Karthika Deepam Weekly Roundup: శౌర్య కి నేనే తండ్రినంటూ షాకిచ్చిన కార్తీక్.. దీప ప్రయాణం ఎటువైపు?
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.
శ్రీధర్ గురించి దీప కాంచనకి చెప్పాలనుకుంటుంది కానీ కాంచన ఆరోగ్యం దృష్ట్యా చెప్పలేక పోతుంది. మరోవైపు బిడ్డ విషయం ఏం చేశావు రెండు రోజులు ఏదో ఒక నిర్ణయం తీసుకో లేదంటే నేనే ఏదో ఒకటి చేస్తాను అని దీపకి వార్నింగ్ ఇస్తాడు నర్సింహ. మరోవైపు స్వప్నకి సంబంధం చూడమని భర్తకి చెప్తుంది కావేరి. నేను పెళ్లి చేసుకుంటే అమ్మ ఒంటరి అయిపోతుంది అని తండ్రితో చెప్తుంది స్వప్న. మరోవైపు నరసింహ మాటలకి భయపడి వారం రోజులు స్కూలుకు వెళ్లొద్దు అని కూతురుతో చెప్తుంది దీప.
ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూలై 1వ తేదీ నుంచి జూలై 6 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 1వ తేదీ 85వ ఎపిసోడ్‌లో
తను పిలిస్తే స్కూల్ కి రాలేదని కార్తీక్ పై అలుకుతుంది శౌర్య. అందుకే నిన్ను రెస్టారెంట్ తీసుకెళ్తాను రెడీ అవ్వు అంటాడు కార్తీక్. దీపని కూడా రమ్మంటాడు. ముందు వద్దంటుంది కానీ తర్వాత కూతురు కోసం బయలుదేరుతుంది దీప. తర్వాత కార్తీక్ జాషువా దగ్గరికి వెళ్లి తనని కూడా రెస్టారెంట్ కి రమ్మంటాడు. మరోవైపు సప్న కార్తీక్ కి ఫోన్ చేసి అమ్మని తీసుకొని బయటికి వచ్చాను మంచి రెస్టారెంట్ ఉంటే చెప్పు అంటుంది.జ్యోత్స్న రెస్టారెంట్ కి వచ్చేయ్ నేను కూడా అక్కడే ఉంటాను అంటాడు కార్తీక్. మరోవైపు దీపని హోటల్ కి ఎందుకు తీసుకువచ్చాడా అని అనుకుంటాడు శ్రీధర్. అందరూ టేబుల్ దగ్గర కూర్చోగా దీప స్వప్న వాళ్ళని చూసి కంగారుపడుతుంది. శ్రీధర్ ని హెచ్చరిస్తుంది. స్వప్న వాళ్ళని చూసిన శ్రీధర్ టెన్షన్ పడతాడు.
జూలై 2వ తేదీ 86వ ఎపిసోడ్‌లో
స్వప్న వాళ్ళు రావటం గమనించి దాక్కుంటాడు శ్రీధర్. కార్తీక్ పెళ్లి గురించి మాట్లాడబోతుంటే మీ నాన్న లేరు కదా ఇప్పుడు ఎందుకు అంటుంది కాంచన. మరోవైపు స్వప్న వాళ్ళు కాంచన వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటారు. వీళ్ళు కూడా నాలాగా మోసపోయిన ఇద్దరు ఆడవాళ్లు అనుకుంటుంది దీప. తర్వాత శ్రీధర్ దగ్గరికి వచ్చి ఈరోజు రాకపోతే రేపైనా నిజం తెలియాల్సిందే సమయం చూసుకొని నిజం చెప్పండి అంటుంది. ఇదంతా జ్యోత్స్న చూస్తుంది బావకి నాతో పెళ్లి జరగడం దీపకి ఇష్టం లేదు అని అపార్థం చేసుకుంటుంది. జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది.

