Karthika Deepam Weekly Roundup: తన జన్మ రహస్యం తెలుసుకున్న జ్యోత్స్న.. కార్తీక్ సాయం కోరిన స్వప్న!

తెలుగు టెలివిజన్ సీరియల్‌ రంగంలో స్టార్ యాక్టర్లు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన కార్తీక దీపం 2 నవవసంతం మంచి స్పందన కూడగట్టుకుంటుంది.

ఇక ఆగస్టు 26 వ తేదీ నుంచి ఆగస్టు 31 వతేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

తన పెంపకం బాగోలేదు అని దాసు అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది సుమిత్ర, అదే విషయం కూతురుతో చెప్పి ఆమెని మందలిస్తుంది. అయితే దాసు పై కోపం తెచ్చుకున్న జ్యోత్స్న గొడవ పడటానికి వెళుతుంది కానీ అతను ఆమె జన్మ రహస్యం చెప్పడంతో షాకై ఇంటికి వస్తుంది. తర్వాత అలా చేసినందుకు పారిజాతానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది నిజం అందరికీ తెలిసే లోపుగా కార్తీక్ కి భార్య అయిపోవాలి అనుకుంటుంది జ్యోత్స్న. కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న శ్రీధర్ తన పెళ్లి కుదురుస్తాడు అది ఇష్టం లేని స్వప్న కార్తీక్ కి ఫోన్ చేసి ఈ పెళ్లి ఆపాలని లేదంటే చనిపోతానని బెదిరిస్తుంది. పెళ్లి యాప్ తనని మాట ఇస్తాడు కార్తీక్ మరోవైపు పంతులు పిలిచి దగ్గరలోనే పెళ్లి ముహూర్తం పెట్టిస్తుంది జ్యోత్స్న. మరోవైపు నువ్వు నీ భార్యని ఏమి చేయలేవు అని నర్సింహని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. మరోవైపు స్వప్న తండ్రితో అతను తెచ్చిన సంబంధం చేసుకోనని, కాశీ నే తను పెళ్లి చేసుకుంటానని కచ్చితంగా చెప్తుంది.

Karthika Deepam season 2 Telugu Serial Weekly roundupur September 2nd to September 7th episode Story

సెప్టెంబర్ 2 వ తేదీ 138 వ ఎపిసోడ్‌లో దాసు అన్న మాటలు జ్యోత్స్నతో చెప్పి ప్రవర్తన సరి చేసుకోమని చెప్తుంది సుమిత్ర. దాసు మీద కోపంతో అతనితో గొడవ పడటానికి వెళుతుంది జ్యోత్స్న. మరోవైపు అనసూయ, దీప ఊరు నుంచి తిరిగి వస్తుంటే దారిలో ఒక స్వామి కలిసి నీకు కష్టాలు ప్రారంభం అవ్వబోతున్నాయి, అయిన వాళ్ళ మధ్యలో అనాధగా బ్రతుకుతున్నావు అంటాడు. అనుమానం వచ్చిన దీప నా తల్లిదండ్రులు వేరే ఉన్నారా అని అనసూయ ని అడుగుతుంది. తమ్ముడికి మాట ఇవ్వటం చేత నిజం చెప్పదు అనసూయ అలాంటిదేమీ లేదు నా తమ్ముడు కూతురివే అంటుంది. మరోవైపు జ్యోత్స్న పుట్టిన ప్రదేశానికి తీసుకు వెళ్లిన దాసు ఆమె జన్మ రహస్యం చెప్తాడు. జ్యోత్స్న నమ్మకపోవటంతో నిన్ను మార్చేసింది మరెవరో కాదు మా అమ్మ అని దాసు అనటంతో మరింత షాక్ అవుతుంది జ్యోత్స్న.

