Karthika Deepam Weekly Roundup: అనసూయ కాళ్లు పట్టుకున్న దీప.. భర్త మీద పగతో రగిలిపోతున్న పారిజాతం!

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.

కోర్టులో విష్ణువర్ధన్ కార్తీక్ కి దీప కి అక్రమ సంబంధం ఉందని వాదిస్తాడు, అందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తాడు. కోర్టులో లాయర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్పృహ కోల్పోతుంది దీప. మరోవైపు మీ నాన్న నిన్ను తీసుకెళ్ళిపోతాడు అని జ్యోత్స్న అన్న మాటలకి షాక్ అవుతుంది శౌర్య. మరోవైపు భర్తతో తనకు విడాకులు కావాలని, అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప. మరోవైపు శౌర్య కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు, విషయం కార్తీక్ కి చెప్పటంతో అతను సుమిత్ర ఇంటికి వస్తాడు. కార్తీక్ గొంతు విని తన తండ్రి తను తీసుకెళ్లి పోతాడని జో చెప్పిందని అందుకే దాక్కున్నానని చెప్తుంది శౌర్య. అలాంటిదేమీ జరగదని ధైర్యం చెప్తాడు కార్తీక్. మరోవైపు కేసు గెలిచే సూచనలు కనిపించడంతో పాపని ఎలా పెంచాలో అప్పుడే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు శోభ దంపతులు. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి.

ఇక ఆగస్టు 12 వ తేదీ నుంచి ఆగస్టు 17 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup August 12 th to August 17th episode Story
ఆగస్టు 12 వ తేదీ 121 వ ఎపిసోడ్‌లో కోర్టులో శోభ తనకి నర్సింహ కి పెళ్లి జరగలేదని అబద్ధం చెప్తుంది. శోభ అబద్ధం చెప్తుందని, నిజం ఏమిటో మా అత్తయ్యని అడిగితే తెలుస్తుందని ఏడుస్తూ చెప్తుంది దీప. ఆమెని ప్రవేశపెట్టమంటాడు జడ్జి. మరోవైపు నర్సింహ కేసు గెలవాలని అందుకు ఎంత డబ్బైనా చెల్లిస్తానని విష్ణువర్ధన్ తో చెప్తుంది జ్యోత్స్న. మరోవైపు తల్లిని కోర్టుకు తీసుకురావడానికి ఇంటికి వెళ్లిన నర్సింహ జరిగిందంతా తల్లికి చెప్పి కోర్టులో అబద్ధం చెప్పమని తల్లికి తర్ఫీదు ఇస్తాడు. కోర్టుకు వచ్చిన అనసూయతో తనకి న్యాయం చేయమని కోర్టులో నిజం చెప్పమని వేడుకుంటుంది దీప. ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలుసని వెళ్ళిపోతుంది అనసూయ.

ఆగస్టు 13వ తేదీ 122 వ ఎపిసోడ్‌లో కోర్టులో సుమిత్ర వాంగ్మూలం అడుగుతుంది లాయర్ సుమిత్ర దీపకి అనుకూలంగా మాట్లాడుతుంది. తర్వాత అనసూయ వాంగ్మూలాన్ని కోరుతాడు లాయర్ అప్పుడు అందరి అంచనాలకి భిన్నంగా అనసూయ దీపకి అనుకూలంగా మాట్లాడుతుంది. అలాగే కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని ఊరు నిండా అప్పులు చేశాడని కూడా చెప్తుంది. దీప కి అనుకూలంగా తీర్పు వస్తుంది. పాప కె ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని జర్నీ చెప్పటంతో నేను తల్లి దగ్గరే ఉంటానని తండ్రిగా ఆ బూచాడ వద్దని చెప్తుంది శౌర్య. కూతుర్ని హత్తుకొని ఎమోషనల్ అవుతుంది దీప.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup August 12 th to August 17th episode Story

ఆగష్టు 14వ తేదీ 123 వ ఎపిసోడ్‌లో కూతుర్ని పట్టుకొని ఎమోషనల్ అవుతున్న దీప ని చూసి జడ్జి కూడా ఎమోషనల్ అవుతాడు. తన తల్లి తనని నిలువునా ముంచేసిందని కోపంతో రగిలిపోతాడు నర్సింహ. అనుకూలంగా తీర్పు చెప్పినందుకు అత్త కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెబుతుంది దీప. కొడుకు కోడలు నిన్ను ఇంట్లోకి రానివ్వరు నాతో పాటు వచ్చేయమని కూడా అడుగుతుంది కానీ అందుకు ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. ఇంక నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు అని దీపతో అంటుంది సుమిత్ర. మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత ఊర్లోకి ఎంట్రీ ఇస్తాడు పారిజాతం కొడుకు దాసు. తన కూతుర్ని చూడటానికి రానిస్తారో రానివ్వరు అనుకుంటాడు. మరోవైపు రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జోత్స్న పారిజాతం అదే హోటల్ కి దీపని, శౌర్యని తీసుకువస్తాడు కార్తీక్ అది చూసి మరింత కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. మరోవైపు పక్కకు వెళ్లి కన్నీరు పెట్టుకుంటున్న దీపతో భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది, చదువు విషయంలో నా సాయం కూడా ఉంటుంది అని ఆమెకి ధైర్యం చెప్పి తిరిగి తీసుకువస్తాడు కార్తీక్. తర్వాత శౌర్యకి కార్తీక్ జాగ్రత్తలు చెబుతూ ఉంటే ఇకమీదట నువ్వు రావా అని ప్రశ్నిస్తుంది శౌర్య.

