Karthika Deepam Weekly Roundup: కోడలి చెంతకు చేరిన అనసూయ.. కూతురికి సూపర్ షాక్ ఇచ్చిన శ్రీధర్!
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.
దాసు తనకి బాబాయి అవుతాడని తెలుసుకొని అతడిని దూరంగా ఉంచమని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. మరోవైపు దీప కి కొత్త జీవితం ప్రారంభించడానికి అవసరమైన సాయం చేస్తామని మాట ఇస్తారు దశరథ్ దంపతులు. తన వల్ల పెళ్లి ఆగదని జ్యోత్స్న కి మాట ఇస్తుంది దీప. మరోవైపు కార్తీక నిశ్చితార్థం అవసరం లేదని డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలు పెట్టమని చెప్పడంతో అందరూ ఆనందిస్తారు. మరోవైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ కాశీకి యాక్సిడెంట్ అవుతుంది అని రక్షించమని స్థానికులు అడిగితే కారు పాడుతుందని హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడే అటుగా వచ్చిన దీప అతనికి సాయం చేస్తుంది. జరిగిందంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో కార్తీక్ వాళ్ళందరూ చూస్తారు. తర్వాత ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే జ్యోత్స్నని అందరూ మందలిస్తారు. పారిజాతం కూడా ఇలా అయితే మీ బావ కి నీ మీద మంచి అభిప్రాయం పోతుంది అని చెప్పటంతో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూడటానికి హాస్పిటల్ కి వెళుతుంది ఆమెతో పాటు వచ్చిన పారిజాతానికి యాక్సిడెంట్ అయింది కొడుకు దాసు కొడుకు అయినా కాశీకి అని తెలుసుకొని షాక్ అవుతుంది. మరోవైపు కూతురు ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కావేరి శ్రీధర్ కి చెప్పాలనుకుంటుంది ఆ ఫోన్ కాంచన ఎత్తుతుంది. వెంటనే కావేరి ఫోన్ పెట్టేయడంతో భర్త మీద అనుమానం మొదలవుతుంది కాంచనకి. మరోవైపు ఎవరి దృష్టిలోనూ మంచి దానివి అనిపించుకోవడం కోసం నువ్వే ఆ వీడియో తీయించామనిపిస్తుంది అని దీపతో అంటుంది జ్యోత్స్న. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి.

ఇక ఆగస్టు 26 వ తేదీ నుంచి ఆగస్టు 31 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
ఆగస్టు 26 వ తేదీ 132 వ ఎపిసోడ్‌లో మన మాట తీరును బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఎదుటి వాళ్ళ మనసుని అభిమానంతో గెలుచుకోవాలి కానీ అహంకారంతో కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. స్వప్న ఫోన్ చూసి ఆమె ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్ చేసుకుంటుంది కావేరి. తండ్రితో చెప్తాను అన్న తల్లి కాళ్లు పట్టుకొని అప్పుడే చెప్పొద్దు అంటూ కాశీ డీటెయిల్స్ అన్ని చెప్తుంది స్వప్న. తన జీవితంలో కూతురు జీవితం కాకూడదని కాశీ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటుంది కావేరి. వైపు కార్తీక్ కి ఫోన్ చేసిన సౌర్యతో ఆయనని అస్తమానం విసిగించొద్దు అని చెప్తుంది దీప ఆ మాటలు ఫోన్లో ఆలకించిన కార్తీక్ తనని శౌర్య ని విడదీయొద్దని చెప్తాడు. మరోవైపు భర్త కి వచ్చిన ఫోన్ గురించి కొడుక్కి చెప్పి తన అనుమానం వ్యక్తం చేస్తుంది కాంచన. విషయం గ్రహించిన కార్తీక్ టాపిక్ మార్చేసి తల్లికి అనుమానం
రాకుండా చేస్తాడు. అలాగే కబోర్డ్ లో ఉన్న చైన్ గురించి కార్తీక్ ని అడిగితే చిన్నప్పటి కోనేటి కథ చెప్పి ఈ చైన్ ఆ అమ్మాయి దే అంటాడు.
