Karthika Deepam Weekly Roundup: భర్త మీద కోపంతో భద్రకాళిలా మారిన దీప.. పారిజాతానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కార

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. దీప, సుమిత్ర మధ్య ఎపిసోడ్స్, దీపపై పారిజాతం దొంగతనం మోపడం, బంటూ కుట్రలు నేపథ్యంగా ఎపిసోడ్స్ జరిగాయి. భర్త నర్సింహ వచ్చి దీపపై గొడవ చేయడం హైలెట్స్‌గా నిలిచాయి. ఈ సీరియల్‌లో జూన్ 3 వ తేదీ నుంచి జూన్ 8 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూన్ 3వ తేదీ 61వ ఎపిసోడ్‌లో..

కార్తీక్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో అతని ఆఫీస్ కి వెళ్లి తనని బయటకు తీసుకు వెళ్ళమని కార్తీక్ ని అడుగుతుంది జోక్స్ నా ఆమె మాట కాదనలేక బయటికి తీసుకెళ్తాడు కార్తీక్. మరోవైపు స్కూలుకు వెళ్లిన దీపకి కూతురు కనిపించకపోవడం, ఏదో క్యాబ్లో వెళ్ళిపోయింది అని వాచ్మెన్ చెప్పడంతో నరసింహని అనుమానించి అక్కడికి వెళుతుంది దీప. ఆమెని తిట్టి పంపించేస్తారు శోభ,అనసూయ. నడిరోడ్డు మీద ఏడుస్తూ కూర్చున్న దీపని అటుగా వచ్చిన కార్తీక్ వాళ్ళు చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. శౌర్య కనిపించడం లేదని తెలుసుకొని వెతకటం ప్రారంభిస్తారు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 3rd to June 8th episode Story

జూన్ 4వ తేదీ 62వ ఎపిసోడ్‌లో..
ఏడుస్తున్న దీపతో కంగారు పడకండి అవసరం అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు కార్తీక్ వద్దు అంటుంది దీప. పాప కోసం దీప కోసం అంత తాపత్రయపడుతున్న కార్తీక్ ని చూసి కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. మరోవైపు భర్త ప్రవర్తనలో మార్పు కనిపించడంతో నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటుంది కాంచన. చెప్పాలనుకుంటున్న నిజం వింటే నీ గుండె ఆగిపోతుంది అనుకుంటాడు అనుకుంటాడు శ్రీధర్. మనసులో త్వరగా కార్తీక్ కి పెళ్లి చేసి కాంచన విషయం చెప్పాలి అనుకుంటాడు. మరోవైపు కారులో కూర్చొని బాధపడుతున్న దీప కి ధైర్యం చెబుతూ ఉంటాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న జాబ్స్ నా మరింత కోపంతో రగిలిపోతుంది అంతలోనే పారిజాతం ఫోన్ చేయటంతో విషయం చెప్తుంది జోత్స్నా పాప ఇంటి దగ్గరే ఉంది అంటూ ఆమె ఫోటో పంపిస్తుంది పారిజాతం. విషయం తెలుసుకున్న దీప కార్తీక్ సంతోషిస్తారు. తర్వాత దీపని ఇంటిదగ్గర విడిచిపెడతాడు కార్తీక్. దీప శౌర్యని హత్తుకుని ఏం జరిగిందో తెలుసుకుంటుంది అంత లోనే నర్సింహ కార్తీక్ కి ఫోన్ చేసి నా పెళ్ళాం నీ పక్కనే ఉండి ఉంటుంది ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో కార్తీక్ ఫోన్ ఇస్తాడు. ఇంటికి రావడానికి కారణం నేనే అని చెప్పి దీపనే రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. మరోవైపు దీప వల్ల బావ నాకు దక్కటం లేదు అని బాధపడుతుంది జ్యోత్స్న.

జూన్ 5 వ తేదీ 63వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న ని రెచ్చగొడుతున్న పారిజాతం పై కోప్పడుతుంది సుమిత్ర. నా కూతురు జీవితాన్ని నేను చక్కదిద్దుకోగలను దయచేసి మీరు నా కూతురు జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు కోపంతో నరసింహ ఇంటికి వెళ్లినా దీప శోభ చెంప పగలగొట్టి నరసింహ పీక మీద కత్తిపీట పెట్టి మళ్ళీ నా కూతురు జోలికి వచ్చావంటే ఊరుకోను అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఆమె భద్రకాళి అవతారం చూసి అందరూ షాక్ అవుతారు. నీ జోలికి రాము అని అనసూయ చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది దీప. మరోవైపు కొడుకు ఇంటికి రాకపోవడంతో కార్తీకి ఫోన్ చేస్తుంది కాంచన అరగంటలో వస్తాను అంటాడు కార్తీక్. అతని ప్రవర్తనకి బాధపడుతుంది కాంచన. భార్యని మంచి మాటలు చెప్పి కూల్ చేస్తాడు శ్రీధర్. మరోవైపు శౌర్యకి పిజ్జా తినిపించి తీసుకువస్తాడు కార్తీక్. ఇప్పుడే ఇంటికి వచ్చిన దీప పాపకి ఏమీ తినిపించలేదేమో అనుకొని కార్తీక్ మీద ఫైర్ అవుతుంది. కార్తీక్ పిజ్జా తినిపించాడు అని శౌర్య చెప్పడంతో షాక్ అవుతుంది.

