Karthika Deepam Weekly Roundup: జ్యోత్స్న తో నిశ్చితార్థం అక్కర్లేదంటున్న కార్తీక్.. భార్యకి అడ్డంగా దొరికిపో
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.
కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పమని తల్లికి తర్ఫీదు ఇస్తాడు నర్సింహ. కానీ అనసూయ దీపకే అనుకూలంగా సాక్ష్యం ఇచ్చి ఆమెని కేసు గెలిపిస్తుంది. అనసూయ కోర్టులో అలా చెప్పినందుకు ఇంట్లోంచి గెంటేయాలి అనుకుంటుంది శోభ కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా తనే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనసూయ. మరోవైపు తన తండ్రి అని తెలియక దాసు చెంప పగలగొడుతుంది జ్యోత్స్న. పారిజాతం ఇంటికి వచ్చిన దాసు ని అవమానించి పంపిస్తాడు శివనారాయణ. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి.
ఇక ఆగస్టు 19 వ తేదీ నుంచి ఆగస్టు 24 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 20వ తేదీ 128 వ ఎపిసోడ్‌లో కూతురు మాటలని ఖండించి ఆమెని మందలిస్తుంది సుమిత్ర. ఎట్టి పరిస్థితులలోనే నావల్ల నీ పెళ్లి ఆగదు అని హామీ ఇస్తుంది దీప. మరోవైపు దీప ని హాస్పిటల్ కి తీసుకువెళ్తాను అన్న కొడుకు ప్రవర్తనని తప్పు పడతాడు శ్రీధర్. మరోవైపు రెస్టారెంట్లో కలుసుకున్న స్వప్న తన బాయ్ ఫ్రెండ్ కాశితో మాట్లాడుతూ మన పెళ్ళికి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పిన అన్నయ్య ఫుల్ సపోర్ట్ ఇస్తాడు అని కార్తీక్ గురించి చెప్తుంది. మరోవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వచ్చిన కార్తీక్ అతని నిశ్చితార్థం గురించి మాట్లాడుతుంది దీప. నేరుగా సుమిత్ర ఇంటికి వెళ్లిన కార్తీక్ ఇక జ్యోత్స్నతో నాకు నిశ్చితార్థం అవసరం లేదు అంటాడు.

ఆగష్టు 21వ తేదీ 129 వ ఎపిసోడ్‌లో కార్తీక్ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది సుమిత్ర నిజమే అత్త నిశ్చితార్థం నచ్చలేదు అందుకే పెళ్లి ముహూర్తం పెట్టేయండి అనటంతో అందరూ ఆనందిస్తారు.మరోవైపు కాశి ఇంటర్వ్యూ కి వెళ్తూ సప్నని ఎదురు రమ్మంటాడు. తనకి ఇష్టం లేకపోయినా కాశీ బలవంతం మీద ఎదురొస్తుంది స్వప్న. పారిజాతం, జ్యోత్స్న బయటికి వెళ్తున్న సమయంలో కాశి యాక్సిడెంట్ అయి పడి ఉంటాడు స్థానికులు అతడిని రక్షించమని జ్యోత్స్న ని అడిగితే కారు పాడైపోతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.అటుగా వచ్చిన దీప అతడిని రక్షించి హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంది. ఇదంతా వీడియో తీసి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడతాడు.
ఆగస్ట్22 వ తేదీ 130వ ఎపిసోడ్‌లో పేషంట్ గురించి ఎవరు ఏమి చెప్పటం లేదు ఏమిటి అని కార్తీక్ ని అడుగుతుంది దీప అతనికి బానే ఉంది వాళ్ళ తండ్రికి కూడా నేను ఇప్పుడే ఫోన్ చేశాను వస్తానన్నారు అంటాడు కార్తీక్ అప్పుడే వచ్చిన దాసు తన కొడుకుని కాపాడింది దీప అని తెలుసుకుని ఆమెకి థాంక్స్ చెప్తాడు. ఇప్పుడే ఒక నర్సు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని వాళ్ళకి చూపిస్తుంది. మరదలు చేసిన పనిని చూసి తిట్టుకుంటాడు కార్తీక్ దాసు కూడా ఆ వీడియో చూసి కూతురి ప్రవర్తనను అసహ్యించుకుంటాడు. మాటల్లో కాంచన కొడుకు కార్తీక్ అని గ్రహిస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ జ్యోత్స్న చేసిన ఘనకార్యం గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. దీప ని పొగుడుతూ తనని తిడుతున్న కార్తీక్ పై ఫైర్ అవుతుంది జ్యోత్స్న.

