Karthika Deepam Weekly Roundup దీపై పారిజాతం కుట్రలు ఫలించాయా? కార్తీక్‌తో జ్నోత్స్న పెళ్లి ప్రయత్నాలతో అసహనం!
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. దీప, సుమిత్ర మధ్య ఎపిసోడ్స్, దీపపై పారిజాతం దొంగతనం మోపడం, బంటూ కుట్రలు నేపథ్యంగా ఎపిసోడ్స్ జరిగాయి. ఈ సీరియల్‌లో మే13వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
మే 13వ తేదీ 43వ ఎపిసోడ్‌లో
నర్సింహ ఇంటికి వచ్చి గొడవ చేయడంపై ఇంట్లో చర్చ జరుగుతుంది. నర్సింహ గురించి ముందే తెలుసా అని సుమిత్ర ప్రశ్నిస్తే.. నాకు తెలుసు. కానీ రెండో పెళ్లి చేసుకొన్నాడని తెలియదు అని కార్తీక్ చెబుతాడు. అయితే కార్తీక్‌ను నర్సింహ అనరాని మాటలు అనడం చూసి జ్యోత్స్న బాధపడుతుంది. బావ అలాంటి మాటలు అనిపించుకొనే స్తితిలో ఉండటం ఏమిటి అని అంటుంది. నర్సింహ చేసిన పనికి దీప బయటపడుతుంది. అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తే.. మీరు కొట్టకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని కార్తీక్‌తో దీప అంటుంది.

కార్తీక్ ఇంట్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నర్సింహ విపరీతంగా తాగుతుంటే.. తల్లి అనసూయ ఆపే ప్రయత్నం చేస్తుంది. తనతోటి కాకపోతే కోడలు శోభను ఆపేలా చేయమని చెబుతుంది. కానీ ఆమె వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే నర్సింహతో జరిగిన గొడవ గురించి కార్తీక్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇదిలా ఉండగా, కార్తీక్‌తో పెళ్లి విషయం చర్చకు వస్తుంది. ఇక ఇదిలా ఉండగా.. కూతురు శౌర్యతో నేను పనికి పోతున్నాను. నీవు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లవద్దు అని చెబుతుంది. కానీ కార్తీక్ గురించి శౌర్య మంచిగా మాటలు చెప్పడంతో దీప కోపగించుకొంటుంది.
మే 15వ తేదీ 45వ ఎపిసోడ్‌లో
దీప బాబాయ్ హోటల్‌లో పనిచేస్తుంటే.. అక్కడికి కార్తీక్ వచ్చి టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వబోతాడు. అయితే మీ డబ్బులే మా వద్ద ఉన్నాయని బాబాయ్, దీప నిరాకరిస్తారు. అయితే శౌర్య తెలివితేటలు గమనించిన దశరథ్.. ఆమెను మంచి స్కూల్‌లో చేర్పించాలని నిర్ణయించుకొంటాడు. కానీ అయితే నా బిడ్డను నేను చదివించుకొంటాను. మీ సహాయం అవసరం లేదని చెబుతుంది. అయితే ఫీజు కట్టలేని దీపకు కార్తీక్ సహాయం చేయాలని అనుకొంటాడు.

మే 16వ తేదీ 46వ ఎపిసోడ్‌లో
శౌర్యను చదివించడానికి ఓ స్కూల్‌లో దీప జాయిన్ చేయాలనుకొంటుంది. కానీ పేరెంట్స్ బాగా చదువుకొన్నవారైతేనే సీటు ఇస్తామని అంటారు. అంతలోనే అక్కడికి కార్తీక్, నర్సింహ వచ్చి ఒకరికొకరు గొడవ పడుతాడు. దీపకు ఇంత కష్టం వచ్చినా.. సహించను అని కార్తీక్ అంటే.. అయితే నీకు దీపకు ఏదో సంబంధం ఉందని నర్సింహ అంటాడు. దాంతో వారిద్దరి గొడవను ఆపేస్తారు. ఇక శౌర్యను వేరే స్కూల్‌లో చేర్పించేందుకు దీప తీసుకెళ్తుంది.

మే 17వ తేదీ 47వ ఎపిసోడ్‌లో
శౌర్యను వేరే స్కూల్‌లో దీప చేర్పిస్తుంది. కానీ శౌర్యకు ఆ స్కూల్ నచ్చకపోవడంతో దీపను కార్తీక్ తిడుతాడు. ఆమెకు స్కూల్ నచ్చలేదట. ఇంకా ఏం చదువుతుందని కోపగించుకొంటాడు. అయితే ఆ మాటలకు జోత్న్సకు కోపం వస్తుంది. శౌర్యపై జాలీ కాదు.. బాధ్యతగా ఉందని ఫీలవుతుంది. అయితే ఇంటిలో కార్తీక్, జ్యోత్న్స పెళ్లి గురించి ప్రస్తావన వస్తుంది. అయితే పెళ్లి గురించి పెద్దగా ఆలోచించకండి కార్తీక్ పరోక్షంగా చెబతాడు. అయితే పెళ్లి విషయంలో పారిజాతం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది.

మే 17వ తేదీ 48వ ఎపిసోడ్‌లో
శౌర్యకు కార్తీక్ సైకిల్ గిఫ్టుగా ఇచ్చారనే విషయం తెలుసుకొని పారిజాతం షాక్ తింటుంది. శౌర్య నిజం చెప్పడంతో దీప కోపగించుకొంటుంది. అయితే నీవు నిజాలు చెప్పొచ్చు.. కానీ నీ కూతురు నిజాలు చెప్పవద్దా అని పారిజాతం అంటుంది. దాంతో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లమని దీప హెచ్చరిస్తుంది. ఇదిలా ఉండగా, దీప ఊరికి వెళ్లి ఆమె గురించి వివరాలు సేకరించమని బంటును పారిజాతం పంపిస్తుంది. అయితే స్కూల్‌లో శౌర్య ప్రతిభను ప్రిన్స్‌పాల్ ప్రశంసిస్తుంది. దాంతో శౌర్యను ముద్దు పెట్టుకొంటాడు. అది చూసి జ్యోత్న్స భాదపడుతుంది.


Click it and Unblock the Notifications











