Karthika Deepam : కార్తీక్ కోసం ఇల్లు వదిలి వచ్చేసిన శౌర్య.. మళ్లీ పాత గూటికే చేరుకున్న తల్లీ కూతుర్లు!
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.
కొత్త ఇంటికి వెళ్లిన దీప ఇక్కడ ఏం బాబాయ్ అని కూడా తన ఇంటికి రావద్దు అని చెప్తుంది. కార్తీక్ కోసం కలవరిస్తున్న శౌర్య మాటలు విని హాస్పిటల్లో కార్తీక్ అన్న మాటలు వినేసిందేమో అని కంగారుపడుతుంది దీప. మరోవైపు దీప ఇల్లు వెతుకుతున్న కార్తీక్ ని ఫాలో అవుతారు జ్యోత్స్న, పారిజాతం. తనని ఫాలో వద్దని హెచ్చరిస్తాడు కార్తీక్. గుడిలో దీప కనిపించడంతో ఆమెని కార్తీక్ వాళ్ళ నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది సుమిత్ర. మరోవైపు కార్తీక్ అవుట్ హౌస్ లోకి వెళ్లి శౌర్య ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూలై 15వ తేదీ నుంచి జూలై 20 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 15వ తేదీ 97 వ ఎపిసోడ్‌లో తనకి పెళ్లి ఇష్టం లేదని తల్లితో చెప్పాలనుకుంటాడు కార్తీక్ కానీ తల్లి ఉత్సాహాన్ని చూసి చెప్పలేకపోతాడు. మరోవైపు కార్తీక్ నుంచి దూరంగా తీసుకువచ్చేసినందుకు తల్లిపై అలుగుతుంది శౌర్య. మరోవైపు మా చుట్టాలమ్మాయిని పెంచుకోవడానికి తెచ్చుకుంటాను అన్న శోభని కోప్పడి నా మనవరాలిని నేనే తెచ్చుకుంటాను అంటుంది అనసూయ.
జూలై 16వ తేదీ 98వ ఎపిసోడ్‌లో తన మనసులో మాట ఎవరికి చెప్పాలో అర్థం కాక బాధపడుతుంటాడు కార్తీక్. మరోవైపు ఇంటి ముందుకు వచ్చిన కారుని చూసి కార్తీక్ కారు అనుకుంటుంది శౌర్య. కార్తీక్ బాబు మనల్ని మర్చిపోయారు మన ఇంటికి రారు అని చెప్తుంది దీప. మరోవైపు తన మనసులో మాట సుమిత్రకి చెప్పటానికి బయలుదేరుతాడు కార్తీక్. ఇంట్లో అమ్మ లేదు అని జోత్స్నా చెప్పడంతో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు దీప ఇంట్లో లేని సమయంలో కార్తీక్ ని వెతుక్కుంటూ శౌర్య ఇంట్లోంచి వచ్చేస్తుంది. దారిలో నర్సింహా ఆమెని ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తే తప్పించుకుంటుంది.

జూలై 17 వ తేదీ 99 వ ఎపిసోడ్‌లో రోడ్డుమీద నడుస్తున్న శౌర్య కడియం బాబాయ్ కంట్లో పడుతుంది. ఎలాగైనా కార్తీక్ తో మాట్లాడాలని మొండికేయడంతో కార్తీక్ కి ఫోన్ చేస్తాడు బాబాయ్. మరోవైపు శౌర్య కనిపించకపోవటంతో రోడ్ల మీద పడి వెతుకుతుంది దీప. మరోవైపు అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు అన్న శౌర్యతో నిజం చెప్పాలనుకుంటాడు కార్తీక్ కానీ అప్పుడే బాబాయ్ ఫోన్ చేయడంతో కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అందుకు కోప్పడిన జ్యోత్స్న అతనిని ఫాలో అవుతుంది. సౌర్య దగ్గరికి వచ్చిన కార్తీక్ బాబాయ్ ద్వారా విషయం తెలుసుకుంటాడు. బాబాయ్ ని తీసుకొని దీప ఇంటికి వెళ్తాడు కార్తీక్. శౌర్య కి ధైర్యం చెప్పి ఆమెని నిద్రపుచ్చి బయటకు వచ్చేస్తాడు కార్తీక్.
జూలై 18 వ తేదీ 100వ ఎపిసోడ్‌లో దారిలో నర్సింహ కనిపించిన సంగతి దీపకీ చెప్తాడు కార్తీక్. మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అంటాడు. పాపని తీసుకువచ్చే అప్పగించినందుకు థాంక్స్ ఇంకా మీరు బయలుదేరండి మళ్లీ ఎప్పుడు రాకండి అని చెప్తుంది దీప. ఇదంతా దూరం నుంచి చూస్తున్న జ్యోత్స్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక ఫ్రస్టేట్ అవుతుంది. దారిలో కార్తీక్ కారు ఆపి నీకు దీప ఇల్లు తెలుసా అని అడుగుతుంది. తెలిస్తే పారు వాళ్ళు దీప ని ఇబ్బంది పెడతారని తెలియదు అని అబద్ధం చెప్తాడు కార్తీక్. దాంతో మరింత కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న.

జూలై 19 వ తేదీ 101 ఎపిసోడ్ లో కార్తీక్ కనిపించాడనే ఆనందంలో కడుపునిండా భోజనం చేస్తుంది శౌర్య. అర్ధరాత్రి నర్సింహ వచ్చి శౌర్యని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ హడావుడికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాగుబోతోడు వాడు అనుకొని నర్సింహా కొట్టి పంపించేస్తారు. జరిగిన గొడవకి బాగా భయపడిపోతుంది శౌర్య. అలా ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు నాన్నని వెతకటానికి కార్తీక్ హెల్ప్ తీసుకుందామా అని అడుగుతుంది శౌర్య. హాస్పిటల్లో కార్తీక్ అన్న మాటలు సౌర్య వినలేదని ఆనందపడుతుంది దీప. నా కూతుర్ని రక్షించుకోవాలి ఏం చేయటమా అని ఆలోచనలో పడుతుంది.
జూలై 20వ తేదీ 102వ ఎపిసోడ్ లో దీప ఇంటికి గాజులు తీసుకొని వెళ్ళిన కార్తీక్ కి దీప ఇల్లు ఖాళీ చేసేసింది అని తెలుసుకొని ఊరు వెళ్ళిపోయింది ఏమో అనుకుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన దీప, శౌర్య ని చూసి ఆనందపడుతుంది సుమిత్ర. దీప రావటం వెనుక మరేదో కారణం ఉంది అనుకుంటారు పారిజాతం, జ్యోత్స్న. కార్తీక్ వాళ్ళ నిశ్చితార్థం గురించి చెప్పి నువ్వే స్పెషల్స్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. తర్వాత కార్తీక్ గాజులు ఇచ్చేసి మాటల్లో ఈ నిశ్చితార్థం జరగదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తాడు.జ్యోత్స్న మీకోసమే బ్రతుకుతుంది ఈ పెళ్లి మీకు ఎందుకు ఇష్టం లేదు, మీరు ఈ పెళ్లి చేసుకోక పోతే నన్ను నా కూతుర్ని దోషిని చేస్తారు అని కార్తీక్ ని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది దీప. కార్తీక్ పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











