For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Sept 15th: భయంతో విదేశాలకు వెళ్లాలని కార్తీక్ నిర్ణయం.. దీపపై మోనిత మరో కుట్ర!

  |

  మోనిత హత్య కేసులో నిర్ధోషిగా కార్తీక్ బయటపడటంతో ఆయన కుటుంబంలో ఆనందం నెలకొన్నది. కూతుళ్లు హిమ, శౌర్యతోపాటు తల్లిదండ్రులు సౌందర్య, ఆనందరావుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి సంతోషాల మధ్య కార్తీక్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు మోనిత సిద్దమైంది. లాకప్‌లో ఉంటూనే కార్తీక్‌ను మళ్లీ ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అయింది. ఇంకా తాజా ఎపిసోడ్ అంటే సెప్టెంబర్ 15వ తేదీన ప్రసారమైన 1145 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  మోనిత ఉన్నంత కాలం అమావాస్యే

  మోనిత ఉన్నంత కాలం అమావాస్యే

  జైలు నుంచి విడుదలైన కార్తీక్‌ను చూసి హిమ, శౌర్య ఆనందపడిపోయారు. తండ్రి తమ వద్దకు రావడంతో హ్యపీగా ఫీలవుతూ నాన్నతో ఆడుకొన్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసి ఆనందరావు సంబరపడిపోయాడు. అదే విషయాన్ని భార్య సౌందర్యతో పంచుకొన్నారు. ఇక వాళ్ల కష్టాలు తీరినట్టే అనిపిస్తున్నాయి. అమావాస్య పోయి పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి తర్వాత మళ్లీ వచ్చేది అమావాస్య అని సౌందర్య ఆందోళన చెందింది. మోనిత ఉన్నంత కాలం అమావాస్యే అంటే ఆనందరావు కంగారుపడ్డారు.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  కార్తీక్ ప్రమేయం లేకుండా గర్భం

  కార్తీక్ ప్రమేయం లేకుండా గర్భం

  మోనిత జైలుకు వెళ్తుంది కదా.. మళ్లీ నీవు భయపడటం ఎందుకు అంటూ ఆనందరావు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దాంతో మోనిత ఉన్నంత కాలం కార్తీక్‌కు ఇబ్బంది పెడుతుంది. కడుపుతో ఉన్నాను. మళ్లీ వస్తానని హెచ్చరించింది. మోనిత నిండా రాక్షసత్వమే ఉంది. అది తలుచుకొంటే ఎంతకైనా దిగజారింది. కార్తీక్ ప్రమేయం లేకపోయినా కడుపు తెచ్చుకొని వాడిని పిచ్చివాడిని చేసింది.

  దీప నమ్మకపోవడం వల్లే పెద్ద ప్రమాదం తప్పింది. దీప నమ్మి ఉంటే కార్తీక్ పరిస్థితి ఏమై ఉండేదో. పైన కనిపించిన దృశ్యం కనిపించేదా. మళ్లీ బిడ్డతో మన ఇంట్లో అడుగుపెట్టదన్న నమ్మకం ఏమిటి? అంటూ సౌందర్య ఆందోళన వ్యక్తం చేసింది.

  మెగాస్టార్, సూపర్ స్టార్స్ వాడుతున్న ఖరీదైన, విలాసవంతమైన కార్లు ఇవే..

  అమెరికాకు వెళ్లిపోవాలని కార్తీక్ నిర్ణయం

  అమెరికాకు వెళ్లిపోవాలని కార్తీక్ నిర్ణయం

  కార్తీక్‌ను హిమ, శౌర్య ప్రశ్నలతో హోర్తెత్తించారు. నాన్న మనం దూరంగా వెళ్లిపోదామని చెప్పవుగా.. ఎప్పుడు వెళ్దాం నాన్న అంటూ.. వెళ్లిపోదాం అంటూ కార్తీక్ చెప్పారు. అయితే ఎక్కడికి వెళ్లేది.. వాళ్లేదో అంటే మీరు కూడా వెళ్దాం అంటున్నారు అని దీప అడిగితే.. అవును దీప.. నిజంగానే వెళ్దామని అనుకొంటున్నాను. దీపతో చేసిన సావాసం వల్ల నా పేరు, ప్రతిష్టలు దెబ్బ తిన్నాయి.

