స ఆశీర్వాదం తీసుకొంటుంది. అయితే పక్కనే ఉన్న కార్తీక్ చేతిలో రోజ్ పువ్వను పెడుతుంది. కాళ్లకు మొక్కి లేసిన తర్వాత చూస్తే కార్తీక్ చేతిలో రోజ్ ఉండటం చేసి హ్యాపీగా ఫీలవుతుంది. దాంతో కార్తీక్ కోపంగా పారిజాతాన్ని చూస్తాడు. జ్యోత్స పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు దీప పుట్టిన రజోు కావడంతో దీప చేత కేక్ కట్ చేస్తుంది. ఇదిలా ఉండగా, నర్సింహ చేసిన అప్పులు తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తామని ఊరి పెద్ద బెదిరిస్తాడు.


Click it and Unblock the Notifications