ఆగస్ట్15 వ తేదీ 124వ ఎపిసోడ్‌లో మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎప్పటికీ విడిపోము అంటాడు కార్తీక్. సౌర్యకే సరిగ్గా తినటం రాకపోతే కార్తీక్ దగ్గరుండి తినిపిస్తాడు. ఇదంతా చూస్తున్నా కోపంతో రగిలిపోతూ ఆ సీన్ ని ఫోటో తీస్తుంది. తరువాత దీప, కార్తీక్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఇంటికి వచ్చిన నరసింహ దంపతులు అనసూయ పై కోపంతో రగిలిపోతూ ఉంటారు. అనసూయని ఇంట్లోకి రానివ్వకూడదు అని భర్తతో చెప్తున్నా శోభతో నేను నీకు అవకాశం ఇవ్వను నేనే వెళ్ళిపోతాను అంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనసూయ. మరోవైపు పారిజాతం టిఫిన్ ఆర్డర్ ఇచ్చి చేతులు కడుక్కోవడానికి వెళుతుంది అదే సమయంలో దాసు అక్కడికి వస్తాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన వలన దాసు చెంప పగలగొడుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం కోపంతో మనవరాల్ని తిట్టుకుంటుంది. నిజం చెప్పలేక నువ్వు నీకన్నా పెద్దవాడిని అయినా నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే మంచిది అని మనవరాలపై కోప్పడి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన జ్యోత్స్న హోటల్లో తీసిన ఫోటో తల్లికి చూపిస్తే ఆమె దీపనే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది,కూతురి మాటలకి అసహ్యించుకుని ఆమె చెంప పగలగొట్టాలనుకుంటుంది, కానీ దీపని చూసి ఆగిపోతుంది.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup August 12 th to August 17th episode Story
ఆగస్టు 16 వ తేదీ 125 ఎపిసోడ్ లో తల్లితో గొడవ పడుతున్న జ్యోత్స్న ని గొడవ పెద్దది చేయొద్దు అంటుంది పారిజాతం. అదలా తయారవ్వటానికి కారణం మీరే అని అత్తపై కోప్పడుతుంది సుమిత్ర. పారిజాతం వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత జ్యోత్స్న గురించి తప్పుగా అనుకోవద్దు అనే దీపకీ సర్ది చెప్తుంది సుమిత్ర మాటలు పడటం నాకు అలవాటైపోయింది జాతిని కూడా త్వరలోనే అయినా జ్యోత్స్న కూడా త్వరలోనే నన్ను అర్థం చేసుకుంటుంది అంటుంది దీప. మరోవైపు జ్యోత్స్న పంపించిన ఫోటో చూపించి కొడుకుతో గొడవ పడతాడు శ్రీధర్. మీరు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. పెళ్లి అయ్యేవరకు దీపకి కార్తీక్ ని దూరంగా ఉంచాలనుకుంటాడు శ్రీధర్. మరోవైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తాడు. వాళ్ళిద్దరూ కాసేపు రోడ్డు మీదే గొడవపడి తరువాత రెస్టారెంట్ కి వెళ్తారు. మరోవైపు తండ్రి ఫోటోకి దండం పెట్టుకుంటూ నాకు నీలాంటి ఒక సాయం కావాలి నాన్న అంటుంది దీప. అప్పుడే దాసు పారిజాతం ఇంటికి వస్తాడు. పారిజాతం పడుకుని చూసి ఎమోషనల్ అవుతుంది. కూతురు కోసం వచ్చాను అన్న కొడుకు మాటలకి షాక్ అవుతుంది.

ఆగస్టు 17 వ తేదీ 126వ ఎపిసోడ్ లో నీ కూతురు పురట్లోనే చనిపోయింది కదా అంటుంది పారిజాతం. లేదు ఇంట్లోనే ఉంది అంటూ లోపలికి వెళ్తాడు దాసు కొడుక్కి నిజం తెలుసేమో అని కంగారు పడుతుంది పారిజాతం కానీ అన్నయ్య తన కూతుర్ని నీ మనవరాలు అన్నాడు కదా అంటే నాకు కూడా కూతురు అవుతుంది కదా అని దాసు చెప్పడంతో పారిజాతానికి కంగారు తగ్గుతుంది.దాసు పేరు పెట్టి పిలవడంతో కిందికి వస్తుంది జ్యోత్స్న. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. దశరథ్ మాటలలో అతను పారిజాతం కొడుకుని తెలుసుకుంటుంది జ్యోత్స్న. శివ నారాయణ దాసుని అవమానించి బయటికి పంపించేస్తాడు. బయటికి వచ్చిన దాసు నా కూతురు నన్ను కొట్టింది అమ్మ, జాగ్రత్త అని తల్లి ఎన్ని ప్రశ్నలు వేసిన చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. కొడుక్కి చేసిన అవమానానికి శివ నారాయణ మీద పగతో రగిలిపోతుంది పారిజాతం. మరోవైపు స్వప్న ఎవరితోనో ప్రేమలో పడిందనే విషయం గ్రహించిన కాంచన ఆ విషయం భర్తకు చెప్పాలి అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X