Karthika Deepam Weekly: కార్తీక్ ని ఫాలో అవుతున్న జ్యోత్స్న, పారిజాతం.. సుమిత్ర కి అడ్డంగా దొరికిపోయిన దీప!

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.

స్వప్న కావేరి శ్రీధర్ వాళ్ళు వచ్చిన రెస్టారెంట్ కి వస్తారు దీప హెచ్చరించడంతో శ్రీధర్ తప్పించుకుంటాడు. కానీ జ్యోత్స్న దీపని తన పెళ్లి జరగనివ్వకుండా ఆపుతుందని అపార్థం చేసుకుంటుంది. మరోవైపు నర్సింహ తన కూతుర్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. వాడి నుంచి బిడ్డని రక్షించుకుంటుంది దీప కానీ ఆ ప్రయత్నంలో స్పృహ కోల్పోతుంది శౌర్య. హాస్పిటల్లో జాయిన్ అయిన శౌర్య కార్తీక్ ని కలవరించటంతో అతడిని హాస్పిటల్ కి పిలిపిస్తుంది దీప.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 8th to July 13th episode Story

అక్కడ నర్సింహ తన బిడ్డని తీసుకువెళ్లబోతుంటే ఈ బిడ్డ నీకు పుట్టింది కాదు నాకు పుట్టింది అంటాడు కార్తీక్. దీప నర్సింహ తో పాటు జ్యోత్స్న కూడా వినేస్తుంది. అలా మాట్లాడినందుకు కార్తీక్ పై కోప్పడిన దీప తన జీవితంలో మళ్ళీ కనిపించోద్దని కార్తీక్ ని కన్నీటితో వేడుకుంటుంది. తర్వాత ఎవరికీ చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూలై 8వ తేదీ నుంచి జూలై 13 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 8వ తేదీ 91 వ ఎపిసోడ్‌లో తనకి ఒక ఇల్లు చూపించమని కడియం బాబాయ్ ని అడుగుతుంది దీప. తన ఫ్రెండ్ ఇల్లు చూపిస్తాడు బాబాయ్. కార్తీక్ బాబాయ్ కి ఫోన్ చేస్తే అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని బాబాయ్ కి చెప్తుంది దీప. బాబాయిని కూడా ఇకమీదట తన ఇంటికి రావద్దు అని చెప్తుంది. మరోవైపు హాస్పిటల్లో జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. మరోవైపు కొత్త ఇంటికి రావడం ఇష్టం లేని శౌర్య తల్లి పై అలుగుతుంది.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 8th to July 13th episode Story

జూలై 9వ తేదీ 92వ ఎపిసోడ్‌లో జ్యోత్స్న కాంచన ఇంటికి వస్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీక్ తో దీప కనిపించిందా అని అడుగుతుంది. లేదు అంటాడు కార్తీక్. నిన్నే ఎందుకు అడుగుతున్నాను అంటే తనకోసం వెతుకుతున్నావు కదా పైగా తన బాధ్యత కూడా తీసుకున్నావు కదా అందుకే అడిగాను, నీకు దీప గురించి తెలిస్తే చెప్పు ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మరోవైపు శౌర్య మాటలు వింటున్న దీపకి హాస్పిటల్ లో కార్తీక్ బాబు అన్న మాటలు వినేసిందా ఎలా తెలుసుకోవడం అనుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఎంగేజ్మెంట్ గురించి ఇంట్లో వాళ్ళని కంగారు పెడుతుంది పారిజాతం. కొడుకు కోడల్ని ముహూర్తాలు పెట్టించుకు రమ్మని కాంచన ఇంటికి పంపిస్తాడు శివ నారాయణ.

జూలై 19 వ తేదీ 92 వ ఎపిసోడ్‌లో బయట పని చేసుకుంటున్న దీప ని చూసి ఒక వ్యక్తి వెకిలిగా ప్రవర్తిస్తాడు. అతడిని కోపంగా చూస్తూ లోపలికి వచ్చేస్తుంది దీప. మరోవైపు తన ఇంటికి వచ్చిన సుమిత్ర దంపతులతో మీ బావగారు ముహూర్తాలు పెట్టించేయమన్నారు అని చెప్తుంది కాంచన. మరోవైపు కార్తీక్ దీపని వెతుకుతూ ఉంటాడు అదే సమయంలో జ్యోత్స్న, పారిజాతం కూడా దీప ని వెతుకుతూ ఉంటారు. దారిలో కార్తీక్ కారు కనిపించడంతో అతడిని ఫాలో అవుతుంది జ్యోత్స్న. నా వెంట పడద్దని జ్యోత్స్న ని, పారిజాతాన్ని హెచ్చరిస్తాడు కార్తీక్. మరోవైపు కాంచన చెప్పిన విషయం శివనారాయణకి చెప్తారు సుమిత్ర దంపతులు. రెండు రోజుల్లో ముహూర్తం పెట్టించేద్దాం అంటాడు శివ నారాయణ. మరోవైపు దీప కార్తీక్ కి కనిపించడంతో ఆమెతో వెళ్లి మాట్లాడుతాడు.

