Karthika Deepam season 2 Weekly Roundup కార్తీక్ నిన్ను జీవితంలో క్షమించను: దీప.. సుమిత్ర ఎత్తులకు పారిజాతం పై
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీరియల్‌కు తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ వారంలో సుమిత్రను దాడి నుంచి రక్షించిన దీప తలకు గాయం అవుతుంది. దాంతో హాస్పిటల్‌లో చికిత్స చేయించి తమ ఇంటికి తీసుకొస్తారు. అయితే సుమిత్ర ఇంటిలో దీప, శౌర్యకు ఎదురైన సంఘటనలు, సన్నివేశాలకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్‌లో:సుమిత్రను గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేయడంతో వారి నుంచి దీప కాపాడుతుంది. అయితే ఆ దాడిలో తలకు జరిగిన దాడి తర్వాత శౌర్య, దీపను సుమిత్ర ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ కార్తీక్‌ను చూసిన దీప షాక్ తింటుంది. కార్తీక్‌ను చూసి ఈ అంకుల్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు అంటూ శౌర్య అంటుంది. అయితే తన భర్త గురించి దీప చెప్పడానికి నిరాకరించడంతో సుమిత్ర పెద్దగా ఒత్తిడి చేయదు. దాంతో నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నానని గుర్తుంచుకో అని సుమిత్ర చెబుతుంది.

ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్‌లో:గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడి నుంచి సుమిత్రను దీప కాపాడుతుంది. ఆ దాడిలో దీప గాయపడటంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీస్తారు. అయితే తాను ఈ ఇంటిలో ఉండలేను అంటూ దీప చెప్పడంతో.. ఔట్ హౌస్‌లో ఉండమని చెబుతారు. అయితే దీప వెళ్లిపోతే బాగుండు అని పారిజాతం మనసులో అనుకొంటుంది. ఎటాక్ చేసిన వారిని గుర్తు పడుతారా? అంటే.. చూస్తే గుర్తు పడుతానని దీప చెప్పడంతో పారిజాతం గుండెల్లో రాయిపడినంత అవుతుంది. అయితే పోలీసులు తీసుకొచ్చిన వారిలో దాడి చేసిన వారు లేకపోవడంతో వారు కాదని దీప చెబుతుంది.
ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్‌లో:దీప ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పినప్పుడు సుమిత్ర బాధపడుతుంది. దాడి నుంచి రక్షించే క్రమంలో అమ్మా అన్నప్పుడు నా కడుపులో తల్లి పేగు కదిలింది. నీవు వెళ్లాలని అనుకొంటే.. చెప్పి వెళ్లండి. నీ రాక కోసం ఈ తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయి. ఆ విషయం గుర్తుంచుకో అని సుమిత్ర చెబుతుంది. ఇంటి నుంచి వెళ్లిపోతుంటే.. శివనారాయణ వచ్చి ఆపుతాడు. అభ్యంతరం చెప్పి ఉగాది పండుగ తర్వాత వెళ్లు అని సూచిస్తాడు.
ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్‌లో:ఉగాది పండుగ కోసం బట్టలు కొనడానికి దీప, శౌర్య వెళ్తారు. వారి వెనుక కార్తీక్ కూడా వెళ్లి వారి చేత బట్టలు కొనిచ్చే ప్రయత్నం చేస్తాడు. బట్టల మీద 2000 రూపాయలు బిల్లు ఉంటే.. ఇక్కడ 90 శాతం డిస్కౌంట్ ఉంటుందని యజమాని చేత కార్తీక్ చెప్పిస్తాడు. అలా వారి చేత మంచి బట్టలు తక్కువ ధరకే కొనిపించేలా చేసి.. కార్తీక, బట్టల దుకాణం యజమాని ఆనందపడిపోతారు.

ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్:సుమిత్రపై దాడి చేయించింది తానేనని ఎక్కడ బయపడిపోతుందనే భయంతో దీపను సూటిపోటి మాటలతో వేధిస్తుంది. ఉగాది పండుగ కోసం దీప, శౌర్య కోసం సుమిత్ర కొత్త బట్టలు కొంటుంది. దాంతో మేము బట్టలు కొన్నామని చెబుతారు. అయితే మీ కోసం స్పెషల్‌గా కొన్న బట్టలు.. వీటిని ధరించండి అని చెబుతుంది. సుమిత్ర కుటుంబ సభ్యుల మధ్య ఉగాది పండుగను దీప, శౌర్య ఆనందంగా గడుపుతారు.
ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్‌లో :ఉగాది పండుగ సందర్బంగా చేసిన పచ్చడి తీసుకొని కార్తీక్ వద్దకు దీప వస్తుంది. అయితే నన్ను క్షమించావా? అని కార్తీక్ అంటే.. ఈ జన్మలో అది జరగదు అంటూ సమాధానం దీప ఇస్తుంది. ఇంతలో ఓ బంగారు గొలుసు దీపకు ఇచ్చేందుకు శివన్నారాయణ ప్రయత్నిస్తే.. దీప నిరాకరిస్తుంది. అయితే ఆ గోలుసును శౌర్య మెడలో వస్తాడు. ఆ తర్వాత అందరూ జాతకాలు చెప్పించుకొంటారు. అనంతరం గుడికి వెళ్లితే దీప, శౌర్యకు దోష నివారణ జరిపించండి అని శివన్నారాయణ చెబుతాడు.


Click it and Unblock the Notifications











