Karthika Deepam Weekly Roundup అభినవ వీరేశలింగం.. కార్తీక్‌పై తండ్రి సెటైర్లు.. దీపకు అండగా సుమిత్ర
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. దీప, సుమిత్ర మధ్య ఎపిసోడ్స్, పారిజాతం, బంటూ కుట్రలు నేపథ్యంగా ఎపిసోడ్స్ జరిగాయి. ఈ సీరియల్‌లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్
మద్యం తాగి కారు డ్రైవ్ చూస్తే యాక్సిడెంట్‌కు గురి చేయడంతో జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత లాయర్ బెయిల్ ఇవ్వటంతో జోత్స్న ని తీసుకొని కార్తీక్ అక్కడినుంచి బయలుదేరుతాడు. మరోవైపు కార్తీక్ జోత్స్న తో మాట్లాడుతూ అంత ఓవర్ గా డ్రింక్ చేసినప్పుడు డ్రైవ్ చేయడం ఎందుకు నాకు కాల్ చేయొచ్చు కదా అంటాడు. కాల్ వచ్చింది అనే కదా నువ్వు వెళ్ళిపోయావు అని కోపంగా అంటుంది జోత్స్న. వెళ్తే మళ్ళీ రాననుకున్నావా అంటాడు కార్తీక్.

దీప కోసం వెతకడానికి వచ్చిన అనసూయ కంగారు పడిపోతుంది. మరోవైపు దీప, శౌర్య దొరకక పోవడంతో కంగారు పడుతారు. ఊర్లో ఉన్న హోటల్స్ అన్ని వెతికాను.ఇక రేపు ఒక్కరోజు వెతుకుతాను దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాను అనుకొని ఫుట్ పాత్ మీద పడుకుంటుంది అనసూయ.
ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్
జ్యోత్స్న మద్యం సేవించి కారు డ్రైవ్ చేసి అరెస్ట్ అయిన విషయంలో ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. ఆ విషయంలో కార్తీక్‌ను పారిజాతం బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది.నీవు తన జీవితంలో లేరని తెలిస్తే..విషం మిగిస్తుంది అని పారిజాతం అంటుంది. అయితే నేను ఏం చేయాలని కార్తీక్ అడుగుతాడు.
కార్తీక్‌ను తల్లిదండ్రులు ఇద్దరు కార్తీక్ తో నువ్వు కోడలి దగ్గర కాసేపు ఉండవలసింది అంటారు. తను ఒంటరిగా ఉంటేనే తను చేసిన తప్పేంటో తనకి తెలుస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీడు జరిగిన దానికి ఏం బాధపడుతున్నాడా కోప్పడుతున్నాడా అంటుంది, మన కోడలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అంటుంది. ఇంకా ప్రమాదం నుంచి బయట పడలేదు యాక్సిడెంట్ అయిన మనిషి కోలుకుంటే పర్వాలేదు చనిపోతే మాత్రం పెద్ద ప్రమాదమే అంటాడు కార్తీక్ తండ్రి.

మే 1వ తేదీ ఎపిసోడ్‌లో
మిస్ హైదరాబాద్ జ్యోత్స్స మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడమే కాకుండా యాక్సిడెంట్‌కు గురి చేసిందనే వార్త అందర్ని షాక్ గురించి చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అన్ ఫాలో అవుతున్నారని ఇంట్లో వారిపై కేకలు వేస్తుంది. అరెస్ట్ వార్త నా ప్రతిష్టను దిగజార్చింది. నన్ను ఒంటరిగా వదిలేయండి చెబుతుంది.
దీపను ఇంటి నుంచి పంపించేందుకు పారిజాతం, బంటూ తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆమె బ్యాగ్ కూడా బయటకు విసిరి కొట్టాను. ఇంకా ఏం చేయమంటావు అని ప్రశ్నిస్తుంది. అయితే ప్రతీ ఒక్కరికి ఓ బలహీనత ఉంటుంది. ఆమెకు ఇప్పుడు డబ్బు అవసరం..కాబట్టి దాని ఆశ చూపించు అంటూ పారిజాతానికి బంటూ ఆశ చూపిస్తాడు.
మే 2వ తేదీ ఎపిసోడ్‌లో
సుమిత్ర గారు నిజంగానే నీ మీద కోప్పడుతున్నారా లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోమని చెప్పి అందరి ముందు నిన్ను తిడుతున్నారా అని దీపని అడుగుతాడు సీఐ. అలా అంటున్నారు ఏంటి అంటాడు కార్తీక్. ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతున్నా దీప ఏమి మాట్లాడటం లేదంటే దీని వెనక ఏదో కారణం ఉంది, నువ్వు వెళ్ళిపోవటం వెనుక ఏదైనా కారణం ఉందా అని దీప ని అడుగుతాడు సీఐ. నిజం చెప్పేస్తుందేమో అని కంగారుపడుతుంది పారిజాతం. అలాంటిదేమీ లేదు అని చెప్తుంది దీప.

