Karthika Deepam Weekly Roundup: దీపని ప్రశ్నలతో వేధించిన జ్యోత్స్న.. శౌర్యని తనకిచ్చేయమంటున్న నర్సింహ!

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.

కార్తీక్ తన దగ్గరికి వస్తానని సౌర్య స్కూల్ కి వెళ్ళాడని తెలిసి కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. నేరుగా అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకుంటుంది. తర్వాత హోటల్ కి వెళ్లి అక్కడ కూడా దీపతో వెటకారంగా మాట్లాడుతుంది. మరోవైపు స్వప్న శ్రీధర్ వాళ్లతో గడపటం లేదని గొడవ పెట్టుకుంటుంది ఆమెకి మాయమాటలు చెప్పి తప్పించుకుంటాడు శ్రీధర్. తర్వాత రోడ్డుమీద బావతో గొడవకి దిగుతుంది జ్యోత్స్న. నేను ఇదంతా శౌర్య కోసమే చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇస్తాడు కార్తీక్. తనని కొట్టిన దీపని ఏమీ చేయలేదని భర్తతో గొడవ పడుతుంది శోభ. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకొని తల్లి కొడుకులు ఆనందపడతారు. అయితే అది కేవలం అడగకపోవడం వల్ల వచ్చిన వాంతులు, అంతేకాకుండా ఆమెకు ఇకమీదట పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పడంతో శోభ వాళ్ళు షాక్ అవుతారు. మరోవైపు రోడ్డు మీద తండ్రిని వేరెవరితోనో చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం వస్తుంది. మరోవైపు నీ కూతుర్ని నువ్వు తెచ్చుకో అని కొడుక్కి సలహా ఇస్తుంది అనసూయ. నర్సింహా దీప దగ్గరికి వచ్చి బిడ్డ నాకు పుట్టినట్లయితే నాకు ఇవ్వు లేదంటే వద్దు అంటాడు.ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూన్ 17 వ తేదీ నుంచి జూన్ 22వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 17 thto June 22nd episode Story

జూన్ 17వ తేదీ 73వ ఎపిసోడ్‌లో
జ్యోత్స్న కార్తీక్ ని తీసుకొని దీప హోటల్ కి వెళ్లి అక్కడ కూడా రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఆమె చెవులకి పారిజాతం గారి మాటలు తప్పితే మరెవరి మాటలు చెవికి ఎక్కవు ఆవిడ బాగా రెచ్చగొట్టి పంపించినట్లు ఉన్నారు అనుకుంటుంది దీప. మరోవైపు తండ్రి తమతో టైం స్పెండ్ చేయడం లేదని స్వప్న శ్రీధర్ తో గొడవ పడుతుంది అయితే ఆమెకి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు శ్రీధర్. తనని కాపాడిన కార్తీక్ తో మాట్లాడమంటుంది స్వప్న. కంగారు పడిన శ్రీధర్ అందుకు అంగీకరించడు. మరోవైపు నడిరోడ్డు మీద కారు ఆపి నీతో మాట్లాడాలి అంటుంది జ్యోత్స్న ఇదంతా నువ్వు శౌర్య మీద చూపిస్తున్న కన్సర్నా లేక దీప మీద చూపిస్తున్న కన్సర్నా అని అడుగుతుంది. అంతేకాదు నేనంటే నీకు ఇష్టం లేదని చెప్తే ఇక్కడే చచ్చిపోతాను అంటూ కారు కింద పడబోతుంది.

జూన్ 18వ తేదీ 74వ ఎపిసోడ్‌లో
శౌర్య ముద్దు మాటలు చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది, నేను కేవలం శౌర్య కోసమే ఇదంతా చేస్తున్నాను అని క్లారిటీ ఇస్తాడు కార్తీక్. జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. తర్వాత కోపంతో రగిలిపోతూ చిన్నప్పటినుంచి బావే నా భర్తని మీరందరూ చెప్పారు, నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు మధ్యలో ఎవర్తో వచ్చి ఎగరేసుకుపోతానంటే ఊరుకోను, బావకి ఇష్టం లేకపోయినా కూడా నేను బావనే చేసుకుంటాను అంటుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్, దీప రోడ్డుమీద మాట్లాడుకోవటం చూసి అసహ్యించుకుంటుంది అనసూయ. అదే సమయంలో ఇంటిదగ్గర భర్తని కోప్పడుతూ ఉంటుంది శోభ. ఆ దీప నన్ను కొట్టి ఈరోజుకి నాలుగు రోజులైంది కానీ దానిని ఏమి చేయలేదు అని పోరుపెడుతుంది. అప్పుడే వచ్చిన అనసూయ ఆమెని కోప్పడుతుంది. అప్పుడే శోభ వాంతులు చేసుకుంటే ప్రెగ్నెంట్ ఏమో అనుకొని ఆనందపడిపోయి హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ ఎదురుపడిన దీపతో గర్వంగా ఈ విషయాన్ని చెప్తుంది అనసూయ.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 17 thto June 22nd episode Story

