For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Sept 13th episode: దీప చేతిలో పిస్టల్.. ప్రాణభయంతో వణికిన మోనిత.. చివరకు ఏం జరిగిందంటే?

  |

  తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక టీఆర్పీ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో కోర్టు డ్రామా, అలాగే మోనిత, దీప మధ్య ఎత్తులు పై ఎత్తుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజా 1143 ఎపిసోడ్‌లో పూర్తిగా హైడ్రామా కనిపించింది. మోనిత, దీప ఎమోషనల్‌గా కనిపించారు. కోర్టులో కార్తీక్ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. సెప్టెంబర్ 13న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  దీప కనిపించకపోవడంపై కార్తీక్ టెన్షన్

  దీప కనిపించకపోవడంపై కార్తీక్ టెన్షన్

  కోర్టు విచారణ సందర్భంగా కార్తీక్‌కు తన కుటుంబ సభ్యులు ఓదార్పు ఇచ్చారు. అయితే కార్తీక్ మాత్రం దీప మాయమవ్వడం గురించి ఆందోళన చెందడం చూసి తల్లి సౌందర్య ధైర్యం చెప్పింది. మోనితను పట్టి తెచ్చేందుకు ఎంతకైనా తెగిస్తుంది. భర్తను కాపాడుకొనేందుకు భార్య ఎంతవరకు వెళ్లేందుకైనా సిద్దపడుతుంది. అదే దీపలో కనిపిస్తున్నది అని సౌందర్య అన్నారు.

  కార్తీక్‌కు కఠిన శిక్షను విధించండి అంటూ

  కార్తీక్‌కు కఠిన శిక్షను విధించండి అంటూ

  ఇదిలా ఉండగా, కార్తీక్‌ను కోర్టులో మరోసారి ప్రవేశపెట్టారు. కార్తీక్ వ్యతిరేకంగా వాదిస్తూ లాయర్.. పవిత్రమైన డాక్టర్ ముసుగులో ఘోరానికి పాల్పడ్డారు. సాటి డాక్టర్‌ మోనితను మోసగించడమే కాకుండా గర్బవతిని చేసి, చంపి, శవాన్ని మాయం చేశాడు కాబట్టి కఠిన కారాగార శిక్ష విధించండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూ కోర్టుకు చెప్పడంతో కార్తీక్‌‌ కుటుంబం షాక్ గురైంది. దాంతో ఏమైనా చెప్పుకొంటారా? అంటూ కార్తీక్‌ను న్యాయమూర్తి కోరారు.

  నా కాపురంలో మోనిత చిచ్చు

  నా కాపురంలో మోనిత చిచ్చు

  న్యాయమూర్తి సూచన మేరకు తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు చెప్పారు. గౌరవప్రద కుటుంబంలో పుట్టాను. దీపను ఆదర్శ వివాహం చేసుకొన్నాను. మోనిత నా స్నేహాన్ని అడ్డుపెట్టుకొని నా కాపురంలో చిచ్చు పెట్టింది. నన్ను నా భార్యను విడదీసింది. తన స్నేహానికి అందంగా ప్రేమ అనే ముద్ర వేసుకొన్నది. నేను రియలైజ్ అయి నా భార్య కాళ్లకు మొక్కి నేను ఇంటికి తీసుకు వచ్చాను. కానీ మోనిత కృత్రిమ గర్బధారణతో పెళ్లి చేసుకొమని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. నేను కోపంతో చంపాలని ఆమె ఇంటికి వెళ్లాను. కానీ నా వివేకం నా కోపాన్ని చల్లార్చింది. కానీ నేను చంపలేదు. తాను మోనితను చంపానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినట్టు కాక.. ఆమె బతికే ఉంది అంటూ న్యాయమూర్తికి కార్తీక్ చెప్పారు. దాంతో కోర్టు హాల్‌ నిశ్శబ్దంగా మారింది.

  దీప, మోనిత మధ్య హైడ్రామా

  దీప, మోనిత మధ్య హైడ్రామా

  ఇక మోనిత ఉంటున్న పాడబడ్డ ఇంటిలో హైడ్రామా చోటుచేసుకొన్నది. తనను చంపడానికి తుపాకి గురిపెట్టిన మోనిత నుంచి పిస్టల్‌ను చాకచక్యంగా దీప లాగేసుకొన్నది. నా కళ్లలో చావు భయం చూడాలనుకొని ఇక్కడకు తీసుకొచ్చావు. నా తెగింపు చూశావా అంటూ మోనితకు తుపాకి గురిపెట్టింది. ఇప్పుడు నేను నీ కళ్లల్లో ప్రాణభయాన్ని నా కళ్లారా చూస్తున్నాను. నీ చావు నా చేతిలోనే దాచిపెట్టి ఉంది అని పిస్టల్ గురిపెట్టింది. దాంతో దీప భయంతో వణికిపోయింది. తనను చంపవద్దని ప్రాణభయంతో వణికిపోయింది. కార్తీక్ నన్ను చంపినా ఆయనకు జీవిత ఖైదు పడేది. నీవు నన్ను చంపినా నీకు జీవిత ఖైదు పడుతుంది. ఇవేమి లేకుండా దీనికి పరిష్కారం చూసుకొందాం అని మోనిత ప్రాధేయపడింది.