సీఐ చూపించిన అనుమానితుడు సుమిత్ర ని కొట్టిన వాడు కాదు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ కేసు ఏ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు ఆఫీసర్స్ మాత్రం మారుతున్నారు అంటాడు. నా సిన్సియారిటీ నే అనుమానిస్తున్నారు కదా వారం రోజుల్లోగా ఆ వ్యక్తిని తెచ్చి మీ ముందు నిలబెడతాను అప్పటివరకు దీప బాధ్యత మీదే అని చెప్తాడు సిఐ.
మే 3వ తేదీ ఎపిసోడ్‌లో
దీప జీవితం గురించి పట్టి పట్టిన అడిగినా చెప్పకపోవడంతో అనసూయ ఫైర్ అవుతుంది. నేనేమైనా పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నావు. శౌర్య కూడా ఎక్కడ లేదు ఇప్పుడు నిజం చెప్పు అంటుంది అనసూయ. జరిగిందంతా చెప్తుంది దీప. వాడు రెండో పెళ్లి చేసుకుంటే నువ్వెలా ఊరుకున్నావు అంటుంది అనసూయ. నిలదీశాను కానీ ఇప్పుడు అతనికి తల్లి, పెళ్ళాం, కూతురు ఎవరు అక్కర్లేదు. అతని దారి అతను చూసుకున్నాడు. అక్కడ నుంచి వస్తుంటేనే సుమిత్ర గారు కలిశారు. అక్కడినుంచి జరిగిందంతా మీకు తెలుసు అంటుంది.
ఇంటి నుంచి వెళ్లిపోయిన దీపను, శౌర్యను వెనక్కి తీసుకు రావడంతో.. కార్తీక్‌ను వీరేశలింగం గారు అని పిలుస్తాడు అతని తండ్రి. ఎందుకు అలా పిలుస్తున్నారు అంటాడు కార్తీక్. మీరు ఊరు వెళ్ళిపోతున్న ఆడవాళ్ళని ఆపుతున్నారంట కదా, వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారంట కదా అంటాడు కార్తీక్ తండ్రి. పారు ఫోన్ చేసిందా అంటాడు కార్తీక్. ఎవరు ఫోన్ చేస్తే ఏముంది నీ పనులతోనే నువ్వు బిజీగా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు అవసరమా అంటుంది కాంచన.
మే 4వ తేదీ ఎపిసోడ్‌లో
దీపపై కోపం పెంచుకొన్న నర్సింహా ఆమె భరతం పట్టాలని అనుకొని వస్తుంటే.. తన తల్లి అనసూయ కనిపించడంతో షాక్ తింటాడు. తల్లిని చూసి భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని దాక్కొంటాడు. అయితే తల్లి అతడిని పట్టుకోని నిలదీయడంతోపాటు చేయి చేసుకొంటుంది. ఇక నర్సింహా రెండో భార్యను చూసి.. పెళ్లైన మగవాడిని పెళ్లి చేసుకోవడం సిగ్గు అనిపించలేదా? అంటూ నిలదీస్తుంది. అయితే నాకు ఎవరు లేరు? తల్లి, భార్య చనిపోయారని అబద్దం చెప్పారని శోభ అసలు విషయం బయటపెడుతుంది.


Click it and Unblock the Notifications











