Karthika Deepam Episode 1133: దీప చేతులు పట్టుకొని కార్తీక్ దీనంగా... మోనిత నమ్మక ద్రోహి అంటూ

v
లాకప్‌లో ఉన్న కార్తీక్‌ను హాస్పిటల్‌కు రప్పించి మోనిత బెదిరించిన తర్వాత దీపలో కంగారు పెరిగిపోయింది. మామూలు వ్యక్తిలా ఉండగకుండా ఆందోళనకు గురైన కార్తీక్‌ను చూసి దీప బాధపడిపోయింది. కుటుంబ సభ్యులందర్నీ చంపేస్తానని బెదిరించడంతో కార్తీక్ మానసికంగా మరింత దిగజారిపోయాడు. దీప, తన ఇంటి సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అనే ఆలోచనల్లో పడిపోయాడు. తాజా ఎపిసోడ్ 1133లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 కంగారుపడిపోయిన దీప...

కంగారుపడిపోయిన దీప...

డాక్టర్ బాబు.. ఏమైంది అంటూ దీప కంగారుపడిపోయింది. దాంతో నీవు ఇక్కడెందుకు ఉన్నావు. ఇంటికి వెళ్లిపో. నాకేం కాదు. నీకే శిక్ష అంటూ కార్తీక్ ఆందోళనగా మాట్లాడుతుంటే దీప భయపడిపోయింది. నీవు నాతోపాటు ఇక్కడ ఉంటే గౌరవం ఉండదు. నిన్ను నేరస్థుడి భార్య అనుకొంటారు అని కార్తీక్ అంటే.. నేరం చేయని వారిని నేరస్థులు అనుకోరు డాక్టర్ బాబు అని దీప సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది.

మీరు తప్పుచేయలేదు అంటూ

మీరు తప్పుచేయలేదు అంటూ

దీప మాటలకు ధైర్యాన్ని తెచ్చుకొన్న కార్తీక్.. నేను నేరం చేయలేదని అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే.. ఆ రోజు మోనిత గర్బవతి అంటే.. తప్పు చేయలేదనే నిజాయితీ మీ కళ్లలో స్పష్టంగా కనిపించింది. నేను కూడా నమ్మలేదు. అదే నిజమైంది. ఇప్పుడు కూడ మీరు నేరం చేయలేదని నమ్ముతున్నాను అని దీప చెప్పింది.

 పాము లాంటి మోనిత స్నేహం చేసినందుకు

పాము లాంటి మోనిత స్నేహం చేసినందుకు

మీరు మోనితను హత్య చేయలేదు. గన్ పట్టుకొని తిరుగుతుంది. నన్నెవరు నమ్మడం లేదు పిచ్చిదానిలా తయారయ్యానని అనుకొంటున్నారు అంటూ దీప చెప్పింది. దాంతో అవును దీప.. మోనిత బతికే ఉంది. మన కుటుంబ ప్రాణాలతో ఆడుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. నేను పిరికివాడిని కాదు. నా కుటుంబం విషయంలో నేను బలహీనుడిని. పాము లాంటి మోనితతో స్నేహం చేసినందుకు ఇలాంటి పరిస్థితులు. నా కుటుంబంపై ఎలాంటి కాటు పడనివ్వను అని కార్తీక్ తన మనసులో అనుకొన్నాడు.

 టెన్షన్ పడిపోయిన కార్తీక్

టెన్షన్ పడిపోయిన కార్తీక్

దీపతో మాట్లాడుతూ.... శౌర్యకు జ్వరం అన్నావు.. నువ్వు ఇంటికి వెళ్లు అని అంటూ కార్తీక్ వెంటనే.. లేదు లేదు.. నువ్వ ఇక్కడే ఉండు. ఇంట్లో ఆదిత్య, అమ్మ, నాన్న ఉన్నారు కదా అంటూ కార్తీక్ తొట్రుపాటుకు గురయ్యాడు. దాంతో కార్తీక్ మానసికంగా డిస్ట్రబ్ అయ్యారు. ఎప్పుడు లేనిది మెంటల్‌గా వీక్ అయ్యారు. ఏం జరిగింది అంటూ దీప ఆందోళన పడింది.

మోనిత మళ్లీ వస్తానని వార్నింగ్

మోనిత మళ్లీ వస్తానని వార్నింగ్

దీప బయటకు వెళ్లి టీ తీసుకు వచ్చేటప్పటికీ.. గదిలో కార్తీక్ లేకపోవడంతో కంగారు పడిపోయింది. గది అంతా వెతికి పోలీసుల దగ్గరకు వచ్చి అడిగితే.. తమ ఎదురుగా ఒంటరిగా కూర్చొన్న కార్తీక్‌ను చూపించారు. ఏదో ఆలోచిస్తుంటే.. డాక్టర్ బాబు.. ఏంటిది డాక్టర్.. ఏమైంది.. వచ్చావా? ఎవరూ లేకపోతే ఒక్కడిని గదిలో ఉండలేకపోతున్నాను అని కార్తీక్ అంటే.. మీరు ఏ విషయంలోనైనా బయపడుతున్నారా? అని దీప అంటే. మోనిత మళ్లీ వస్తానని అన్నానని చెప్పింది. మళ్లీ అది ఏ ప్రపోజల్‌తో వస్తుందో అని మనసులో కంగారు పడిపోయాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనిత నమ్మకద్రోహి

మోనిత నమ్మకద్రోహి

అయితే కార్తీక్ ఏదో ఆలోచిస్తుండటంతో దీప మాట్లాడుతూ.. మీరు ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నారు. మోనిత గురించి చెబితే .. మళ్లీ సూర్యాపేటకు వెళ్లినట్టే వెళ్తుంది. ఎంత డేంజర్ అనేది దీపకు తెలియదు. ఇప్పటి వరకు దీప పడిన కష్టాలు చాలు. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలు పణంగా పెట్టలేను అంటూ మనసులో అనుకొంటే.. వెంటనే డాక్టర్ బాబు.. మీరు మాట్లాడండి. ఎందుకు ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఒంటరిగా ఉండలేకపోతున్నారు. ఎందుకు ఇలా తయారయ్యారు అని కార్తీక్ అంటే.. అదేం లేదు. నా జీవితంలో ఇంతకంటే దిగజారిన పరిస్థితులు ఏముంటాయి. కుటుంబంలో అందరూ బాధపడుతున్నారు. నన్ను కాపాడుకోవడానికి పిచ్చిదానిలా తిరుగుతున్నావు. ఆ నమ్మకద్రోహి మోనిత ముందు నా నిజాయితీ ఎందుకు పనికిరాకుండా పోయింది అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X