Karthika Deepam Weekly Roundup: తండ్రి నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్.. శౌర్యను నర్సింహ ఎత్తుకెళ్లే ప్రయత్నం!

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది. తనకి పెళ్లి ఇష్టం లేదని తల్లితో చెప్పాలనుకుంటాడు కార్తీక్ కానీ తల్లి ఉత్సాహం చూసి చెప్పలేక పోతాడు. మరోవైపు కార్తీక్ ని వెతుక్కుంటూ ఒకటే వచ్చేస్తుంది శౌర్య. దారిలో నర్సింహా ఆమెని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే తప్పించుకుంటుంది. పాపని తీసుకువచ్చిన కార్తీక్ తో మరెప్పుడు ఇంటికి రావద్దు అని చెప్తుంది దీప. మరోవైపు శౌర్య మాటల్లో కార్తీక్ మాటలు శౌర్య వినలేదని అర్థం చేసుకొని ఆనందపడుతుంది దీప. మాటల్లో తనకి జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటాడు కార్తీక్. అతడిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది దీప. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూలై 22వ తేదీ నుంచి జూలై 27 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 22వ తేదీ 103 వ ఎపిసోడ్‌లో
కార్తీక్ తో జ్యోత్స్న ని పెళ్లి చేసుకోమని ఇరు కుటుంబాలని సంతోషంగా ఉంచే బాధ్యత మీదే అని చెప్తుంది దీప. మరోవైపు దీప నిశ్చితార్థం ఆపేస్తుందేమో అని కంగారుపడుతుంది పారిజాతం. ఆమె ధైర్యం చెప్తుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ తండ్రిని నడిరోడ్డు మీద స్వప్న వాళ్లతో చూసి నిర్ధాంత పోతాడు. స్వప్న ద్వారా తండ్రి రెండో పెళ్లిని నిర్ధారించుకుంటాడు. స్వప్న మాటల్లో దీపకి తండ్రి రెండో పెళ్లి గురించి తెలుసని గ్రహిస్తాడు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 22nd to July 27th episode Story
జూలై 23వ తేదీ 104వ ఎపిసోడ్‌లో
దీప దగ్గరికి వెళ్లిన కార్తీక్ తండ్రి రెండో పెళ్లి గురించి మీకు తెలిసిన నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు. మీకు తల్లిని దూరం చేయడం ఇష్టం లేక చెప్పలేదు నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు. ఆవిడ సంతోషపడే పనులు చేయండి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది దీప. ఇంటికి వచ్చిన కార్తీక్ తండ్రి తల్లి మీద చూపిస్తున్న కపట ప్రేమని చూసి భరించలేక పోతాడు. మరోవైపు జ్యోత్స్న దీప తో మాట్లాడుతూ ఇక్కడికి మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సుమిత్ర గారు రమ్మంటే వచ్చాను అంటుంది దీప. మాటల్లో తనకి బావ అంటే ఇష్టం అని బావ కోసం పైనుంచి కిందికి దూకేస్తాను అని చెప్తుంది జ్యోత్స్న.