జూలై 3 వ తేదీ 87వ ఎపిసోడ్‌లో
జ్యోత్స్న చెప్పినదంతా విని నీకు, బావకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంగేజ్మెంట్ చేసేయాలి అంటుంది పారిజాతం. అంతకుముందే దీప ని ఇక్కడ నుంచి పంపించేయాలి అంటుంది జ్యోత్స్న. మరోవైపు హోటల్ లో జరిగిన దానికి బాధపడుతూ ఉంటుంది కాంచన. అది గమనించిన స్వప్న తల్లికి ధైర్యం చెప్తుంది తర్వాత ఒకసారి బాస్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు నరసింహ దీప ఇంటికి వచ్చి కూతురిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. అతడిపై తిరగబడి పాపని లాక్కుంటుంది దీప ఈ గొడవకి భయపడిన శౌర్య కళ్ళు తిరుగుబడిపోతుంది. పాపా కార్తీక్ ని కలవరిస్తుంటే డాక్టర్ సలహా మీద అతనికి ఫోన్ చేస్తుంది దీప. కార్తీక్ ని చూసిన సౌర్య నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.
జూలై 4 వ తేదీ 88వ ఎపిసోడ్‌లో
దీప ద్వారా నర్సింహా సంగతి తెలుసుకుని కోపంతో రగిలిపోతాడు కార్తీక్. దీపకీ ఆమె భర్తకి జరిగిన గొడవ చూస్తుంది జ్యోత్స్న. నాకు తెలిసి ఇప్పుడు పాపని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఉంటుంది బావ కూడా వెళ్లి ఉంటాడు అనుకొని అతనికి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా హాస్పిటల్ కి వెళుతుంది అప్పుడే నర్సింహ పాపని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆపడం కోసం ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ కాదు నా బిడ్డ అని చెప్పి షాకిస్తాడు కార్తీక్. ఆ మాటలు జ్యోత్స్న విని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నర్సింహ నువ్వు ఇలాంటి దానివనుకోలేదు నీ పని తర్వాత చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
జూలై 5 వ తేదీ 89 ఎపిసోడ్ లో
కార్తీక్ మాటలకి ఆవేశంతో ఊగిపోతుంది దీప నువ్వు నా బిడ్డకి తండ్రిగా అంటూ అతనిపై కేకలు వేస్తుంది. మీరన్న మాటలు నా జీవితంలోని నా కూతురు జీవితంలోని ఎలాంటి పరిణామాలు తీసుకువస్తాయా ఆలోచించారా అంటూ ఏడుస్తుంది అని వేడుకుంటుంది. నిజంగానే ఆ శౌర్య బావకి పుట్టిందా అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ మాటలని డైజెస్ట్ చేసుకోలేక ఫ్రస్టేట్ అవుతుంది. మరోవైపు బిడ్డ తండ్రి కార్తీక్ అట అని ఇంట్లో వాళ్లకి చెప్తాడు నర్సింహ. అతడే చెంప పగలగొట్టిన అనసూయ దీప ని వెనకేసుకొస్తుంది. బిడ్డని నీ నుంచి రక్షించడం కోసం అలా చెప్పి ఉంటారు అంటుంది. మరోవైపు పాపని చూసుకోమని నర్స్ కి చెప్పి ఇంటికి వెళుతుంది దీప.
జూలై 6వ తేదీ 90వ ఎపిసోడ్ లో
తన బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నా దీపని చూస్తుంది జ్యోత్స్న. నేను చేయాలనుకున్న పని తనే చేస్తుంది అని ఆనందపడుతుంది. మరోవైపు దీప సుమిత్ర ఇంటివైపు చూస్తూ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించండి అనుకుంటుంది.మరుసటి రోజు దీప ఇంట్లో లేకపోవడం గమనించి కంగారు పడతారు సుమిత్ర వాళ్ళు. జ్యోత్స్న ని అడిగితే తను రాత్రే వెళ్ళిపోయింది అంటుంది ఎందుకు ఆపలేదు అని అడుగుతుంది సుమిత్ర. ఎందుకు ఆపాలి తను మీరు అనుకున్నంత మంచిది కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. కార్తీక్ కి తెలుస్తుందేమో అని అతనికి ఫోన్ చేస్తాడు దశరథ్ కానీ కార్తీక్ కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు కంగారుగా హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పటికే దీప పాపకి హాస్పిటల్ ఫీజు కోసం గాజులు ఇచ్చి మిగిలిన డబ్బులు కార్తీక్ సార్ కి ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ కి వచ్చిన కార్తీక్ స్టాప్ ద్వారా జరిగింది తెలుసుకుంటాడు. ఆ గాజులు, ఫోన్ కూడా తనే తీసుకుంటాడు. తర్వాత దీప బాబాయ్ దగ్గరికి వెళ్లి ఆ ఇంటికి ఈ హోటల్ కి నా అవసరం లేదు మీకు దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











