Karthika Deepam Sept 10th episode మోనితను పిస్టల్‌తో షూట్ చేసిన దీప.. కోర్టు బోనులో కార్తీక్
కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్టు చోటుచుకొన్నది. మోనిత హత్య కేసులో కార్తీక్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. హత్యకేసు విచారణ జరుగుతుండగా .. దీపను మోనిత కిడ్నాప్ చేసుకొని ఊరి బయట ఉన్న పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లింది. కోర్టులో, మోనిత ఇంటిలో హైడ్రామాకు తెర లేచింది. తాజా ఎపిసోడ్ 1141లో ఏం జరిగిందంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

నా చేతిలో చావడానికే అంటూ..
నా కారును అంతగా వెంబడించి ఉన్నట్టుంది దారిలో ఎందుకు అక్కడే ఆగిపోయింది. ఏదైతే ఏంటి? నాచేతిలో చావడానికే ఆగిపోయినట్టు ఉంది అని అనుకొంటుండగా.. వారణాసి కారులో పెట్రోల్ పోస్టుంటే .. అదా సంగతి.. కారులో పెట్రోల్ అయిపోయిందా? కారులోనే పెట్రోల్ కాదు.. గొంతులో ప్రాణాలు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని మోనిత అంటూ దీపవైపు అడుగులు వేసింది.

దీప తలకు పిస్టల్ పెట్టి
దీప ఆలోచనల్లో ఉండగా వెనుక నుంచి వచ్చి నుదుటికి పిస్టల్ గురిపెట్టింది. దాంతో కదిలేందుకు దీప ప్రయత్నించగా.. కదిలితే కాల్చిపడేస్తాను అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత కారెక్కు అంటూ దీపకు వార్నింగ్ ఇవ్వగా ఎక్కడికి అంటే.. నరకానికి అంటూ కఠినంగా మోనిత జవాబిచ్చింది. దాంతో వారణాసి అని పిలిచింది. దాంతో అక్కా అంటూ పరుగెత్తుకొచ్చాడు. దగ్గరికి వస్తే.. మీ అక్కను కాల్చిపడేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది.

కదిలితే కాల్చిపడేస్తాను
మోనితను కారులోకి తోసింది. వారణాసికి వార్నింగ్ ఇస్తూ.. కారు డ్రైవర్ సీటులో కూర్చో అని చెప్పింది. అతి తెలివితేటలకు పోయి కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే.. మీ అక్కను కాల్చిపడేస్తాను. తుపాకి పేలిస్తే మెదడు చిట్లి పోతుంది అంటూ హెచ్చరించింది. దాంతో నీవు నన్ను ఇంకా ఏం చేయాలనుకొంటున్నావు? అని దీప ప్రశ్నించింది. అయితే నీ మొగుడు కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. కోర్టులో లొంగిపోతే జైలు నుంచి బయటకు వస్తాడు అంటూ మోనిత తనదైన శైలిలో చెప్పింది.

నా పెళ్లికి నీవే అడ్డు అంటూ
ఇప్పటికే కార్తీక్‌ను కోర్టుకు తీసుకెళ్లి ఉంటారు. నా పెళ్లి వాయిదా పడిందంటే నీవే కారణం. నీవు చస్తే నా పెళ్లికి ఏది అడ్డు ఉండదు. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత నా కడుపులో బిడ్డ కోసం తాళి కడుతాడు. కాబట్టి నువ్వు చచ్చిపో అంటూ మోనిత పకపకా నవ్వుతూ దీప తలకు పిస్టల్ గురిపెట్టింది.

ఏసీపీ రోషిణిపై ప్రశ్నల వర్షం
ఇదిలా ఉండగా, కార్తీక్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. మోనితను కార్తీక్ హత్య చేశాడంటూ అభియోగాలు మోపారు. అయితే నీవు ఈ హత్య చేశావా? అంటే కార్తీక్ తాను హత్య చేయలేదని సమాధానం చెప్పారు. దాంతో కార్తీక్ తరుఫు న్యాయవాది ఏసీపీ రోషిణిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హత్య జరిగినప్పుడు సాక్ష్యులు ఉన్నారా? సాక్షులు లేకుండా హత్య జరిగిందని ఎలా అభియోగాలు మోపుతారని ప్రశ్నించారు.
Recommended Video

మోనితను షూట్ చేసిన దీప
అయితే తాజా కార్తీకదీపం ప్రోమోలో భారీ ట్విస్టు ఇచ్చారు. తన తలకు గురిపెట్టిన మోనిత దృష్టిని పక్కకు మరల్చి. పిస్లల్‌ను మోనిత చేతిలో నుంచి చాకచక్యంగా లాగేసుకొన్నది. మోనితపై పిస్టల్ గురిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సీరియల్ కథ మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











