Karthika Deepam Weekly Roundup: దీపకి డెడ్ లైన్ పెట్టిన నర్సింహ..పారిజాతానికి శివ నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్!
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది. జ్యోత్స్న దీప టిఫిన్ సెంటర్ కి వెళ్లి అక్కడ హడావిడి చేస్తుంది.పారిజాతం గారు బాగా రెచ్చగొట్టి పంపినట్లు వున్నారు అనుకుంటుంది దీప. తర్వాత జరిగిన విషయం అంతా పారిజాతంతో చెప్పి ఎలాగైనా బావ నేను పెళ్లి చేసుకొని తీరుతాను అంటుంది జ్యోత్స్న. మరోవైపు శోభ ప్రెగ్నెంట్ అనుకుని ఆనందపడతారు అనసూయ వాళ్ళు. శోభ ప్రెగ్నెంట్ కాదని అసలు తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో దీప కూతురిని తెచ్చుకోమని కొడుక్కి సలహా ఇస్తుంది అనసూయ. మరోవైపు రోడ్డుమీద అనుమానాస్పదంగా కనిపించిన తండ్రిని మొదటిసారి అనుమానిస్తుంది స్వప్న.మరోవైపు తండ్రి చావులో కార్తీక్ తప్పులేదని తెలుసుకుంటుంది దీప. ఇదంతా గత వారంలో హైలెట్స్ గా నిలిచాయి ఇక జూన్ 24వ తేదీ నుంచి జూన్ 29వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
జూన్ 24వ తేదీ 79వ ఎపిసోడ్‌లో
కాంచనకి ఆరోగ్యం బాగోలేదని దీపకి చెప్తాడు కార్తీక్. తండ్రి మరణం లో కార్తీక అప్పు లేదని తెలుసుకున్న దీప ఆయనని ఎన్ని మాటలు అన్నాను అని పశ్చాతాపంతో కుమిలిపోతుంది. తర్వాత కాంచనకి ఒంట్లో బాగోలేదని ఆమెకి సాయం చేయటానికి ఆమె ఇంటికి వెళుతుంది దీప. కాంచన భర్త గురించి ఆమెకి నిజం చెప్పాలనుకుంటుంది దీప. డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పి అలాంటి మనిషిని ఏం చేయాలి అంటుంది.

జూన్ 25వ తేదీ 80వ ఎపిసోడ్‌లో
నాలాంటి భార్య అయితే విషం తాగి చచ్చిపోతుంది అంటుంది కాంచన. ఆ మాటలకి భయపడిన దీప నిజం చెప్పడం మానేస్తుంది. మరోవైపు మనవడు మనమరాలి పెళ్లి కోసం భర్తని తొందర పెడుతుంది పారిజాతం. మరోవైపు తన అనుమానం విషయం గా తండ్రిని నిలదీయాలి అనుకుంటుంది స్వప్న కానీ నిజంగా ఆయన తప్పు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు అని ఊరుకుంటుంది. మరోవైపు నర్సింహ నేను బిడ్డని అడిగిన విషయం ఏం చేశావు, రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని డెడ్ లైన్ పెడతాడు.
జూన్ 26వ తేదీ 81వ ఎపిసోడ్‌లో
తండ్రి మరణం విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను క్షమించండి అని కార్తీక్ ని క్షమాపణ అడుగుతుంది దీప. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అంతే చాలు అంటాడు కార్తీక్. మరోవైపు స్వప్నకి సంబంధాలు చూడమని భర్తతో చెప్తుంది కావేరి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అమ్మ ఒంటరిగా అయిపోతుంది అంటుంది స్వప్న. మరోవైపు పిల్లల ఎంగేజ్మెంట్ విషయంలో భర్తని కంగారు పెడుతుంది పారిజాతం. నువ్వు ఎక్కువగా కలుగజేసుకోవద్దు అని భార్యకి వార్నింగ్ ఇస్తాడు శివ నారాయణ. మరోవైపు తండ్రి బొమ్మ చేసి తల్లికి చూపించి ఆనందపడుతుంది శౌర్య.

