For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Sept 17th episode: మోనిత చెంప పగలకొట్టబోయిన సౌందర్య.. కోర్టులో ఏం జరిగిందంటే!

  |

  అత్యంత టాప్ రేటింగ్‌ను అందుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌లో మోనిత ఆగడాలు, అత్యుత్సాహం, కుట్రపూరిత వ్యవహారం కథకు హైలెట్‌గా మారడమే కాకుండా అనేక మలుపులకు కారణం అవుతున్నది. ప్రస్తుతం లాకప్‌లో ఉన్న ఆమెను ఏసీపీ రోషిణి కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగా మోనిత అందరి చేత చివాట్లు తింటూ కనిపించింది. తాజా ఎపిసోడ్ 1147లో ఏం జరిగిందంటే..

  Gully Rowdy Movie Review: సందీప్ కిషన్ మూవీ ఎలా ఉందంటే!

  కేడీ లేడిని కోర్టుకు తీసుకెళ్లాలి అంటూ

  కేడీ లేడిని కోర్టుకు తీసుకెళ్లాలి అంటూ

  మోనిత కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ రోషిణి.. రత్నసీత.. కేడీ లేడిని కోర్టు తీసుకెళ్లాలి గుర్తుందా అంటూ ప్రశ్నించింది. దాంతో గుర్తు ఉంది మేడమ్.. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాను అంటూ బదులిచ్చింది. ఏసీపీ వెళ్లిపోతుంటే.. మోనిత పిలిచి.. మీ కారులోనే నేను రావొచ్చా అని అడిగింది. దాంతో ఎందుకు నీవు నా పిస్టల్ నుంచి బుల్లెట్లు దొంగిలించి నాపై హత్యానేరం మోపడానికా? అంటూ రోషిణి ఆగ్రహం వ్యక్తం చేస్తే.. చచ్చిన పామును మళ్లీ చంపకండి అని మోనిత సమాధానం ఇచ్చింది. దాంతో చచ్చిన పామును చంపడానికి మేము పిచ్చివాళ్లమా అంటూ కౌంటర్ ఇచ్చింది.

  నా చివరి కోరిక అంటూ మోనిత

  నా చివరి కోరిక అంటూ మోనిత


  ఏసీపీ రోషిణిని ఆపుతూ మీతో పర్సనల్ విషయాలు మాట్లాడాలి. ఎలాగైనా నాకు కఠిన శిక్ష విధిస్తారు. చనిపోయే ముందు నాకు చివరి కోరిక ఉందా అని అడుగుతారు కదా.. అది కాస్త ముందుకు జరిపి మీతో కారులో వెళ్లే ఛాయిస్ ఇవ్వండి అంటే. కారులో బుసలు కొడితే.. కుబుసం ఒలిచేస్తా. కోరలు పీకేస్తాను అంటూ మోనితకు రోషిణి వార్నింగ్ ఇచ్చింది.

  బిస్కెట్లు వేస్తన్నావా మోనిత అంటూ రోషిణి షాక్

  బిస్కెట్లు వేస్తన్నావా మోనిత అంటూ రోషిణి షాక్


  మోనితను తన కారులోనే ఎక్కించుకొని రోషిణికి కోర్టుకు తీసుకెళ్లింది. మార్గమధ్యంలో మోనిత ఆలోచించుకొంటూ.. నేను రోషిణి కారులో వీఐపీ మాదిరిగా దిగడం చూసి కార్తీక్ ఫ్యామిలీ కంగుతినడం కావాలి అంటూ లోపలే మురిసిపోయింది. ఆ తర్వాత రోషిణికి రెండు బిస్కెట్లు వేస్తా అంటూ మోనిత.. మేడమ్ మీకు నేను అభిమానిని అంటే.. ఎన్ని బిస్కెట్లు తెచ్చావని రోషిణి అడగడంతో కంగుతిన్నది. నా కెరీర్‌లో నీలాంటి క్రిమినల్‌ను ఇంత వరకు చూడలేదు. కార్తీక్, దీప, రోషిణి చెప్పినా నమ్మలేదు. నీ వల్ల నాకే మంచి జరిగింది. నాలో ఉన్న ఇగో నీవల్ల పోయింది అంటూ రోషిణి చెప్పింది.