సెప్టెంబర్ 3 తేదీ 139 వ ఎపిసోడ్‌లో దాసు చెప్పిన నిజాన్ని నమ్మలేక పోతుంది జ్యోత్స్న. కావాలంటే మా అమ్మని వెళ్లి అడుగు అంటాడు దాసు. అహంకారంతో ప్రవర్తించొద్దు నలుగురితో కలిసి నేల మీద నడువు అని ఆమెకి బుద్ధి చెప్తాడు. మరోవైపు దాసు వాళ్ల గురించి దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. నిజం మీ అమ్మగారికి తెలియకూడదు అందుకే వాళ్ళిద్దర్నీ కొన్ని రోజుల దూరంగా ఉండమనండి అంటుంది దీప. అంత సమయం లేదు అని స్వప్న పెళ్లి చూపులు విషయం చెప్తాడు కార్తీక్. ఇంటికి వచ్చిన జ్యోత్స్న పారిజాతాన్ని తన పుట్టుక గురించి అడుగుతుంది. పారిజాతం నిజమే అని చెప్పటంతో మంచి పని చేసావ్ అంటూ ఆమెని మెచ్చుకుంటుంది. ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని పారిజాతం అడిగితే దాసు నేనే చెప్పాను అంటూ అక్కడికి వస్తాడు. నీకు ఎలా తెలుసు అంటుంది పారిజాతం ఆ రోజు నేను అక్కడే ఉన్నాను అంటూ జరిగిందంతా చెప్తాడు దాసు.

Karthika Deepam season 2 Telugu Serial Weekly roundupur September 2nd to September 7th episode Story

సెప్టెంబర్ 4 వ తేదీ 140 వ ఎపిసోడ్‌లో నీకు తెలిసిన నిజం ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది పారిజాతం. అని నిజాలు చూసిన వాడికి ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది అంటాడు దాసు. మరి జాబ్స్ లకి ఎందుకు చెప్పావు అంటే తను పెరిగిన విధానం నాకు నచ్చలేదు,మనిషిలా మారుతుందని చెప్పాను అలాగే దశరథ్ అన్నయ్య కూతురు కూడా చనిపోలేదు ఆమెని వెతికి ఈ నిజం ఆమెకు కూడా చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. మరోవైపు కార్తీక్ కి ఫోన్ చేసిన స్వప్న నీతో అర్జెంటుగా మాట్లాడాలి దీప ఇంటికి వచ్చేయమని చెప్తుంది. తన తండ్రి అక్కడికి వస్తే నిజం తెలిసిపోతుందని కంగారు పడతాడు కార్తీక్. మరోవైపు ఇంట్లో నిజం తెలిసి తనని బయటికి గెంటేసేలోపు బావని పెళ్లి చేసుకోవాలి అంటుంది జ్యోత్స్న. తర్వాత తనతో ప్రేమగా మాట్లాడుతున్న తల్లిదండ్రులని చూసి నిజం తెలిస్తే నన్ను ఇంతగా ప్రేమించరేమో అని భయపడుతుంది ఆస్తి మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కూడా నాకు మీరే కావాలి అనుకుంటుంది.

సెప్టెంబర్ 5 వ తేదీ 141వ ఎపిసోడ్‌లో ఇల్లంతా కలియచూస్తూ ఈ ఇల్లు నాది అనుకుంటుంది జ్యోత్స్న. అనుకోకుండా అప్పుడే దీప రావటంతో ఇద్దరూ డ్యాష్ ఇచ్చుకుంటారు ఆమెని కసురుకొని పంపించేస్తుంది జ్యోత్స్న. తర్వాత దీప ఇంటికి స్వప్న రావటంతో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కార్తీక్ కూడా వచ్చి వాళ్లతో పెళ్లి మాటలు మాట్లాడుతాడు ఆ మాటలు చాటుగా విన్న జాబ్స్ న దీపా కార్తీక గురించి మాట్లాడుకుంటున్నారు అని అపోహ పడుతుంది. మరోవైపు శౌర్య సైకిల్ బోల్ట్ పీకి పారేసిన పారిజాతాన్ని మందలించి మళ్లీ ఆమె చేతే బోల్టు బిగింపచేస్తాడు శివ నారాయణ. మరోవైపు ఇల్లు తన పేరు మీద రాయమని అలాగే డబ్బులు కూడా తనకు ఇవ్వమని దీప ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటాడు నర్సింహ.

