Karthika Deepam Weekly Roundup: శౌర్య ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న కార్తీక్.. కూతురు కోసం కోర్టులో కేసు
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.
తండ్రి రెండో పెళ్లి గురించి తెలుసుకున్న కార్తీక్ నిర్గాంతపోతాడు. ఈ విషయం దీప కి తెలుసని గ్రహించిన కార్తీక్ తనకెందుకు చెప్పలేదని ఆమెని నిలదీస్తాడు. మీకు తల్లిదండ్రులను దూరం చేయటం ఇష్టం లేక చెప్పలేదు మీ తల్లిని మీరు సంతోషంగా ఉంచాలంటే ఈ పెళ్లి చేసుకోండి అని ఒప్పిస్తుంది దీప. తల్లి కోసం కార్తీక్ నిశ్చితార్థానికి ఒప్పుకుంటాడు. సరిగ్గా నిశ్చితార్థం జరుగుతున్న సమయానికి నరసింహ వచ్చి కూతురు కోసం గొడవ పెట్టుకుంటాడు అదే సమయంలో నరసింహా తన తండ్రి అని తెలిసిన శౌర్య స్పృహ కోల్పోతుంది. వెంటనే పాపని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు కార్తీక్. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 3 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
జూలై 29వ తేదీ 109 వ ఎపిసోడ్‌లో తన వల్లే నిశ్చితార్థం ఆగిపోయిందని క్షమాపణ చెప్తుంది దీప. అలాంటిదేమీ లేదు మళ్ళీ ముహూర్తం పెట్టించి నిశ్చితార్థం జరిపిద్దాం అంటుంది సుమిత్ర. నరసింహ కి విడాకులు ఇచ్చేయి లేదంటే జీవితాంతం ఇలాగే భయపడుతూ బ్రతకాలి అని సలహా ఇస్తుంది.మరోవైపు పాప గుండె వీక్ గా ఉందని, ఆమె భయపడే పనులు ఏమీ చేయవద్దని చెప్తాడు డాక్టర్. ఈ విషయం దీపకి చెప్పడు కార్తీక్. మరోవైపు మనవరాలిని వెనకేసుకొస్తున్న పారిజాతాన్ని మందలించి కూతుర్ని ఓదార్చడానికి వెళుతుంది సుమిత్ర. మరోవైపు హాస్పిటల్ లో నర్సింహని చూసిన దీప కంగారుపడుతుంది, విషయం కార్తీక్ తో చెప్తుంది. కానీ కార్తీక్ వచ్చి చూసేసరికి అక్కడ నర్సింహ ఉండడు.

జూలై 30వ తేదీ 110 వ ఎపిసోడ్‌లో ఈ పెళ్లి మీ బావకి ఇష్టం లేదేమో అలాంటి వాడిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటారు జ్యోత్స్న ఫ్రెండ్స్ వాళ్ళని మందలించి పంపించేస్తుంది సుమిత్ర. మరోవైపు శౌర్య పుట్టుక గురించి శోభ తప్పుగా మాట్లాడితే ఆమె చంప పగలగొడుతుంది అనసూయ. బూచోడు నన్ను తీసుకెళ్లిపోతాడేమో అని భయపడుతున్న సౌజన్యకి నేనున్నానని ధైర్యం చెప్తాడు కార్తీక్. హాస్పిటల్ కి వచ్చిన పారిజాతం, జ్యోత్స్న దీప ఇబ్బంది పడేలా మాట్లాడుతారు. పారిజాతం వాళ్లు వెళ్లిపోయిన తరువాత నేను ఇంటికి రాను పాప కోలుకున్న తర్వాత ఏదైనా వెళ్ళిపోతాను అంటుంది దీప. మరోవైపు తన నిశ్చితార్థం ఆగిపోయిన బాధ లేకుండా హాయిగా భోజనం చేస్తున్న తాత తల్లిదండ్రులను చూసి కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న.
జూలై 31వ తేదీ 111 వ ఎపిసోడ్‌లో కార్తీక్ ఫోన్ చేయడంతో భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్న తల్లితో గొడవపడుతుంది జ్యోత్స్న. ఆమెని మందలిస్తుంది సుమిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. నేను తనతో మాట్లాడుతాను నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు అని భార్యని హాస్పిటల్ కి పంపిస్తాడు దశరధ్. హాస్పిటల్ కి వెళ్లిన సుమిత్ర దీపని ఒప్పించి తనతో పాటు ఇంటికి తీసుకువస్తుంది. అప్పుడు కూడా జ్యోత్స్న దీపతో గొడవ పడుతుంది. సుమిత్ర కూతురుపై కోపగించుకుంటుంది. ఆమెని ఏమీ అనొద్దు అని జ్యోత్స్న ని వెనకేసుకొస్తుంది దీప.