జూన్ 6వ తేదీ 64వ ఎపిసోడ్‌లో...
కార్తీక్ శౌర్యకి పిజ్జా తినిపించాడు అని తెలుసుకుంటుంది దీప తర్వాత పిజ్జా ఖరీదు తెలుసుకొని పాపకి కొత్త రుచులు అలవాటు చేయకండి ఆ ఖర్చులు నేను భరించలేను అని కార్తీక్ కి చెప్తుంది. తర్వాత శౌర్య చెప్పడంతో దీపా కార్తీక్ కి థాంక్స్ చెప్తుంది. మరోవైపు దీప ప్రవర్తనకి షాక్ అయిన అనసూయ కొడుకు చేసిన నిర్వాకం తెలుసుకొని అతడిని మందలిస్తుంది. పారిజాతం భర్త దగ్గరికి వచ్చి నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఒక మాట ఇవ్వండి అని అడుగుతుంది. సరే అంటాడు శివ నారాయణ. మరోవైపు పారిజాతం చెప్పిన మాటలు విని కొడుకుని అనుమానిస్తుంది కాంచన.

జూన్ 7వ తేదీ 65వ ఎపిసోడ్‌లో..
తనని అనుమానిస్తున్న తల్లిని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావ్ ఏంటి అక్క నన్ను అర్థం చేసుకుంది కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని తల్లిని కన్విన్స్ చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత రోడ్డుమీద దీపం చూసి భయంతో పరుగులు తీసిన అనసూయ చూసుకోకుండా కార్తీక్ కి డాష్ ఇస్తుంది. ఎందుకు ఆ కంగారు అని అడుగుతాడు కార్తీక్. దీప భద్రకాళి అవతారం గురించి చెప్పి ఇప్పుడు నన్ను చూసింది అంటే మళ్ళీ నన్ను చావగొడుతుంది అని అక్కడ నుంచి పారిపోతుంది అనసూయ. దీప లో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతాడు కార్తీక్. మరోవైపు పారిజాతం బర్త్డే కి పాయసం చేయమని దీపకి చెప్తుంది సుమిత్ర.దీప ఏం చేసినా అమ్మకి స్పెషలే అని తల్లిని తిట్టుకుంటుంది జ్యోత్స్న. దీప వంట అంటే భయపడేలాగా చేస్తాను అని మనవరాలికి మాటిస్తుంది పారిజాతం. మరోవైపు బర్త్డేకి రమ్మని కాంచన శ్రీధర్ ని పిలుస్తుంది కానీ అతను పని ఉందని చెప్పి తప్పించుకుంటాడు. కార్తీక్ ని ఫంక్షన్ కి పంపిస్తుంది కాంచన. మరోవైపు పారిజాతానికి బొకే ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పిన కార్తీక్ బయట ఫోన్లో మాట్లాడుతూ దీపనే చూస్తూ ఉంటాడు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup june 3rd to June 8th episode Story

జూన్ 8వ తేదీ 66వ ఎపిసోడ్‌లో...
తననే చూస్తున్న కార్తీక్ దగ్గరికి వచ్చిన దీప ఏమిటి నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని అడుగుతుంది. మీరు మొన్న రాత్రి ఏం చేశారో నాకు తెలిసింది మీ అత్తయ్య చెప్పారు అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నాను అంటాడుకార్తీక్. నా బిడ్డ జోలికి వస్తే నేను ఊరుకోను అంటుంది దీప. అసలు ఇదంతా మీ దగ్గర ఫోన్ లేకపోవడం వల్లనే జరిగింది అంటూ దీప వద్దంటున్నా వినకుండా ఆమెకి ఫోన్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత పారిజాతం ఇంట్లో వాళ్ళందరికీ పాయసం ఇమ్మని దీపకి చెప్తుంది నేను ఇస్తాను అంటూ కార్తీక్ అందరికీ పాయసం ఇస్తాడు. తర్వాత పారిజాతం దగ్గరికి వచ్చి నువ్వు పాయసంలో ఏదో కలపటం చూసాను మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్తాడు. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం తర్వాత అందరూ పారిజాతాన్ని మీరు ఏదో కోరిక కోరతాను అన్నారు కదా అది ఏమిటి అని అడుగుతారు. ఆ కోరిక ఏమిటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X