ఆగస్టు 23 వ తేదీ 131 ఎపిసోడ్ లో కార్తీక్ చెప్పింది విని ఇంట్లో వాళ్ళందరూ జ్యోత్స్న తో పాటు పారిజాతానికి కూడా చివాట్లు పెడతారు. తర్వాత పారిజాతం మనవరాలు తో మాట్లాడుతూ మీ బావకి ఎలాంటి అభిప్రాయం ఉందో చూసావు కదా కొంచెం ఆవేశం తగ్గించుకో మందలిస్తుంది. మరోవైపు కాశీని చూడటానికి వచ్చిన స్వప్న దీప కి తన ప్రేమ వ్యవహారం చెప్తుంది. అప్పుడే కార్తీక్ కూడా రావటంతో అతనికి కూడా ఈ విషయం చెప్పి తనకి సహాయం చేయమని వేడుకుంటుంది స్వప్న. కూతురి మాటల్లో స్వప్న ప్రేమించిన అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని గ్రహించి భర్తకి చెప్పాలనుకుంటుంది కావేరి. మరోవైపు బావ మనసులో నా మీద ఉన్న అభిప్రాయాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో నాకు తెలుసు అంటూ హాస్పిటల్ కి వెళ్తున్న జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది పారిజాతం. హాస్పిటల్ కి వెళ్లిన పారిజాతానికి యాక్సిడెంట్ అయింది తన మనవడికి అని దాసు ద్వారా తెలుసుకొని షాక్ అవుతుంది.
ఆగస్టు 24 వ తేదీ 131వ ఎపిసోడ్ లో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూడటానికి వచ్చిన జాబ్స్ న దీపతో గొడవ పెట్టుకుంటుంది అదే సమయానికి కార్తీక్ రావటంతో మాట మార్చేసి సాఫ్ట్ గా మాట్లాడుతుంది. మరోవైపు కాశి తన మనవడిని తెలిసి అతడిని చూడటానికి వెళ్తుంది పారిజాతం.అక్కడ పారిజాతం ఎమోషనల్ అవ్వడాన్ని గమనించిన కార్తీక్ ఆమెని అనుమానిస్తాడు. మరోవైపు కారులో కూర్చున్న జోత్స్న కాశీని అనామకుడు అనడంతో ఆమెపై కోప్పడుతుంది పారిజాతం. మరోవైపు కూతురు గురించి చెప్పాలనుకుని శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది కావేరి. ఫోన్ కాంచన ఎత్తటంతో కంగారుతో ఫోన్ పెట్టేస్తుంది అదే విషయం భర్తని నిలదీయడంతో అతను భార్యకి ఏవేవో చెప్పి మభ్యపెడతాడు బయటికి ఒప్పుకున్న లోపల మాత్రం భర్త మీద అనుమానం మొదలవుతుంది కాంచనకి. మరోవైపు కూతురిని తీసుకురావడానికి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది దీప. ఆమె మనసు నచ్చుకునేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. కూతురి ప్రవర్తనకి విసిగిపోయి, ఆమెకి చివాట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. తరువాత సోషల్ మీడియాలో ఇప్పుడు నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు నాకెందుకో ఎవరి దృష్టిలోనూ మంచి అనిపించుకోవడానికి నువ్వే ఆ వీడియో తీయించామనిపిస్తుంది అని దీపతో అంటుంది జోత్స్న. ఆ మాటలకి షాక్ అవుతుంది దీప. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











