Karthika Deepam Weekly Roundup: పారిజాతం నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్.. దీపకి పట్ట పగలే చుక్కలు చూపిస్తానం

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.

పాప కనిపించకుండా పోవడం, దానికి కారణం భర్త అనుకొని అతనిపై దీప భద్రకాళి లా రెచ్చిపోవటం, కార్తీక్ దీప మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ని కాంచన తప్పు పట్టటం, విషయం చెప్పకుండా పారిజాతం భర్త దగ్గర మాట తీసుకోవటం గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూన్ 10 వ తేదీ నుంచి జూన్ 15వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూన్ 10వ తేదీ 67వ ఎపిసోడ్‌లో
తన పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ తో జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటానని చేతిలో చేయి వేసి చెప్పమంటుంది పారిజాతం.ఆ మాటలకి షాక్ అవుతాడు కార్తీక్. బలవంతంగా జ్యోత్స్న చేతిలో చేయి వేయిస్తుంది పారిజాతం. కార్తీక్ ప్రవర్తన గమనించిన దీప అతనికి పెళ్లి ఇష్టం లేదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న మాట ఇవ్వటానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని కార్తీక్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. అయితే కార్తీక్ నిజం చెప్పేలోపు జ్యోత్స్న ని అక్కడ నుంచి తప్పించేస్తుంది పారిజాతం. ఆమెపై కోప్పడతాడు కార్తీక్.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 10 thto June 15th episode Story

జూన్ 11వ తేదీ 68వ ఎపిసోడ్‌లో
జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడే ఇంట్లో చెప్పేస్తాను అంటాడు కార్తీక్. నువ్వు ఎందుకు చేసుకోనంటున్నావో కూడా నేను చెప్తాను, నేను నీ కంటే మొండి దాన్ని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. మరోవైపు అనసూయ అనుకోకుండా దీపా హోటల్ లో టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేస్తూ ఉండగా అది దీప హోటల్ అని తెలుసుకొని మళ్లీ ఇటువైపు రాకూడదు అనుకుంటుంది. మరోవైపు పారిజాతంతో మాట్లాడుతూ ఈ పెళ్లి నీ జీవిత లక్ష్యమే కాదు నా జీవిత లక్ష్యం కూడా బావ కాదన్నా కూడా నేను బావని పెళ్లి చేసుకొని తీరుతాను అంటుంది జ్యోత్స్న. మరోవైపు యాక్సిడెంట్ చేసిన కావేరీ కూతురు స్వప్నని చెల్లెలు అని తెలియకుండానే ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు కార్తీక్. మరోవైపు శౌర్య కార్తీక్ తో ఫోన్లో మాట్లాడడం చూస్తుంది జ్యోత్స్న.

జూన్ 12వ తేదీ 69వ ఎపిసోడ్‌లో
కార్తీక్ శౌర్యతో ఫోన్లో మాట్లాడటం చూసి కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఆ ఫోన్ కార్తీక్ కొనిచ్చాడని శౌర్య ద్వారా తెలుసుకొని మరింత కోపంతో రగిలిపోతుంది. కార్తీక్ బాబు దగ్గర నేను ఫోన్ కొనుక్కున్నాను అని దీప చెప్పినా నమ్మదు. మరోవైపు అనసూయ కొడుకుని దీప జోలికి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తుంది. జ్యోత్స్న ఫోన్ సంగతి పారిజాతంతో చెప్పి నేను మానసికంగా బావకి ఎప్పుడో భార్యని అయిపోయాను ఇప్పుడు ఆ బావని ఎవరో లాక్కుంటారు అంటే చూస్తూ ఊరుకోను ఆ దీపకి పట్టపగలే చుక్కలు చూపిస్తాను అంటూ కోపంతో ఊగిపోతుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి టిఫిన్ ఆర్డర్ రావడంతో టిఫిన్ తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది దీప. దారిలో నర్సింహ కనిపించి ఆమెని ఊరు వదిలి పొమ్మని బెదిరిస్తాడు.

