Karthika Deepam Weekly Roundup మొదటి భార్య పిస్టల్..రెండో భార్య అరిటాకు.. అంతు చూస్తానంటూ నర్సింహ

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. దీప, సుమిత్ర మధ్య ఎపిసోడ్స్, దీపపై పారిజాతం దొంగతనం మోపడం, బంటూ కుట్రలు నేపథ్యంగా ఎపిసోడ్స్ జరిగాయి. భర్త నర్సింహ వచ్చి దీపపై గొడవ చేయడం హైలెట్స్‌గా నిలిచాయి. ఈ సీరియల్‌లో మే 20వ తేదీ నుంచి మే 25వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

మే 20వ తేదీ 49వ ఎపిసోడ్‌లో
శౌర్యను స్కూల్‌లో చేర్పించడం చూసి కార్తీక్‌పై జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది. సొంత కూతురికి చేసినట్టు ఎలా సేవలు చేస్తున్నాడో అని కోపంలో ఉన్న ఆమెకు పారిజాతం మరింత రెచ్చ గొడుతుంది. అయితే తాను చేసిన పనికి కాంచన సీరియస్ అవుతూ.. ఇలా రెచ్చగొట్టి తీసుకొస్తావా అంటూ పారిజాతానికి క్లాస్ పీకుతుంది. అయితే కారులో శౌర్యను చూసి.. దీపతో.. నీ కూతురు వచ్చి.. స్కూల్‌లో జాయిన్ అవ్వానని చెబితే.. నీవు అవునా అన్నట్టు ఏమి తెలియనిలా అంటావు అని పారిజాతం సెటైర్ వేస్తుంది.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup May 21th to May 25th episode Story

అయితే శౌర్య వచ్చి అలాగే అనడంతో దీప షాక్ అవుతుంది. దాంతో పారిజాతం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడికి కార్తీక్ రావడంతో.. నా బిడ్డను స్కూల్‌లో జాయిన్ చేయడం వల్ల నేను అనేక మాటలు పడాల్సి వస్తున్నది అని దీప అంటే.. మీరు మాటలు పడటం ఎందుకు.. నీకు నోరు లేదా అని ప్రశ్నిస్తాడు.

మే 21వ తేదీ 50వ ఎపిసోడ్‌లో
ఆ స్కూల్‌లో శౌర్యను అంత ఫీజు కట్టి చదవించలేను. వేరే స్కూల్‌లో చేర్పిస్తాను అంటూ దీప అంటే.. నీవు ఫీజు కట్టాలని అనుకొంటున్న 1900 రూపాయలను చేతిలో నుంచి తీసుకొని.. ఓ డబ్బాలో 1000 రూపాయలు వేసి.. మిగితావి 900 ఆమె చేతిలో పెట్టి ఖర్చులకు ఉంచుకో అని దీపకు కార్తీక్ సలహా ఇస్తాడు. అన్ని డబ్బులు జమా అయిన తర్వాత నేను తీసుకొంటాను. దాంతో రౌడీని నేను చదివించాననే ఫీలింగ్ నీకు ఉండదు అని అంటాడు. అయితే 6 నెలల్లో నీ డబ్బు తీర్చేస్తాను అంటే.. 6 నెలల్లో తీర్చకపోతే నేను తీసుకోను అని కార్తీక్ షరతులు పెడుతాడు. ఇక స్కూల్‌లో తండ్రి పేరు కాలమ్‌లో కార్తీక్ పేరు ఉండటంపై నర్సింహా ఆగ్రహం వ్యక్తం చేస్తాను. గొడవ జరిగిన తర్వాత నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి నర్సింహా వెళ్లిపోతాడు.