జూన్ 27వ తేదీ 82వ ఎపిసోడ్‌లో
మీ బావ ఆ దీపని నేరుగా ఇంటికే రప్పించుకున్నాడు, తల్లికి బాగోలేదనే విషయం నీకు చెప్పలేదు గాని ఆ దీపకి చెప్పాడు అని జ్యోత్స్న ని రెచ్చగొడుతుంది పారిజాతం. మరోవైపు నీ పెళ్లి విషయం మాట్లాడటానికి తాతయ్య వాళ్ళు వచ్చారు అని కార్తీక్ తో చెపుతుంది కాంచన. అదే సమయంలో శౌర్య ఫాదర్స్ డే ఫంక్షన్ కి స్కూల్ కి రమ్మని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. తర్వాత సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్లి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తుంది శౌర్య.అయితే ఆమె మనసు విరిచేలా మాట్లాడుతుంది పారిజాతం. ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ కూడా వస్తున్నాడు అని శౌర్య ద్వారా తెలుసుకొని షాక్ అవుతారు జ్యోత్స్న,పారిజాతం.
జూన్ 28 వ తేదీ 83 ఎపిసోడ్ లో
కార్తీక్ ఎక్కడ ఫంక్షన్ కి వెళ్ళిపోతాడు అని జ్యోత్స్న తనే స్కూల్ ఫంక్షన్ కి అటెండ్ అవుతుంది. శౌర్య కి తనే తండ్రిని అని చెప్పాలనుకుంటున్న నర్సింహ కి స్కూల్లో ఫంక్షన్ అవుతుంది అని తెలుసుకొని తను కూడా అక్కడికి వెళ్తాడు. ఫంక్షన్ లో నర్సింహని, జ్యోత్స్న ని చూసిన కార్తీక్ మళ్లీ గొడవలు అవుతాయని వాళ్లకి కనిపించకుండా దాక్కుంటాడు. శౌర్య తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతుంది కానీ తర్వాత అదంతా తన తల్లి గురించి అని తెలుసుకుని దీపని అభినందిస్తాడు ప్రిన్సిపల్. మొదట్లో ఆమె పట్ల చులకనగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుతాడు.

జూన్ 29వ తేదీ 84వ ఎపిసోడ్ లో
అస్తమానం తనకి ఫోన్ చేసి పిలవద్దు, అమ్మాయికి అంటే నిజం తెలియదు కానీ నీకు నిజం తెలుసు కదా అని కావేరిని మందలిస్తాడు శ్రీధర్.ఏం నిజం అని నిలదీస్తుంది స్వప్న. నీ పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం అని అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. మరోవైపు రోడ్డుమీద వెళ్తున్న దీపని ఆపి కూతురు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకో, నన్ను ఇంట్లో బ్రతకనివ్వటం లేదు. లేదంటే అది నా కూతురు కాదని చెప్పు అంటాడు నర్సింహ. వెళ్లబోతూ పాప జాగ్రత్త అని హెచ్చరించి మరీ వెళ్ళిపోతాడు. ఏం చేయాలో తోచక ఏడుస్తుంది దీప. పెళ్లి విషయంపై కార్తీక్ నితల్లిదండ్రులు నిలదీయడంతో ఈరోజు మీకు పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తాను మనం ఈ విషయం రెస్టారెంట్లో మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ ఫంక్షన్ కి రాలేదని అలిగి కూర్చుంటుంది శౌర్య. అది అర్థం చేసుకుంటుంది దీప. నర్సింహ మాటలకి భయపడి కూతుర్ని వారం రోజులు స్కూలుకు వెళ్లొద్దు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఎందుకు అని అడుగుతాడు. అతనికి నిజం చెప్పటం ఇష్టం లేక మా ఊరు వెళ్లడానికి అని అబద్ధం చెప్తుంది దీప. కార్తీక్ శౌర్యతో మాట్లాడాలనుకుంటే ఆమె అలిగి వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