జూన్ 13వ తేదీ 70వ ఎపిసోడ్‌లో
నా కూతురు జోలికి వస్తే ఊరుకోనని భర్తకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు హాస్పిటల్ లో స్వప్న కి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చిన కావేరిని పరిచయం చేస్తుంది స్వప్న. ఆర్డర్ ఇచ్చింది కార్తీక్ అని తెలియక టిఫిన్ తీసుకుని స్వప్న దగ్గరికి వస్తుంది దీప. అక్కడ కార్తీక్ ని కావేరిని చూసి వీళ్ళకి ఒకరికి ఒకరు ముందే తెలుసా అని షాక్ అవుతుంది. తర్వాత శ్రీధర్ కూతుర్ని చూడటానికి వస్తాడు కానీ దీప ని కార్తీక్ ని అక్కడ చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. స్వప్నని కాపాడినందుకు ముందు కొడుకు పై కోపం ప్రదర్శించినా తరువాత ఆ అమ్మాయిని భోజనానికి పిలుద్దాం అంటుంది కాంచన. కానీ శ్రీధర్ కంగారుపడుతూ వద్దు ట్రీట్మెంట్ చేయించాడు కదా అంతవరకు చాలులే అని చెప్పి వెళ్ళిపోతాడు అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు తల్లి కొడుకులు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 10 thto June 15th episode Story

జూన్ 14 వ తేదీ 71 ఎపిసోడ్ లో
స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పటానికి దీప ఇంటికి వస్తాడు కార్తీక్. ఫోన్ నెంబర్ నాది ఇచ్చాను కాబట్టి నాకు ఫోన్ చేశారు ఇకమీదట అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటాడు. అమ్మకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అందుకే కొద్దిరోజులు నీ నెంబరే ఉంచుతాను అంటుంది శౌర్య. ఆ తర్వాత కార్తీక్ ని బయటకు తీసుకువెళ్లి మీకు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ఆమెకి చెప్పండి లేదంటే దానికి కూడా నేనే కారణం అనుకుంటారు అంటుంది దీప. పారువాళ్ళు ఏదో అని ఉంటారు అందుకే దీప ఇలా అంటుంది ఎలా అయినా రేపు జాబ్స్ నాతో ఈ విషయం మాట్లాడాలి అనుకుంటాడు కార్తీక్. మరోవైపు స్వప్నతో వీడియో కాల్ మాట్లాడుతాను అంటుంది కాంచన. కంగారుపడిన శ్రీధర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన వరకు చాలు అందరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.మరోవైపు తల్లితో పేరెంట్స్ మీటింగ్ కి వెళ్తున్న శౌర్య తో మీ వెనుక ఎవరూ రావడం లేదా అని వెటకారంగా అడుగుతుంది జ్యోత్స్న. మా వెనుక రావటానికి మాకు ఎవరూ లేరు అంటుంది దీప.

జూన్ 15వ తేదీ 72వ ఎపిసోడ్ లో
కార్తీక్ జ్యోత్స్న కి ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్తాడు. అందుకు ఆనందంగా ఒప్పుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు స్కూల్ కి వెళ్ళిన శౌర్యతో లోపల మిస్ రైమ్స్ అడుగుతుందట అని ఒక ఫ్రెండ్ చెప్తాడు. కంగారుపడిన శౌర్య కార్తీక్ కి ఫోన్ చేసి నాకు భయంగా ఉంది నువ్వు తోడు రా అని రిక్వెస్ట్ చేయడంతో అక్కడికి వెళ్ళిపోతాడు కార్తీక్. వాళ్లని ఫోటో తీసి శ్రీవాణి జ్యోత్స్న కి పంపిస్తుంది కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న స్కూల్ కి వచ్చి మా బావ చాలా బిజీ ఈ ఇలాంటి మీటింగ్స్ తో అతను టైం వేస్ట్ చేయకండి పాప రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అంటుంది. తర్వాత కార్తీక్ తో కోపంగా మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ అంటే రెస్టారెంట్లో అనుకున్నాను కానీ ఇలా స్కూల్లో అనుకోలేదు అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ని తీసుకొని దీప హోటల్ కి వెళ్లి నేను నీ స్పెషల్ ఉప్మా కి ఫ్యాన్ ని అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. మీకు ఏం కావాలి అని అడుగుతుంది దీప. మా బావ కావాలి అని చెప్తుంది జ్యోత్స్న. అయితే దీప ఏం సమాధానం చెబుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X