మే 21వ తేదీ 51వ ఎపిసోడ్‌లో
తల్లి బాధను చూసిన శౌర్య.. నేను స్కూల్‌కు వెళ్లను.. నీకు సహాయంగా ఉంటాను అంటే.. లేదు.. నీవు చదువు మానేయకూడదు. కలెక్టర్ అవుతానని మాటిచ్చావు అంటూ దీప గుర్తు చేస్తుంది. దాంతో చదువు మానేయను అంటూ శౌర్య మాటిస్తుంది. ఇక కార్తీక్‌ను నిలదీస్తూ.. మీరు స్కూల్‌లో తండ్రిగా సంతకం చేయడం వల్లే ఇన్ని గొడవలు అని దీప అంటుంది. ఇదిలా ఉండగా.. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకొన్నావు. మొదటి భార్యపై చేయి చేసుకొన్నందుకు అరెస్ట్ చేస్తున్నామని నర్సింహకు పోలీసులు షాకిస్తారు. అయితే కొడుకును, భర్తను విడిపించుకొనేందుకు అనసూయ, శోభ పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup May 21th to May 25th episode Story

మే 22వ తేదీ 52వ ఎపిసోడ్‌లో
అయితే పోలీస్ స్టేషన్‌లో అనసూయ గొడవ చేస్తుంది. నా కొడుకును అరెస్ట్ చేయించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గంటలోపు నా కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి విడిపించకపోతే.. మిమ్మల్ని రోడ్డుపైకి లాగుతాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. అయితే గొడవలు, సమస్యలు మీవి. మాకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటి అంటూ దీపను పారిజాతం ప్రశ్నిస్తుంది. అయితే నర్సింహ అరెస్ట్ అయ్యాడా అంటూ దీప అడిగి.. అతడిని విడిపిద్దాం అని కార్తీక్‌ను అడిగితే..రెండు రోజులు జైల్లో ఉండనివ్వండి.. ఆ తర్వాత వాడికే బుద్ది వస్తుంది అని అంటాడు.

మే 23వ తేదీ 53వ ఎపిసోడ్‌లో

నర్సింహాను జైల్లో పెట్టడంతో అత్త అనసూయపై శోభ ఫైర్ అవుతుంది. గుట్టుగా ఉండే మా కాపురాన్ని ఇలా చేశావు అంటుంది. అంతలోనే కార్తీక్, దీప వచ్చి.. కేసు వాపసు తీసుకొంటున్నామని చెబుతాడు. అయితే పేపర్‌పై సంతకం చేస్తూ.. ఆలోచించుకోండి అని దీపను కార్తీక్ అడుగుతాడు. దాంతో సంతకం పెట్టు అని చెబుతుంది. దాంతో నర్సింహ రిలీజ్ అవుతూ.. నీ అంతు చూస్తానని కార్తీక్‌ను బెదిరిస్తాడు. కార్తీక్‌తో దీప పోలీస్ స్టేషన్‌కు రావడాన్ని చూసి నర్సింహ భరించలేకపోతాడు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly Roundup May 21th to May 25th episode Story

మే 24వ తేదీ 54వ ఎపిసోడ్‌లో

పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన నర్సింహను రెండో భార్య శోభ సూటి పోటి మాటలతో ఇబ్బంది పెడుతుంది. ఆ ఇద్దరు నీపై కేసు పెట్టి జైల్లో వేయించేందుకు ప్రయత్నించారు. నీకు ఏ మాత్రం పౌరుషం లేదా అని ప్రశ్నిస్తుంది. అయితే దెబ్బలతో బాధపడుతున్న కొడుకును చూసి.. పనిలోకి వెళ్లోద్దు అంటూ అనసూయ సలహా ఇస్తుంది. పనికి పోకపోతే ఇల్లు ఎలా గడుస్తుందంటూ శోభ ఫైర్ అవుతుంది. అంతలోనే చిలక అక్క కాఫీ తెచ్చి.. అసలు మీ ఇద్దరికి పెళ్లి కాలేదు అని అనుకొంటున్నారు అని అంటే నీవు కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావా అని నర్సింహ కోపగించుకొంటాడు. దాంతో జాగ్రత్తగా ఉంటూ.. మొదటి పెళ్లి పిస్టల్.. రెండో పెళ్లాం అరిటాకు అంటూ హెచ్చరించి చిలుక అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో దీపను ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదని కోపంతో ఊగిపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X