ఆగస్టు 27వ తేదీ 133 వ ఎపిసోడ్‌లో చైన్ ఎందుకు దాచుకున్నావు అని అడిగిన కాంచనతో ఎప్పటికైనా ఆమె రుణం తీర్చుకోవాలి అని చెప్తాడు కార్తీక్. మరోవైపు మట్టి మోస్తూ కనిపించిన అనసూయని తనతో పాటు వచ్చేయమంటుంది దీప. ముందు రానని చెప్పినా తర్వాత దీప మాటలకి కరిగిపోయి వస్తాను అంటుంది. మరోవైపు కోర్టుల కోసం ఖర్చుపెట్టిన సొమ్ము మొత్తం తిరిగి ఇవ్వమని, అంతవరకు కారు ఇవ్వనని భర్త దగ్గర నుంచి కారు తాళాలు లాక్కుంటుంది శోభ. ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి డబ్బు నీ చేతిలో పెడతాను అని బయటికి వెళ్లిపోతాడు నర్సింహ. మరోవైపు స్వప్న ని కలిసిన కార్తీక్ ముందు జీవితంలో స్థిరపడమని సలహా ఇస్తాడు, అవసరమైన సాయం కూడా చేస్తాను అంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన అనసూయని సుమిత్ర పర్మిషన్ తో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది దీప. నేను తన కష్టం తినడానికి రాలేదు తన కష్టంలో తోడుగా ఉండటానికి వచ్చాను అని సుమిత్రతో చెప్తుంది అనసూయ. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. తర్వాత శౌర్య కి వేయవలసిన టాబ్లెట్స్ అయిపోవడంతో కవర్ ఇవ్వు నేను వెళ్లి తీసుకు వస్తాను అని అనసూయ టాబ్లెట్ కవర్ తీసుకొని బయటికి వెళుతుంది. అత్తలో వచ్చిన మార్పు కి ఆనందపడుతుంది దీప.

ఆగష్టు 28వ తేదీ 134 వ ఎపిసోడ్‌లో మందులు షాపు వాడి ద్వారా శౌర్య ఆరోగ్యం గురించి తెలుసుకొని బాధపడుతుంది అనసూయ. దారిలో నరసింహ ఎదురుపడి ఇల్లు అమ్మేద్దాము నీకు కొంత డబ్బు ఇస్తాను అంటాడు. అనసూయ కుదరదంటే శౌర్యని కిడ్నాప్ చేస్తానంటాడు నర్సింహ. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అతనికి నాలుగు తగిలించి అక్కడ నుంచి పంపించేస్తాడు తర్వాత శౌర్య ఆరోగ్యం గురించి అనసూయకు తెలిసిందని తెలుసుకొని దీపతో చెప్పవద్దని చెప్తాడు. మరోవైపు స్వప్న కాశీతో తిరగడం అనుకోకుండా కారులోంచి చూసి విషయం గ్రహిస్తాడు శ్రీధర్. మరోవైపు కార్తీక్ దీప మీద సౌర్య మీద చూపిస్తున్న అభిమానానికి చాలా ఆనందపడుతుంది అనసూయ. ఇల్లు దీప పేరు మీద రాసేయమని కార్తీక్ చెప్పడంతో రేపే ఆ పని చేస్తాను అంటుంది. ఇదంతా దూరం నుంచి చూసిన సుమిత్ర అనసూయ కి మంచి సలహా ఇచ్చావు అని చెప్పి రేపు రాఖీ పండక్కి తొందరగా వచ్చేయండి అని చెప్తుంది.
ఆగస్ట్29 వ తేదీ 135వ ఎపిసోడ్‌లో దాసు దగ్గరికి వెళ్లిన పారిజాతం రాఖీ పండక్కి కాశీని ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత కొడుకుని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు దాసు. మరోవైపు డబ్బాలో డబ్బు ఏమిటి అని అడిగిన అనసూయతో జరిగిందంతా చెప్పి ఆ డబ్బు కార్తీక్ బాబుకి అప్పు తీర్చాలి అంటుంది. కోడలి నిజాయితీకి ఆనందపడుతుంది అనసూయ.మరోవైపు కాశీ ఇంటికి రావడానికి బలవంతంగా భర్తని ఒప్పిస్తుంది పారిజాతం. మరోవైపు ఇంటిని దీప పేరు మీద రాయటానికి ఊరికి బయలుదేరుతారు దీప అనసూయ అప్పుడే ఎదురైన కాశి వాళ్లని చూసి ఆశ్చర్యపోయిన దీప దాసు పారిజాతం కొడుకుని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోతుంది. దీప చేత రాఖీ కట్టించుకుని ఆమెకి డబ్బులు ఇవ్వాలనుకుంటాడు కాశి అక్క అని పిలిచావు అదే విలువైన బహుమతి అంటూ డబ్బులు తీసుకోదు దీప. కాశీ, స్వప్న ల ప్రేమ వ్యవహారం తలచుకొని కార్తీక్ బాబు సమస్యల్లో పడ్డారు అనుకుంటుంది దీప.
