Karthika Deepam Weekly Roundup దీప కోసం తెగించిన కార్తీక్.. నర్సింహ చెంపలు వాయించిన సుమిత్ర
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. దీప, సుమిత్ర మధ్య ఎపిసోడ్స్, దీపపై పారిజాతం దొంగతనం మోపడం, బంటూ కుట్రలు నేపథ్యంగా ఎపిసోడ్స్ జరిగాయి. భర్త నర్సింహ వచ్చి దీపపై గొడవ చేయడం హైలెట్స్‌గా నిలిచాయి. ఈ సీరియల్‌లో మే 6వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
మే6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 37వ ఎపిసోడ్‌లో
కొడుకు నర్సింహ మరో పెళ్లి చేసుకోవడంతో అనసూయ షాక్ తింటుంది. రెండో కోడలు మెడలో నగలు చూసి ఆనంద పడుతుంది. శోభది తప్పులేదు.. తప్పంతా తన కొడుకుదే అని అనుకొంటుంది. ఒక దీపను చూసి.. నీకు కాపురం కావాలంటే.. వాడు కొట్టినా తిట్టినా ఇక్కడే ఉండాలని అంటుంది. దాంతో ఎక్కడికి వెళ్లాలి అంటే.. ఇంటికి వెళ్లు నఅి సమాధానం ఇస్తుంది. అయితే అప్పుల వాళ్ల సంగతేమిటి అంటూ దీప ప్రశ్నిస్తుంది. అప్పు చేసి నిన్ను నన్ను రోడ్డు మీద వదిలేశాడని దీప అంటుంది. అత్త అనసూయ అన్న మాటలకు దీప ఏడుస్తుంది. దీప పరిస్థితిని మెరుగుదిద్దేందుకు శివన్నారాయణ, కార్తీక్ నిర్ణయం తీసుకొంటారు

మే7 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 38వ ఎపిసోడ్‌లో
తన కొడుకు, రెండో కోడలిని వెనుకేసుకొని రావడంతో.. ఇప్పటి వరకు భర్త చేతిలో మోసపోయిన భార్యనే అనుకొన్నాను. కానీ అత్త చేతిలో కూడా మోసపోయిన కోడలిని. ఇక నాకు శౌర్య మాత్రమే దిక్కు అంటూ దీప ఆవేదన చెందుతుంది. ఊరికి వెళ్లడానికి బస్సు కోసం వేచి చూస్తుంటే.. ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. హోటల్ బిజినెస్‌లో నష్టం రావడంతో ఒంటికి వెళ్తున్నాని చెప్పడంతో.. నీ హోటల్ అలాగే నడుపు అంటూ దీప అతడికి ధైర్యం ఇస్తుంది. నేను సహాయం చేస్తానని భరోసా ఇస్తుంది. అయితే హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో జ్యోత్స్నతో కలిసి కాఫి తాగడానికి వచ్చి దీపను కార్తీక్ చూసి ఇంటికి తీసుకెళ్తాడు.
మే8 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 39వ ఎపిసోడ్‌లో
దీపతో మాట్లాడుతుంటే.. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫోన్ చేస్తే.. నేను ఆటోలో వెళ్లిపోతున్నానని చెప్పి విసుక్కొంటుంది. దీపను ఎలాగైనా ఇంటి నుంచి పంపించాలని అనుకొంటుంటే.. కార్తీక్‌తోపాటు ఆమె రావడం చూసి బంటూ షాక్ తింటాడు. అయితే నెక్లేస్ దొంగతనాన్ని దీప, శౌర్యపై పెట్టే ప్రయత్నం పారిజాతం చేస్తుంది. అయితే అలాంటి పని చేయదని సుమిత్ర వేనుకేసుకొస్తుంది. కానీ పారిజాతాన్ని జ్యోత్స్న సపోర్ట్ చేస్తుంది. అయితే తాను దొంగతనం చేయలేదని దీప కార్తీక్‌తో చెబుతూ దీప ఆవేదన చెందుతుంది.

మే 9 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 40వ ఎపిసోడ్‌లో
శౌర్యపై దొంగతనం మోపే పారిజాతం ప్రయత్నాలను శివన్నారాయణ అడ్డుకొంటాడు. నేను చైన్ ఇస్తేనే తీసుకోలేదు. అలాంటి పాప చైన్ దొంగతనం చేస్తుందా? అంటూ కోపం చేస్తాడు. అయితే గొలుసు బ్యాగ్‌లో దొరకడంతో బంటూ అంకుల్ పెట్టాడని శౌర్య చెబుతుంది. అయితే అసలు విషయం బయటపడటంతో అక్కడి నుంచి తప్పించుకోవాని చూసిన బంటును కార్తీక్ పట్టుకొంటాడు. శివ నారాయణ కూడా పారిజాతాన్ని మందలించడంతో ఆమె కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నీకు జ్యోత్స్న కుమధ్య ఏమైనా గొడవ జరిగిందా అని కార్తీక్‌ను సుమిత్ర అడుగుతుంది.
మే10 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 41వ ఎపిసోడ్‌లో
అయితే అంత పెద్దింటిలో ఉంటూ నా హోటల్‌లో ఎందుకు పనిచేస్తున్నావని దీపను బాబాయ్ అడుగుతాడు. అయితే నా అవసరం తీరేంత వరకు అక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉండి.. నా కూతుర్ని చదివించుకొంటాను. నేను ఊరికి వెళ్తానని బెంగ పెట్టుకోకు. హోటల్‌ను చక్కగా నడిపిస్తాను అంటూ దీప హామీ ఇస్తాను. అయితే నువ్వు ఎక్కడో పనిచేయటం ఎందుకు నిన్ను నేను చూసుకుంటాను అంటుంది సుమిత్ర. కానీ సుమిత్ర కి నచ్చ చెప్తుంది దీప. సరే అని లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర

మే 11 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 41వ ఎపిసోడ్‌లో
కార్తీక్ ఇంట్లో ఉన్న దీప వద్దకు వచ్చి నర్సింహ నానా హంగామా చేస్తాడు. అయితే నీవు అతడితో సంబంధం పెట్టుకొన్నావా? అంటూ కార్తీక్‌ను రెచ్చకొడుతాడు. దాంతో వచ్చి నర్సింహ మెడ పట్టుకొంటాడు. దీపను అవమానిస్తే.. చెంప పగలగొడతాడు. నా భార్యతో సంబంధం పెట్టుకొని నన్నే కొడుతావా? అంటూ ప్రశ్నిస్తే.. సుమిత్ర వచ్చి చెంప పగలకొడుతుంది. తన భార్యను తాను ప్రశ్నిస్తే.. ఎందుకు మధ్యలో దూరడం అని పారిజాతం అంటే.. వాడు దీపకు అన్యాయం చేశాడు. దీప ఉండగానే.. మరొకరిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. తనను వెతుక్కొంటూ వస్తే గానీ.. రెండో పెళ్లి గురించి తెలియలేదు అని సుమిత్ర అంది.ఊరికి వెళ్లకపోతే నీ సంగతి చూస్తాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ అక్కడి నుంచి నర్సింహ వెళ్లిపోయాడు. దాంతో అవమానం భరించలేక దీప అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయింది.


Click it and Unblock the Notifications