Karthika Deepam season 2 Telugu Serial Weekly roundupur September 2nd to September 7th episode Story

సెప్టెంబర్ 6 వ తేదీ 142 ఎపిసోడ్ లో ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న నరసింహని కత్తిపీట చూపించి బెదిరించి అక్కడ నుంచి పంపించేస్తారు అనసూయ, దీప. ఇదంతా శౌర్య పక్కనుంచి చూస్తుంది. మరోవైపు నర్సింహని కలిసిన జ్యోత్స్న దీపని ఏమి చేయలేవు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఏమైనా కేసు జరిగితే మీరు సాయం చేయండి అంటాడు నర్సింహ అందుకు ఒప్పుకుంటుంది దీప. మరోవైపు తండ్రిని చూసి భయపడటంతో అస్వస్థతకు గురవుతుంది శౌర్య. అనసూయ కి నిజం తెలుసు కాబట్టి దీప అని టాబ్లెట్ తెమ్మని చెప్పి శౌర్యకి వేస్తుంది. మరోవైపు నర్సింహ శోభతో మాట్లాడుతూ రేపు నేను చేయబోయే పనితో మన ఇద్దరి జాతకాలు మారిపోతాయి అంటాడు. ఏం చేయబోతున్నాడు అనుకుంటుంది శోభ. మరోవైపు కార్తీక్ వాళ్ళని ఇంటికి రప్పించి ఆదే సమయంలో ఎలా మాట్లాడాలో ముందే పంతులతో మాట్లాడి అతడిని కూడా రప్పిస్తుంది జ్యోత్స్న. ఎల్లుండి మంచి ముహూర్తం అంటాడు పంతులు. సమయం చాలదేమో అని అందరూ కంగారు పడుతుంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా పర్వాలేదు అంటుంది జ్యోత్స్న. మరోవైపు శౌర్య ద్వారా నర్సింహ వచ్చాడని తెలుసుకొని దీపతో మాట్లాడటానికి వెళ్తాడు కార్తీక్. వాళ్ళిద్దరూ నరసింహా గురించి మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన జ్యోత్స్న తన పెళ్లి విషయం మాట్లాడుతుంది.

సెప్టెంబర్ 7 వ తేదీ 143వ ఎపిసోడ్ లో మీ పెళ్లికి వంట నేనే చేస్తాను అని దీప అనటంతో అన్ని పనులు నువ్వే చేయాలి అంటుంది జ్యోత్స్న. మనసులో మాత్రం ఈ పెళ్లి ఆపటానికి నువ్వు ట్రై చేస్తావని తెలుసు కానీ అప్పటివరకు నువ్వు బ్రతికి ఉండవు అనుకుంటుంది. తండ్రి తెచ్చిన సంబంధం చేసుకోనని కాశీనే చేసుకుంటానని స్వప్న మొండికేస్తుంది. ఎలాగైనా నేను తెచ్చిన సంబంధమే చేస్తాను అని శ్రీధర్ కూడా మొండికేస్తాడు. మరోవైపు తనని బెదిరిస్తున్న శోభతో నా బ్రతుకు ఇలా అవటానికి కారణమైన వాళ్ళందరి అంటూ చూస్తాను అంటూ శోభ పై కోప్పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. వీడి ఆవేశం చూస్తే ఏదో చేసే లాగే ఉన్నాడు అనుకుంటుంది శోభ. మరోవైపు ఇంటికి వచ్చిన తండ్రి తో రాఖీ పండక్కి రాలేనందుకు పెళ్లి మాటలప్పుడు పక్కన లేనందుకు అత్త వాళ్లు బాధపడ్డారు మనకి బంధాలు దేవుడిచ్చిన వరం వాటిని నిలబెట్టుకోవడం మన చేతిలోనే ఉంటుంది అంటూ క్లాస్ ఇస్తాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న బ్యాచిలర్ పార్టీకి రమ్మనడంతో బయలుదేరిన కార్తీక్ కి దారిలో దీప కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు అంటే కేటరింగ్ కుదిరింది వంటలు చేయడానికి వెళుతున్నాను అంటుంది దీప నేను ఆదారిలోనే వెళ్తున్నాను అని దీప ని ఆమె పనిచేయవలసిన ప్లేస్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు కార్తీక్. తరువాత దీప ఫోన్ కారులోనే మర్చిపోయిందని గ్రహించి తిరిగి ఆ ఫోన్ ఆమెకి ఇవ్వటానికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X