Karthika Deepam season 2 Weekly Roundup మద్యం మత్తులో జ్యోత్స్న యాక్సిడెంట్.. అరెస్ట్ చేయించిన దీప

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మరోసారి ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు. ఈ సీరియల్‌లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 22వ ఎపిసోడ్‌లో
సుమిత్రపై దాడి చేసిన నేరస్థుడు బంటుతో మాట్లాడాన్ని దీప చూస్తుంది. వెంటనే పరుగున వచ్చి నీపై దాడి చేసిన వ్యక్తిని చూశాను. అతడు బంటుతో మాట్లాడుతున్నాడు. దాంతో పారిజాతం కంగారు పడిపోతుంది. వాడితో ఎందుకు ఉన్నావు. నువ్వు ఇచ్చే షాకులతోనే పోతానేమో అని పారిజాతం అరుస్తుంది. వాడు పేమెంట్ కోసం వచ్చాడు అంటాడు బంటు. వాడికి ఇచ్చేసాం కదా అంటుంది పారిజాతం. మీరు నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని సగం నేను వాడేసాను అంటాడు బంటు. వాడిపై కోప్పడి ఇప్పుడే డబ్బులు ఇస్తాను వాడిని ఒక రెండు నెలల పాటు ఊర్లో ఉండొద్దని చెప్పు అని పారిజాతం అంటుంది.

Karthika Deepam season 2

ఏప్రిల్ 23వ ఎపిసోడ్‌లో
సుమిత్ర ఇంటిలో దీప ఉండటం చూసి నర్సింహ ఆగ్రహం చెందుతాడు. నా బ్రతుకుని బజారున పడేసింది చాలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని దీప అంటుంది. నేను వెళ్ళటం కాదు నువ్వే ఈ ఊరు నుంచి వెళ్ళు అని నర్సింహ అంటాడు. అయితే నిన్ను బస్సు ఎక్కిస్తాను అంటూ ఆమె చేయి పట్టుకుంటాడు నర్సింహ. తన చెయ్యి పట్టుకుంటున్నావు ఎవడ్రా నువ్వు అంటూ అతని చెంప పగలగొడుతుంది సుమిత్ర. దానికి తాళి కట్టిన భర్తని అంటాడు నర్సింహ. నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుమిత్ర.

ఏప్రిల్ 24వ ఎపిసోడ్‌లో
దీప వ్యక్తిగత జీవితం, భర్త గురించి సుమిత్ర అడిగి తెలుసుకొంటుంది. ఆమె వ్యధ విన్న తర్వాత నీ కష్టాన్ని చెప్పుకోలేని ఆత్మభిమానం ఎందుకు అని సుమిత్ర మనసులో అనుకొంటుంది. అయితే జ్యోత్సతో పెళ్లిపై కార్తీక్ తేల్చి పడేశాడు. జ్యోత్స అంటే నాకు ఇష్టమే కాని.. పెళ్లి చేసుకొనేంత కాదు అని చెబుతాడు. దీపకు వంట మనిషి ఉద్యోగం ఇప్పించి ఇక్కడే ఉంచుకోవాలనే ప్రయత్నం సుమిత్ర చేస్తుంది. కార్తీక్ కట్టే రెస్టారెంట్‌లో ఉద్యోగం ఇవ్వమని సూచిస్తుంది. అయితే తనకు అవసరం లేదని దీప ఒప్పుకోదు. దాంతో ఆమెను ఇబ్బంది పెట్టవద్దని కార్తీక్ అంటాడు. ఇక నరసింహ వచ్చి దీపతో గొడవపడుతాడు. దీపతో మిస్ బిహేవ్ చేస్తే నరసింహ చెంపను సుమిత్ర పగలగొడుతుంది. దాంతో నేను తాళి కట్టిన భర్తను అని నరసింహ అంటాడు.

ఏప్రిల్ 25వ ఎపిసోడ్‌లో
సుమిత్ర ఇంటి నుంచి వెళ్లిపోవాలని దీప డిసైడ్ అవుతుంది. రెండు రోజుల్లో వస్తానని చెప్పాను ఐదు రోజులు అయిపోయింది అత్త ఎలా ఉందో అని మనసులో దీప అనుకొంటుంది. ఆరు సంవత్సరాల నుంచి కొడుకు కనిపించకపోతేనే బెంగపెట్టుకోలేదు ఇక నా మీద ఏం బెంగపెట్టుకుంటుంది, డబ్బులు లేకుండా ఊరికి వెళ్లడం కంటే డబ్బు సంపాదించి ఊరికి వెళ్లి అప్పులు తీర్చటమే మంచిది అని దీప అనుకుంటుంది .

Karthika Deepam season 2

ఏప్రిల్ 26వ ఎపిసోడ్‌లో
దీపను పారిజాతం అవహేళన, అవమానించే విధంగా పారిజాతం ప్లాన్ చేస్తుంటుంది. దీప ఇక్కడే ఉంటే నా ప్లాన్ పసిగట్టేస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని అనుకొంటుంది. ఇదిలా ఉండగా, తన కోడలిని వెతికేందుకు ఊరు నుంచి అనసూయ పట్నానికి బయలు దేరుతుంది. మల్లేష్ వద్ద డబ్బు అప్పుగా తీసుకొని నగరానికి వస్తుంది. ఐతే తన అత్త గారిని గురించి దీప ఆలోచిస్తూ.. రెండు రోజుల్లో వస్తానని చెప్పాను. ఇప్పటికే ఐదు రోజులు అయిపోయాయనే ఆలోచనల్లో పడిపోతుంది.

ఏప్రిల్ 27వ ఎపిసోడ్‌లో

బర్త్ డే సందర్బంగా నీవంటే ఇష్టం కానీ.. పెళ్లి చేసుకొనేంత ఇష్టం లేదని కార్తీక్ అనడంతో జోత్స్న షాక్ గురి అవుతుంది. దాంతో మద్యం విపరీతంగా సేవిస్తుంది. మద్యం సేవించి కారు డ్రైవ్ చేసుకొంటూ ఇంటికి వచ్చి.. తూలి పడిపోతుంటే. దీప పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెడుతుంది. అయితే ఉదయమే ఇంటికి పోలీసులు వచ్చి.. ఆ కారు ఎవరిదని ప్రశ్నిస్తారు. రాత్రి కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు. అయితే జ్యోత్స్న కారు డ్రైవ్ చేసిందని దీప చెప్పడంతో.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే నిజం చెప్పినందుకు దీపను పారిజాతం మందలిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X