   చావు భయంతో వణికిపోయిన మోనిత

  చావు భయంతో వణికిపోయిన మోనిత

  మోనిత చావు భయంతో వణికిపోతుంటే.. దీప రెచ్చిపోయింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం నా భర్తతో నీకు పెళ్లి చేయాలా? ఈ సమస్యకు అసలు కారణం నువ్వే. అందుకే నీవు చస్తే ఈ సమస్య తీరిపోతుంది. నీవు నా చేతిలో చచ్చిపో అంటూ పిస్టల్ గురిపెట్టింది. దాంతో నేను చచ్చిపోతే.. నేను ఒక్కదానినే పోను. నా కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోతుంది అని మోనిత అనగానే దీప కరిగిపోయింది. దీప మానవత్వంతో ఆలోచిస్తుండగా.. మంచి అస్త్రం ఉపయోగించాను. ఇక నన్ను కాల్చదు అంటూ మోనిత మనసులో అనుకొంటూ.. నీవు ఇద్దరు బిడ్డలను కన్నావు.. కనీ వాళ్లు పదేళ్లు తల్లిదండ్రులకు దూరంగా పెరిగారు. అలాగే నా బిడ్డ కూడా తండ్రికి దూరంగా అనాథగా పెరగాలా? పదేళ్లు నీ బిడ్డలకు తండ్రి ఎవరో చెప్పకుండా బాధపడ్డావు అని మోనిత డ్రామా ఆడింది.

  కోర్టులో లొంగిపోతాను అంటూ మోనిత

  కోర్టులో లొంగిపోతాను అంటూ మోనిత

  కానీ మోనిత డ్రామాను వెంటనే గ్రహించిన దీప.. ఆపవే.. నీవే కృత్రిమ గర్భం తెచ్చుకొని నాటకం ఆడుతున్నావు అంటే.. నేను ఏం చేసినా.. కార్తీక్ కోసమే.. నా గర్బంలో పెరిగేది.. కార్తీక్ అంశం కాదా? ఇక ఎలాంటి నాటకాలు ఆడను. నేరుగా కోర్టులో లొంగిపోతాను. కార్తీక్‌ను ఈ కేసు నుంచి విడిపిస్తాను అంటూ మోనిత అంటే.. ఇప్పుడు వస్తవా? కోర్టులో లొంగిపోతావా? అంటే తప్పకుండా విడిపిస్తాను అంటూ మోనిత చెప్పింది.

  Bigg Boss Telugu 5 Episode 6 Analysis: Priyanka Singh - Uma Devi's Fight || Filmibeat Telugu
  దీప చేతిలో పిస్టల్ పక్కన పడేసి..

  దీప చేతిలో పిస్టల్ పక్కన పడేసి..

  దీపతో మోనిత ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. మీరంతా ఉన్నతమైన మనస్తత్వం ఉన్న వాళ్లు. కార్తీక్ భార్యగా నీవు ఉన్నతమైన వ్యక్తివే. నన్ను కార్తీక్ రెండుసార్లు పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. పదహారేళ్లు ఆశలు కల్పిస్తే.. పిచ్చిదానిలా ప్రేమించాను. నా కార్తీక్ నన్ను మోసం చేశాడు. అయినా సరే నా కార్తీక్ నా మూలంగా జైలుకు వెళ్లకూడదు. అప్పటికి ఆ పిచ్చివాడికి చెప్పాను.. నా మెడలో తాళి కట్టు.. నేను జైలుకు వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు కోర్టు బోనులో నిలబడ్డాడు అని మోనిత చెప్పింది. నన్ను ఎలాగైనా రోషిణి పట్టుకొంటుంది. ఇక నేను ఈ విషయంలో నేను పరుగెత్తలేను. లొంగిపోతాను అంటూ మోనిత ఎమోషనల్ అయినట్టు కనిపించింది. దాంతో దీప తన చేతిలోని పిస్టల్‌ను పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు కనిపించింది. కానీ మోనిత పిస్టల్ పడేసిన వైపు వెళ్తూ కనిపించడంతో మరో ట్విస్టు ఉంటుందా అనే ఆసక్తి కలుగుతున్నది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

  English summary
  Karthika Deepam September 13th Episode preview. Karthik was produceద in the court. High drama took in place between Monita and Deepa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X