  ఇక ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు తెలుసు అని కార్తీక్ అంటే.. మోనితకు భయపడి వెళ్లిపోదామని అనుకొంటున్నారా? అంటే.. కాదు ఆమెతో చిరాకు పడి అలాంటి నిర్ణయం తీసుకొన్నాను అని కార్తీక్ చెప్పాడు. దూరంగా ఉండండి.. దూరంగా వెళ్లకండి అంటూ దీప అంటే.. మోనిత నన్ను వదిలిపెట్టదు అంటూ కార్తీక్ అన్నారు.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  మోనితకు వీసా రాదు.. నాకు చికాకు ఉండదంటూ

  మోనితకు వీసా రాదు.. నాకు చికాకు ఉండదంటూ

  అయితే దీప, కార్తీక్ వాదన చూసి సౌందర్య వచ్చి ఏదో తీవ్రంగా చర్చించుకొంటున్నట్టు ఉంది అని అడిగితే.. మోనితకు దూరంగా వెళ్లిపోదామని అనుకొంటున్నాడు అని దీప చెప్పింది. దాంతో ఎక్కడికి వెళ్దామని అనుకొంటున్నావు అంటే.. అమెరికాకు అని తల్లికి కార్తీక్ సమాధానం చెప్పాడు. ఎలాగూ మోనిత జైలుకు వెళ్లింది కాబట్టి.. ఆమెకు వీసా రాదు. చచ్చే వరకు ఇక్కడే పడి ఉంటుంది. కాబట్టి నాకు ఆమె వల్ల చిరాకు ఉండదు అని కార్తీక్ చెప్పాడు. దాంతో అది కరెక్ట్ కాదు కార్తీక్ అంటూ దీప అంది.

  మోనితపై ఇంకా జాలి పడుతున్నావా?

  మోనితపై ఇంకా జాలి పడుతున్నావా?

  తనను బంధించి తీసుకెళ్లినప్పుడు మోనిత చెప్పిన విషయాలు చెప్పి స్త్రీగా నాకు ఏదో జాలి కలిగింది అని దీప అంటే.. ఎందుకు దాని వల్ల జాలి ఎందుకు.. నాకు అంత క్షోభ పెట్టినందుకు కాల్చిపారేయాల్సింది. బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది అంటే.. నీ కంటే నేను ఎక్కువగా నష్టపోయాను అంటూ దీప చెప్పింది. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డతో అసలు సమస్య మొదలైంది అంటూ సౌందర్య తన మనసులో అనుకొన్నది.

  లాకప్‌ నుంచే మోనిత కుట్ర

  లాకప్‌ నుంచే మోనిత కుట్ర

  ఇక జైలులో ఉన్న మోనిత మళ్లీ కుట్రలు మొదలుపెట్టింది. కానిస్టేబుల్‌ను పిలిచి కార్తీక్ గురించిన ఏదో కుట్రను చెబితే తాను చేయలేనని రత్నసీత చెప్పింది. అయితే ఎందుకు పిరికిదానిలా భయపడుతావు. పిరికి తనం ఆరోగ్యానికి హానికరం. ధైర్యంగా ఉంటే ఏదైనా చేయాలి. తప్పు ఒప్పు చెప్పాలంటే మనసు రావాలి. మీకు ఆ మనసు లేదని అంటే నాపై సెటైరా అంటూ మోనిత నవ్వింది. నేను చెప్పిన పని చేసి నాకు మళ్లీ కనిపించు అంటూ మోనిత ఆర్డర్ వేసింది.

  రత్నసీత తెచ్చిన బ్యాగ్‌‌తో కార్తీక్ కంగారు

  రత్నసీత తెచ్చిన బ్యాగ్‌‌తో కార్తీక్ కంగారు

  మోనిత కుట్రలో భాగంగా రత్నసీత కార్తీక్ ఇంటికి వెళ్లింది. దీపను కలిసి నేను కార్తీక్‌ను కలువడానికి వచ్చానని చెప్పింది. అయితే కార్తీక్‌ను పిలవడానికి వెళ్లిన సమయంలో దీప మొబైల్ ఫోన్‌లో ఉన్న దుర్గను మోనిత బెదిరించిన వీడియోను డిలీట్ చేసింది. ఆ తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోతుంటే బ్యాగ్ ఇవ్వడానికి ప్రయతిస్తే.. ఏమిటని కార్తీక్ అడిగాడు. అయితే తాను ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకొని మోనిత ఇది ఇవ్వమని చెప్పిందంటూ ఓ బ్యాగ్‌ను వారి ముందు పెట్టింది. దానిని చూసి కార్తీక్ కుటుంబం కంగారుపడిపోయింది.

  English summary
  Karthika Deepam September 15th Episode: Karthik want migrate to US but Deepa opposes. Monita attempt another conspiracy against Karthik and Deepa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X