జూలై 11 వ తేదీ 94వ ఎపిసోడ్‌లో తాను తప్పు చేయలేదని శౌర్య కోసమే అలా చేశానని చెప్తాడు కార్తీక్ తనతో పాటు తన ఇంటికి రమ్మంటాడు కానీ దీప అందుకు అంగీకరించదు, తన ఇల్లు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయవద్దు అని చెప్పి వచ్చేస్తుంది దీప. మరోవైపు ముత్యాలమ్మ గూడెంలో ఇడ్లీలు అమ్మినట్లు ఇక్కడ కూడా అమ్ముతాను అని కూతురితో చెప్తుంది దీప. నేను కూడా వస్తాను దారిలో కార్తీక్ కనిపిస్తాడేమో అంటుంది శౌర్య. ఆమెని బుజ్జగించి నిద్ర పుచ్చుతుంది దీప. మరుసటి రోజు ఇడ్లీలు అమ్మడానికి వెళ్తున్న దీపతో బయట గడ్డ పెట్టుకుని వెళ్ళిపో లేదంటే నేను కార్తీక్ ను వెతుక్కుంటూ వెళ్లిపోతాను అంటుంది శౌర్య. శౌర్య మాటలు విన్న దీప కార్తీక్ అన్న మాటలు వినేసిందేమో అని భయపడుతుంది. మరోవైపు నీకు తెలిసిన నిజం ఒకటి నాకు తెలుసు అని కార్తీక్ తో అంటుంది జ్యోత్స్న. ఏమిటి అంటాడు కార్తీక్. జ్యోత్స్న చెప్పకపోవడంతో ఏదో జరుగుతుంది అనుకుంటాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద కనిపించిన దీపతో నర్సింహ అసహ్యంగా మాట్లాడుతాడు అతని చెంప పగలగొట్టి వచ్చేస్తుంది దీప.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup July 8th to July 13th episode Story

జూలై 12 వ తేదీ 95 ఎపిసోడ్ లో గుడిలో అన్నదానం చేయాలనుకుంటున్నాను నువ్వు ప్రసాదం చేయాలమ్మ అని హౌస్ ఓనర్ చెప్పడంతో అందుకు ఒప్పుకుంటుంది దీప. అక్కడికి వెళ్తే కార్తీక్ కనిపిస్తాడేమో అనే ఆశతో తను కూడా వస్తాను అంటుంది శౌర్య.అందుకు ఒప్పుకుంటుంది దీప. మరోవైపు వెళ్లి ఇష్టం లేదు అని చెప్పటానికి సుమిత్ర ఇంటికి వస్తాడు కార్తీక్. అలా చెప్తే మొదటిగా మీ అమ్మే ప్రాణాలు తీసుకుంటుంది పని బ్లాక్ మెయిల్ చేస్తుంది పారిజాతం. మరోవైపు గుళ్లో ముహూర్తాలు పెట్టించడానికి వచ్చిన గుడికే దీప కూడా వస్తుంది వాళ్లను చూసి దాక్కుంటుంది దీప. కానీ సుమిత్ర ఆమెని చూసేస్తుంది. నిజం చెప్పమని నిలదీస్తుంది. కానీ నిజం చెప్పదు దీప. సరే కార్తీక్ వాళ్ళ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారు ఆరోజు నువ్వు కూడా రావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర.

జూలై 13వ తేదీ 96వ ఎపిసోడ్ లో సుమిత్ర వెళ్లిపోయిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చిన శౌర్య కార్తీక్ గుడికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. నాకెలా తెలుస్తుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. కార్తీక్ ని తలుచుకొని బాధపడుతుంది శౌర్య అదే సమయంలో కార్తీక్ కూడా సౌర్య వాళ్ళ పాత ఇంట్లో శౌర్య ని తలుచుకుంటూ ఉంటాడు. తరువాత పారిజాతం కార్తీక్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఎలాగైనా నీ పెళ్లి నా మనవరాలు తో జరిపించి తీరతాను అంటుంది. పారు శాడిజం ని తిట్టుకుంటాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న నా నిశ్చితార్థం దీప కళ్ళముందే జరగాలి ఎలా అయినా దీపని వెతికి తీసుకుని రా అని పారిజాతంతో చెప్తుంది. అందుకు సరే అంటుంది పారిజాతం. మరోవైపు తనకి పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని తల్లితో చెప్పాలని కాంచన దగ్గరికి వస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X