  కుట్రలు, కుతంత్రాలు ఆపు అంటూ రోషిణి ఫైర్

  కుట్రలు, కుతంత్రాలు ఆపు అంటూ రోషిణి ఫైర్

  రోషిణి మాటలకు స్పందిస్తూ.. మీరు నన్ను తప్పుగా అర్దం చేసుకొన్నారు. నేను గొప్ప ప్రేమికురాలిని. ఒక లైలా, ఒక జూలియట్, ఒక మోనిత అంటూ తనకు తానే ప్రశంసించుకొన్నది. ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పండి.. నా మీద అభిప్రాయం ఏమిటి? అని అడిగింది. ఓ మృగం నాతోపాటు కారులో వస్తూ అడుగుతున్నట్టు ఉంది. నీవు మనిషివే కాదు. పైశాచికత్వం పరాకాష్టవు. నీలో కుట్రలు, కుతంత్రాలు లాంటి దరిద్రాలు ఉన్నాయి. స్త్రీ అంటే హుందాగా ఉండే దీప, సౌందర్యను చూసి నేర్చుకోవాలి. పనికి మాలిన ప్రశ్నలు వేస్తే ఎలా సమాధానం ఇవ్వాలో నన్ను చూసి నేర్చుకోవాలి అంటూ రోషిణి ఘాటుగా స్పందించింది.

  నా ప్రేమలో క్రూరత్వం ఉందా?

  నా ప్రేమలో క్రూరత్వం ఉందా?

  మోనితను కడిగిపారేస్తూ.. అమాయకుడైన కార్తీక్‌ను జైలుకు పంపించాలని చూశావు. వారిద్దరి కాపురాన్ని కూల్చే ప్రయత్నం చేశావు. ఇంకా రాక్షసత్వానికి రంగు వేయకు. ఇంకా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా మారు మాట్లాడుకుండా కూర్చో రోషిణి అంటే.. నా ప్రేమలో క్రూరత్వం కనిపించిందా? అంటే.. నీ ప్రేమను ఇంకా సమర్ధించుకోకు. నీది ఉన్మాదం. నీ పరిస్థితి నీకైనా అర్ధమవుతుందా అంటూ రోషిణి ఫైర్ అయింది. దాంతో నా ప్రేమను కార్తీక్ మోసగించాడు. నా ప్రేమను అర్ధం చేసుకొని మనిషిని ప్రేమించాను అని మోనిత తన వెర్షన్ చెప్పింది. దాంతో ఒక్కమాట ఎక్కువగా మాట్లాడినా.. చేతికి హ్యాండ్ కప్స్ వేసి నడిపించుకొంటూ తీసుకెళ్తాను అని రోషిణి వార్నింగ్ ఇచ్చింది.

  కోపంతో ఊగిపోయిన సౌందర్య

  కోపంతో ఊగిపోయిన సౌందర్య

  కోర్టులో కార్తీక్, దీప, సౌందర్య వేచి చూస్తుంటే.. మోనిత కోర్టు హాల్లోకి అడుగుపెట్టింది. హాల్‌లోకి వస్తూనే నమస్కారం అందమైన అత్తగారు అంటూ చేతులెత్తి మొక్కింది. దాంతో కోపంతో ఊగిపోయిన సౌందర్య.. మోనిత చెంప పగలకొట్టబోయింది. దాంతో సౌందర్యను దీప ఆపేసింది. పక్కనే ఉన్న రోషిణి మాట్లాడుతూ.. మీరేమి చేయకండి సౌందర్య గారు.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే తేలిపోయింది. కాసేపట్లో ఈమె జాతకం తెలిసిపోతుంది అంటూ రోషిణి చెప్పింది.

  Maro Prasthanam Movie Team Chit Chat | Tanish, Muskan Sethi
  36వ వారంలో కార్తీక దీపం రేటింగ్

  36వ వారంలో కార్తీక దీపం రేటింగ్

  కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏ సీరియల్ సాధించని రికార్డును ఈ సీరియల్ సాధించింది. గత వారం అంటే.. 36వ వారంలో కార్తీకదీపం అర్భన్ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో 17.94 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 19.38 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్‌లో ఏ సీరియల్ కూడా దరిదాపులో లేకపోవడం గమనార్హం.

  English summary
  Karthika Deepam September 17th Episode preview. Monita was produced in the court in Cheating case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X