Karthika Deepam Sept 14th: కార్తీకదీపం సీరియల్‌లో బిగ్ ట్విస్ట్.. ఇంకా శుభం కార్డు పడలేదని మోనిత వార్నింగ్

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత హత్య కేసులో విచారణ కొనసాగింది. మోనిత బతికే ఉందనే వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంగీకరించలేదు. ఏసీపీ రోషిణి కూడా కార్తీక్, దీప వాదనను కొట్టి పడేసింది. భర్త కేసులో ఇరుక్కుపోవడంతో దీప మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే వారిద్దరూ మోనిత బతికే ఉందని భ్రమ పడుతున్నారంటూ ఏసీపీ రోషిణి కొట్టిపడేసింది. దాంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణ ముగిసింది. నిందితుడు వృతి, కుటుంబ నేపథ్యం బాగానే ఉన్నప్పటికీ.. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కులేదంటూ తీర్పు ఇస్తుండగా, దీప కోర్టులో ఎంట్రీ ఇచ్చి భారీ ట్విస్టు ఇచ్చింది. అయితే ఆ ట్విస్టు ఏమిటంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

దీపను కొనియాడిని సౌందర్య దంపతులు

దీపను కొనియాడిని సౌందర్య దంపతులు

మోనిత హత్య కేసులో కార్తీక్‌కు శిక్ష విధించేందుకు సిద్దమవుతుండగా దీప కోర్టు హాల్‌లోకి ప్రవేశించి న్యాయమూర్తిని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరింది. తాను కార్తీక్ భార్య దీపను. ఈ కేసులో కీలక సాక్షిని అనుమతించండి అంటూ ద్వారం వైపు చూడటంతో మోనిత ప్రత్యక్షం కావడంతో కోర్టులో ఉన్న వారంతా షాక్ గురయ్యారు. కార్తీక్ కుటుంబ సభ్యుల్లో ఆనందం విరిసింది. దీపను కార్తీక్ తల్లిదండ్రులు, సోదరుడు అభినందించారు. మా ఇంటి ఇలవేల్పు అంటూ కొనియాడారు. కోర్టు అనే విషయాన్ని మరచిపోయి దీపను ప్రశంసిస్తుంటే న్యాయమూర్తి హెచ్చరించారు.

కోర్టు హాల్‌లోకి మోనిత ప్రవేశించడంతో

కోర్టు హాల్‌లోకి మోనిత ప్రవేశించడంతో

కోర్టు హాల్‌లోకి ప్రవేశించిన మోనిత.. నమస్కారం మీ లార్డ్. బోనులోకి వెళ్లి నేను మోనితను. డాక్టర్ మోనితను, కార్తీక్ ఇన్నాళ్లు చంపారనే భావిస్తున్న మోనితను నేను. కార్తీక్ నిరపరాధి అంటూ చెబుతుంటే.. ఇన్నాళ్లు ఎందుకు దాచుకొన్నావు అని అడిగితే.. కార్తీక్‌పై ఉన్న ద్వేషంతో కాదు ప్రేమ వల్లనే. అతడికి రెండో భార్యను కావాలనుకొన్నాను. అలాగే అతడి ద్వారా బిడ్డ కావాలనుకొన్నాను. కానీ నా ప్రేమే నాకు శాపం అయింది. మంచి, చెడు ఆలోచించే స్థాయిని మించిపోయేలా చేసింది. నేను చనిపోయినానని నాటకం ఆడి.. అరెస్ట్ చేయించాను. ఆ తర్వాత నేను లొంగిపోతాను. కానీ నన్ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాను. కానీ నాకు కార్తీక్ లొంగిపోలేదు. ఇప్పటికీ నా ప్రేమను కార్తీక్ అంగీకరించడం లేదు. అందుకే నేను లొంగిపోయాను అంటూ మోనిత చెప్పింది.

ఏసీపీ రోషిణికి న్యాయమూర్తి చివాట్లు

ఏసీపీ రోషిణికి న్యాయమూర్తి చివాట్లు

ఏసీపీ రోషిణిని న్యాయమూర్తి మందలించాడు. ఏదైనా కేసులో సమాజంలోని ప్రముఖులను అరెస్ట్ చేసినప్పుడు వారి నేర చరిత్రను ఓసారి చూడాల్సి ఉంటుంది. అలా చేయకుండా కార్తీక్‌ను అరెస్ట్ చేసినందున పోలీస్ శాఖ సరైన విచారణ చేయలేదని స్పష్టమైంది. అందుకు పోలీస్ శాఖను మందలిస్తున్నాను. మోనితను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణకు హాజరు పరచాలని కోర్టు ఆదేశిస్తున్నది. ఈ కేసులో నిరపరాధిగా భావించి కార్తీక్‌ను విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం. మోనితను కోర్టుకు తీసుకొచ్చినందున దీపను అభినందిస్తున్నాం అంటూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

కార్తీక్ నిరపరాధి అంటూ

కార్తీక్ నిరపరాధి అంటూ

కార్తీక్ నిరపరాధి అని తేలడంతో కార్తీక్ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలారు. కార్తీక్, దీపను సౌందర్య, ఆనందరావు ముద్దుల్లో ముంచెత్తారు. అయితే మోనిత వారి సంతోషానికి అడ్డుపడుతూ.. కేసు ముగియలేదు. నాకు పెద్దగా శిక్ష పడుతుందని అనుకోను. త్వరలోనే విడుదల అవుతాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటపడుతుంది. అప్పుడు కార్తీక్ నన్ను పెళ్లి చేసుకోక తప్పదు. ఇంకా కేసుకు శుభం కార్డు పడలేదు. మళ్లీ వస్తానని హెచ్చరించింది.

పోలీసుల అదుపులో మోనిత..

పోలీసుల అదుపులో మోనిత..

మోనితను అదుపులోకి తీసుకొన్న ఏసీపీ రోషిణి విచారణ ప్రారంభించింది. మేకవన్నె పులివి. నీకు ఏదో అన్యాయం జరిగిందని బాధపడిపోయాను. కానీ నీ వ్యవహారం చూస్తుంటే.. కార్తీక్‌పై సానుభూతి పెరుగుతున్నది. అతడి కష్టం కనిపిస్తున్నది. అతడి ఫ్యామిలీ కనిపిస్తున్నది అని ఏసీపీ రోషిణి అంటే.. నాకు కేవలం కార్తీక్ మాత్రమే కనిపిస్తున్నాడు. అతడిపై పిచ్చి ప్రేమ కనిపిస్తున్నది. కార్తీక్ అంటే అంత పిచ్చి అంటూ మోనిత చెప్పింది. దాంతో ఇక నీతో ఇప్పుడు మాట్లాడేది లేదు. రేపు మాట్లాడుకొందాం అని మోనితను లాకప్‌లోకి పంపించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
కార్తీక్ కుటుంబంలో ఆనందం

కార్తీక్ కుటుంబంలో ఆనందం


మోనిత కేసులో కార్తీక్ నిరపరాధిగా రుజువు అవ్వడంతో ఇంటి సభ్యుల్లో సంతోషం పొంగిపోర్లింది. హిమ, శౌర్య ఆనందానికి అవదులు లేవు. తండ్రితో కలిసి ఆనందాన్ని పంచుకొన్నారు. అనేక ప్రశ్నలతో కార్తీక్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తే దీప వారించింది. అలా కార్తీక్ జీవితంలో ఓ కీలక మలుపు చోటు చేసుకోవడంతో హ్యాపీ మూమెంట్స్ నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X