జూన్ 19వ తేదీ 75వ ఎపిసోడ్‌లో
నా కొడుక్కి వాడే అసలైన వారసుడు, నీ కూతురికి తండ్రి లేకపోయినా పర్వాలేదు ఎవరైనా సంతకం పెడతారు అని వెటకారంగా మాట్లాడుతుంది అనసూయ ఆమెపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు కార్తీక్ విషయంలో జ్యోత్స్న ని హెచ్చరిస్తుంది శ్రీవాణి, స్కూల్లో నేనున్నాను కాబట్టి కార్తీక్ ఇక్కడికి వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ హోటల్ దగ్గరికి వెళ్తే ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్త పడు అంటుంది. కోపంతో రెచ్చిపోయిన జ్యోత్స్న దీప టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళుతుంది. అక్కడ దీపతో ఇబ్బందికరంగా మాట్లాడి మా బావ నీకు రోజు ఫోన్ చేస్తాడా ఏ టైంలో ఫోన్ చేస్తాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు ఇబ్బంది పెడుతుంది. మరోవైపు ప్రెగ్నెంట్ కాదని ఇకపై ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్తుంది డాక్టర్. అప్పుడే నర్సింహా కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి నీ మీద ఒకటి కంప్లైంట్ ఇచ్చాడు స్టేషన్ కి రా అని చెప్పడంతో నర్సింహ అక్కడికి వెళ్తాడు. అది చూసిన కార్తీక్ మళ్లీ దీపని ఏమైనా ఇబ్బంది పెట్టడేమో అనుకొని కంగారుగా దీప దగ్గరికి వెళ్తాడు.

జూన్ 20వ తేదీ 76వ ఎపిసోడ్‌లో
తన దగ్గరికి వచ్చిన కార్తీక్ ని మళ్లీ ఎందుకు వచ్చారు అంటుంది దీప. ఆ నరసింహని పోలీసులతో చూశాను మిమ్మల్ని ఏమైనా చేసాడేమో అని కంగారు పడి వచ్చాను అంటాడు కార్తీక్. మిమ్మల్ని సహాయం చేయమని నేను అడగలేదు కదా, ఒకవేళ వాడుదాడి చేసినా పట్టించుకోకండి ఇంకొకరి చేత నన్ను మాటలు పడేలాగా చేయకండి అంటుంది. మరోవైపు జాబ్స్ నా పారిజాతంతో మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎమోషనల్ బాండింగ్ ఉంది అదే వారిని దగ్గర చేస్తుంది అంటుంది జ్యోత్స్న. మరోవైపు నీకు తెలియకుండా ఒక తప్పు చేశాను నన్ను కొట్టు అని తల్లి దగ్గరికి వస్తుంది శౌర్య. చేసావు అంటుంది దీప. మా స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కి ఏం చేయాలో తెలియక కార్తీక్ ఫోన్ చేసి అడిగాను అతను తండ్రి గురించి ఎంత బాగా చెప్పాడో అంటుంది. ఆ మాటలకి ఎమోషనల్ అవుతుంది దీప. మరోవైపు ఏడుస్తూ కూర్చున్నా షాపుతో నువ్వెందుకు ఏడవటం వాడికి కాదు కదా వాడికి ఒక కూతురు ఉంది అని శోభతో చెప్తూ నీతో ఆ దీపకే సంబంధం లేదని చెప్పింది కదా అలాంటప్పుడు నీ కూతురు మాత్రం దానికి ఎందుకు అని సలహా ఇస్తుంది అనసూయ. మరోవైపు రోడ్డు మీద తండ్రిని చూసిన స్వప్న షాక్ అవుతుంది తర్వాత అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది.