జూలై 24వ తేదీ 105 వ ఎపిసోడ్‌లో
బావతో పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అని దీపతో చెప్తుంది జ్యోత్స్న. మరోవైపు తండ్రి తల్లికి భోజనం తినిపిస్తూ ఉంటే భరించలేక అతని దగ్గర భోజనం తీసుకుని తల్లికి తినిపిస్తాడు కార్తీక్. అందుకు ఎంతో ఆనందపడుతుంది కాంచన. మరుసటి రోజు నిశ్చితార్థం వేడుకలకు శివ నారాయణ ఇంటికి బయలుదేరుతారు కార్తీక్ అతని తల్లిదండ్రులు. మేళతాళాలతో ఇంటికి వస్తున్న కార్తీక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం చెప్పేటప్పుడు దీప కూడా ఉండాలి అని చెప్పి ఆమెను కూడా రప్పిస్తాడు కార్తీక్.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 22nd to July 27th episode Story
జూలై 25 వ తేదీ 106వ ఎపిసోడ్‌లో
కార్తీక్ ఏం చెప్తాడో అని అందరూ చాలా టెన్షన్ పడతారు. అయితే కార్తీక్ జ్యోత్స్న తో పెళ్లికి ఒప్పుకుంటునట్లు చెప్తాడు. ఆ మాటలకి అందరూ ఆనందపడతారు. మరోవైపు శౌర్య ని తీసుకురావడానికి రేపు వెళ్దాం రెడీగా ఉండు అని కొడుకుతో చెప్తుంది అనసూయ. పెళ్లికి ఒప్పుకున్నందుకు కార్తీక్ ని అభినందిస్తుంది దీప. ఇదంతా మీ వల్లే మీరు మీ కూతురు కోసం జీవించాలి అనుకుంటే నేను నా తల్లి కోసం జీవించాలి అనుకున్నాను అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అంటాడు కార్తీక్. మరోవైపు శౌర్య తండ్రి గురించి బాధపడుతూ ఉంటే మౌనంగా కన్నీరు పెట్టుకుంటుంది దీప.

జూలై 26వ తేదీ 107 ఎపిసోడ్ లో
నిశ్చితార్థం వేడుకలు ప్రారంభమవుతాయి. బావతో నిశ్చితార్థం జరుగుతున్నందుకు ఆనందంలో తేలిపోతుంది జ్యోత్స్న. సరిగ్గా అప్పుడే నర్సింహ కూతుర్ని తీసుకు వెళ్లడం కోసం తల్లితో సహా అక్కడికి వస్తాడు. నర్సింహను చూసి భయంతో దాక్కుంటుంది దీప. కానీ అనసూయ నీ తండ్రిని తీసుకువచ్చాను అని చెప్పటంతో పరిగెత్తుకొని కిందికి వస్తుంది. నర్సింహ ను చూసి పారిపోతుంటే అతడే నీ తండ్రి, నా కొడుకు అని చెప్తుంది అనసూయ. ఆ మాటలకి నిర్గంత పోయిన దీప ఈ బూచాడు నా తండ్రి కాదు కదా అని తల్లిని అడుగుతుంది. అతడే నీ తండ్రి అని దీప చెప్పడంతో షాక్ అవుతుంది శౌర్య.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 22nd to July 27th episode Story
జూలై 27వ తేదీ 108వ ఎపిసోడ్ లో
నర్సింహ తన తండ్రి అని తెలిసిన శౌర్య షాక్ తో స్పృహ కోల్పోతుంది. అయినా కూడా కూతుర్ని తీసుకువెళ్లిపోవాలనుకుంటాడు నర్సింహ. ఆవేశం ఆపుకోలేక తనని ఆపుతున్న జాతన చేతిని వదిలించుకొని వెళ్లి నరసింహా దగ్గర పాపని లాక్కొని అతనిపై కేకలు వేస్తాడు వెంటనే శౌర్య ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు వెంట దీప కూడా వెళుతుంది. ఏం చేయడానికి వచ్చావు ఏం చేశావు అంటూ కొడుక్కి మాటలు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. చేసేది లేక నరసింహ కూడా వెళ్ళిపోతాడు. నిశ్చితార్థం ఆగిపోయినందుకు కోపంతో రగిలిపోతుంది నాకన్నా మీకు అదే పే ఎక్కువ అంటూ తల్లిదండ్రులపై విరుచుకుపడుతుంది. మరోవైపు హాస్పిటల్ లో సౌర్యకి చాలా టెస్టులు చేస్తూ ఉండటంతో అనుమాన పడుతుంది దీప. పాప పాతవి హెల్త్ రిపోర్ట్స్ తీసుకురమ్మని అవి చూసిన డాక్టర్ కార్తీక్ తో మీతో మాట్లాడాలి నన్ను కలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. శౌర్య కి ఏమైనా అయిందా అని అనుకుంటాడు కార్తీక్ డాక్టర్ కార్తీక్ తో ఏం చెప్తాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X