ఆగస్టు 30 వ తేదీ 136 ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన కాశీకి ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది పారిజాతం. కాశీకి రాఖీ కట్టాల్సి వచ్చినందుకు తనని తానే తిట్టుకుంటుంది జ్యోత్స్న. తర్వాత కి దాసు కాశీ చుట్టాలవుతారని తెలిసి షాక్ అవుతాడు. మరోవైపు కాశీకి దీప రాఖీ కట్టిందని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న.ఆ తరువాత రాఖీ కట్టినందుకు కాశీ డబ్బులు ఇవ్వబోతే అతడిని అవమానించేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. రాఖీ కట్టిన తర్వాత దాసుకు కూడా రాఖీ కడుతుంది కాంచన. అందుకు ఆనందపడిన దాసు నా కూతురికి ఈ మంచితనం రాలేదు అనుకుంటాడు. రేపు ఇల్లు దీప పేరున రాసి ఒకప్పుడు దీప దగ్గర రాకుండా డబ్బుని కూడా ఆమెకి ఇచ్చేస్తుంది అనసూయ. డబ్బు ఎక్కడిది అన్న దీప కి ఆ డబ్బు నీదే అని చెప్పి పాప భవిష్యత్తు కోసం ఉంచు అని చెప్తుంది అనసూయ. మరోవైపు తండ్రి తనకోసం పెళ్లి చూపులు అరేంజ్ చేశాడని తెలుసుకొని షాక్ అవుతుంది స్వప్న.

ఆగస్టు 31 వ తేదీ 137వ ఎపిసోడ్ లో తండ్రికి తన ప్రేమ వ్యవహారం తెలిసిందని గ్రహించిన స్వప్న పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడాలి అంటుంది శ్రీధర్ అంగీకరించడంతో విడిగా పెళ్ళికొడుకుతో మాట్లాడి తన ప్రేమ వ్యవహారం చెప్తుంది మీ నాన్నగారు నాకు అన్ని చెప్పారు అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అనడంతో షాక్ అవుతుంది స్వప్న. కాశీకి ఫోన్ చేస్తుంది కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటంతో టెన్షన్ పడుతుంది. మరోవైపు తనని పలకరించిన కాశీని మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగితే మామయ్య అని పిలు అంటాడు కాశీ. తర్వాత కార్తీక్ తో మాట్లాడుతూ అతడి మంచితనాన్ని మెచ్చుకుంటూ తన వైపు నుంచి కూడా పెళ్లి బాధ్యత కార్తీక్ మీదే పెడతాడు కాశీ. దాంతో మరింత టెన్షన్ ఫీల్ అవుతాడు కార్తీక్. వైపు సుమిత్ర తో మీరు మంచివారే కానీ మీ పెంపకం బాగోలేదు అని సుమిత్ర మొహం మీదే చెప్తాడు దాసు. మరోవైపు ఇంట్లో జరిగిన దాని గురించి కార్తీక్ కి చెప్పి నువ్వు పెళ్లి చేస్తానని మాట ఇస్తేనే బ్రతుకుతాను లేదంటే చచ్చిపోతాను అంటుంది స్వప్న. నీ ప్రాణం సంగతి నువ్వు చూసుకో నీ ప్రేమ సంగతి నేను చూసుకుంటాను అంటాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ ఫోన్ తో దీపకే ఫోన్ చేస్తుంది శౌర్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ కార్తిక్ కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడికి వచ్చిన జ్యోత్స్న తనతో సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదని ఇంకా ఏదో మాట్లాడుతుంది తనకి చిరాగ్గా ఉందని ఒంటరిగా వదిలేయమన్నా కార్తీక్ తో దీపతో అయితే ఇలాగే అంటావా అంటుంది అప్పుడే దీప ఫోన్ చేయడంతో తనతో మాట్లాడడానికి అయితే ఎలాంటి చిరాకు ఉండదు అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. దీపతో ఫోన్ మాట్లాడిన కార్తీక్ ఫోన్ పెట్టేసిన తర్వాత విషయం శౌర్యకి చెప్పి పదా బయటికి వెళ్దాం అని చెప్పి శౌర్య ని తీసుకొని బయటికి వెళ్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