జూన్ 21 వ తేదీ 77 ఎపిసోడ్‌లో
తన తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది స్వప్న కానీ అతను వేరే ఎవరితోనో ఉండడం చూసి షాక్ అవుతుంది. రోడ్డు దాటి శ్రీధర్ దగ్గరికి వచ్చేసరికి అతను అప్పటికే కారులో వెళ్ళిపోతాడు.ఈ విషయం కార్తీక్ తో చెప్పి ఏదైనా సలహా ఇవ్వు అంటుంది స్వప్న నువ్వు నీ తండ్రిని నిలదీయు అంటాడు కార్తీక్. ఈ సంభాషణ అంతా విన్న దీప అలా నిలదీయవద్దు అది అపార్థాలకి అనుమానాలకి దారితీస్తుంది అంటుంది. నిజమే నేను నిజమేమిటో కనుక్కొని అప్పుడు అమ్మతో చెప్తాను అంటుంది స్వప్న. స్వప్న వెళ్ళిపోయిన తరువాత ఎందుకు అలా మాట్లాడారు అని అడుగుతాడు కార్తీక్. ఏ అమ్మకి అన్యాయం జరగకూడదు అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటాడు. మీ అమ్మకే అన్యాయం జరుగుతుంది బాబు అనుకుంటుంది దీప. మరోవైపు కూతురుకి లంచ్ తీసుకెళ్లిన దీపతో పాప తండ్రి వచ్చాడు అని చెప్తాడు అటెండర్. నరసింహ వచ్చాడేమో తనే పాప తండ్రి అని చెప్పేస్తాడేమో అని కంగారుపడుతుంది దీప కానీ నరసింహా దీప ని పక్కకు తీసుకువెళ్లి నా కూతుర్ని నాకు ఇచ్చేయ్, నాకు పుడితే నాకు ఇవ్వు,లేదంటే నాకు ఇవ్వద్దు అంటాడు. అ మాటలకి షాక్ అవుతుంది దీప.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 17 thto June 22nd episode Story

జూన్ 22వ తేదీ 78వ ఎపిసోడ్‌లో

నాకు పుడితే ఆ పాపని నాకు ఇవ్వు లేదంటే ఇవ్వొద్దు, నీ నిర్ణయాన్ని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు చెప్పు అంటాడు నర్సింహ. మరోవైపు కూతురితో మాట్లాడుతూ నువ్వు బావ ఈ మధ్య కలుస్తున్నారంట కదా మధ్య జరిగిన గొడవలకి మీ ఇద్దరి మధ్య ఏడబాటు వస్తుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటుంది సుమిత్ర అప్పుడే వచ్చినా పారిజాతంతో పెళ్లి అయ్యే వరకు పిల్లలకి కాస్త దూరంగా ఉండండి అని హెచ్చరిస్తుంది. మరోవైపు శ్రీధర్ కావేరి దగ్గరికి వెళ్లాలనుకుంటాడు అంతలోనే కాంచనకి హెల్త్ బాగోకపోతే నీకోసం క్యాంపుకు వెళ్ళను అంటాడు. నాది చిన్న జ్వరమే మీరు వెళ్ళండి అని నాతో చెప్తుంది కాంచన. కాంచన బాధ్యత కార్తీక్ కి అప్పజెప్పి వెళ్తాడు శ్రీధర్. నాన్న క్యాంపుకు వెళ్తున్నాడే కానీ మనసంతా ఇక్కడే ఉంది నిజంగా మీరు అమర ప్రేమికులు అని తల్లిని ఆటపట్టిస్తాడు కార్తీక్. మరోవైపు పరధ్యాన్నంగా నడుస్తున్న దీపని కారు గుద్దేయబోతుంది. సదరు కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కానీ తప్పు నాదే అంటుంది దీప. నాన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే అంటూ జరిగిందంతా చెప్తాడు కార్తీక్. మరోవైపు మీకోసం నేను తిట్లు తింటున్నాను అని జ్యోత్స్న తో అంటుంది పారిజాతం. మన ఇంట్లో మనకే మెజారిటీ లేదు అలాంటిదే నువ్వు నాకోసం ఏదో త్యాగం చేశాను అన్నట్టు ఏమీ బాగోలేదు అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X