ఆగస్ట్ 1 వ తేదీ 112వ ఎపిసోడ్‌లో మీ ఇంట్లోంచి నేనైనా వెళ్ళిపోతానేమో గాని నువ్వు మాత్రం ఎక్కడే ఉంటావు, నువ్వు మా బావనే కాదు మా అమ్మని కూడా నా నుంచి దూరం చేసేలా ఉన్నావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మరోవైపు ఇంటికి వచ్చిన కొడుకుని నిశ్చితార్థం ఆపుకొని హాస్పిటల్ కి వెళ్ళినందుకు మందలిస్తాడు శ్రీధర్. మీరు తలదించుకునే పని మీ కొడుకు ఎప్పటికీ చేయడు నా మీద నమ్మకం ఉంచండి అంటాడు కార్తీక్. మరోవైపు కూతురి కోసం కోర్టులో కేసు వెయ్యాలనుకుంటాడు నరసింహ అదే విషయం తల్లితో చెప్తే ఇవన్నీ మనకొద్దు అంటుంది అనసూయ. మరోవైపు మనవరాలిని చెడగొడుతుందనే ఉద్దేశంతో పారిజాతాన్ని కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లి ఉండమంటాడు దశరథ్. అప్పుడే కోర్టు నోటీసులు అందుకున్న దీప అవేమిటో తెలియక సుమిత్ర కి తీసుకెళ్ళి చూపిస్తుంది. ఇంకా నీ కూతురు దాని తండ్రి దగ్గరికి వెళ్లి పోవాల్సిందే అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. అలా జరగకూడదు, ఎలా అయినా నా కూతుర్నే రక్షించండి అని దశరథ్ దంపతుల కాళ్లు పట్టుకుంటుంది దీప.
ఆగస్టు 2 వ తేదీ 113 ఎపిసోడ్ లో నోటీసుల విషయం కార్తీక్ కి చెప్తుంది దీప. ఈ విషయం రౌడీ కి తెలియనివ్వకండి తెలిస్తే ఆమె గుండె అంటూ ఆగిపోతాడు కార్తీక్. ఏమైంది అని కంగారుగా అడుగుతారు అందరూ. ఏం లేదు చిన్న పిల్ల కథ పరిస్థితిని చేయలేదు అని ఈ మాట మార్చేస్తాడు కార్తీక్ తరువాత దీప ని తీసుకొని లాయర్ దగ్గరికి బయలుదేరుతాడు. మరోవైపు శ్రీధర్ జ్యోత్స్న ఫోన్ చేసి ఏడుస్తుంది, దీప ని ఇక్కడినుంచి సింగపూర్ పంపించేద్దాం అంటాడు. నిశ్చితార్థం జరిగితే అన్ని గొడవలు సర్దుకుంటాయి అంతవరకు శాంతించండి అంటుంది కాంచన. మరోవైపు నరసింహ ఊర్లో అప్పుల వాళ్ళని ఎగదయ్యడంతో వాళ్లు దారిలో వెళ్తున్న దీప వాళ్ళ కారుని ఆపి డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు పే చేస్తాడు. ఇదంతా ఆ నరసింహ కుట్ర అంటాడు కార్తీక్. అవన్నీ ఫోటోలు తీస్తాడు నర్సింహ. మరోవైపు నాన్నగా బూచాడు వద్దమ్మా అని ఏడుస్తున్న శౌర్య ని చూసి జాలి పడుతుంది దీప.

ఆగస్టు 3 వ తేదీ 114వ ఎపిసోడ్ లో తాగి కార్తీక్ ఇంటికి వచ్చిన నర్సింహ అతనితో గొడవ పడతాడు. కోర్టులో కేసు వేసావు కదా అక్కడే చూసుకుందాం అని చెప్పి అతడిని మెడ పెట్టి బయటకి గెంటేస్తాడు కార్తీక్. మనకి గొడవలు అవసరమా నువ్వు కోర్టుకు వెళ్లొద్దు అంటాడు శ్రీధర్ అయినా వినిపించుకోడు కార్తీక్. ఇంటికి వెళ్లిన నర్సింహ కార్తీక్ తో జరిగిన గొడవ గురించి తల్లితో చెప్తాడు. మనకీ గొడవలు వద్దురా అని నచ్చచెప్తుంది అనసూయ. అయినా వినిపించుకోడు నర్సింహ. మరోవైపు కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఇంట్లో వాళ్లకు తెలియకుండా కోర్టుకు వెళ్లాలనుకుంటారు జ్యోత్స్న, పారిజాతం. తర్వాత కోర్టుకు వచ్చిన పారిజాతం వాళ్ళని ఎందుకు వచ్చారు అని కోపంగా అడుగుతాడు కార్తీక్ మేము కూడా దీప కి శ్రేయోభిలాషులమే అందుకే వచ్చాను అంటూ వెటకారంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతారు జ్యోత్స్న వాళ్ళు. తర్వాత దీప లాయర్ జ్యోతిని ఆమెకి పరిచయం చేస్తాడు కార్తీక్. అప్పుడే నర్సింహ తరుపు లాయర్ విష్ణువర్ధన్ కూడా వస్తాడు. కోర్టులో కలుసుకుందాం అనే జ్యోతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత కోర్టులో ఎలా మాట్లాడాలో నర్సింహ కి తర్ఫీదు ఇస్తాడు విష్ణువర్ధన్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











