Karthika Deepam జైలులో కూడా మోనిత ఉన్మాదం.. లాకప్‌లోనే దీపపై కుట్రలు!

కార్తీక్‌పై మోనిత ప్రేమ పరాకాష్టకు చేరుకొన్నది. జైలు గోడల నిండా కార్తీక్ అని రాసి సంతోషపడిపోయింది. ప్రతీ క్షణం కార్తీక్ నామస్మరణతో జీవిస్తున్నది. అయితే కుట్ర, కుతంత్రాలకు కోర్టు శిక్ష విధించినా మోనితలో మార్పు కాస్తైనా కనిపించలేదు. జైల్లో కూడా కుట్రలు చేస్తూ మోనిత కనిపించింది. అయితే తాజా ఎపిసోడ్‌ 1151‌లో మోనిత కుట్రలు ఎలా ఉన్నాయంటే..

బంగారం అంటూ కార్తీక్‌తో

బంగారం అంటూ కార్తీక్‌తో

కార్తీక్‌ను తలచుకొంటూ.. బంగారం.. నేను ఈ చీరలో ఎలా ఉన్నాను. అదిరిపోయేలా ఉన్నానని నాకు తెలుసు. దొంగ నీకు కూడా తెలుసు. కానీ బయటపడవు. ఎందుకంటే నీవు కార్తీక్ కాబట్టి. నీవు ఆ మాత్రం బెట్టు చేయకపోతే మన ప్రేమ ఎలా హిట్ అవుతుంది చెప్పు. 18 నెలలు నీకు దూరంగా ఈ జైలులో ఉండాలా బంగారం.

18 నెలలే కాదు.. 36 నెలలైనా నీకోసం జైలులో ఉంటాను. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా హృదయంలో నిన్ను ప్రేమ ఖైదీగా చేసుకొన్న తర్వాత నేను, నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నాం. నీ ఆరోగ్యం జాగ్రత్త. దీపను, పిల్లల్ని అడిగినట్టు చెప్పు అంటూ మోనిత తన పిచ్చి ప్రేమను కటకటాల వెనుక నుంచి వ్యక్తం చేసింది.

గోడల నిండా కార్తీక్ పేరు..

గోడల నిండా కార్తీక్ పేరు..

జైలు లాకప్‌లో మోనిత పిచ్చితనాన్ని చూసి.. గోడపై పేరు చూసి ఎవరు ఆయన అని కానిస్టేబుల్ ప్రశ్నిస్తే.. మీరే ఆయన అన్నారు కదా.. ఆయన నాకు కాబోయే భర్త. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆయనే అంటూ మోనిత చెబితే.. అవును మా మధ్య ప్రేమ. ఇద్దరం ప్రేమలో ఉన్నాం. జైలుశిక్ష పూర్తి కాగానే పెళ్లి చేసుకొంటాం. నా కాబోయే భర్త పేరు కార్తీక్. పేరు బాగుంది కదా.. పేరు మాత్రమే కాదు.. చూడటానికి అందంగా ఉంటాడు అని మోనిత చెప్పింది. దాంతో మీరు డాక్టర్ అంట కదా.. అని ప్రశ్నిస్తే.. అవును అని కానిస్టేబుల్‌కు మోనిత చెప్పింది.

KLM అంటే... కార్తీక్ లవ్స్ మోనిత

KLM అంటే... కార్తీక్ లవ్స్ మోనిత

కానిస్టేబుల్‌తో ఉత్సాహంగా మాట్లాడుతూ... ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో KLM ఉంటాయి కదా.. K అంటే కార్తీక్.. L అంటే లవ్, M అంటే మోనిత.. అంటే కార్తీక్ లవ్స్ మోనిత అని తనదైన శైలిలో మోనిత చెప్పింది. అయితే మోనిత పిచ్చి ప్రేమను చూసి కానిస్టేబుల్ కంగారు పడిపోయింది. జైలర్ చెప్పినట్టే మోనిత వెరైటీ కేసే అని మనసులో అనుకొంటూ.. నాకు పని ఉంది.. వస్తాను మేడమ్ అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. దాంతో నాకు కూడా పని ఉంది అంటూ మోనిత చెప్పింది.

జైలులో ఉన్న సంగతి మరిచి..

జైలులో ఉన్న సంగతి మరిచి..

ఇక అర్ధరాత్రి కూడా కార్తీక్‌ను కలవరించుకొంటూ మోనిత నిద్రపోయింది. ఉదయమే కానిస్టేబుల్ వచ్చి లేవండి అంటూ హుకుం జారీ చేసింది. దాంతో అయిష్టంగా నిద్ర లేచి.. నేను ఎక్కడున్నాను అంటూ కలియదిరిగి చూసింది. అయ్యో నేను జైల్లో ఉన్నాననే సంగతి మరిచే పోయాను అని.. గోడపై ఉన్న కార్తీక్ అక్షరాలను చూస్తూ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసింది. నీ ప్రేమలో మునిగి ఆదమరిచి నిద్రపోయాను అంటూ మోనిత లేచింది.

Recommended Video

Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3
జైలులో ఏడాదిన్నరనా అంటూ..

జైలులో ఏడాదిన్నరనా అంటూ..

ఇక ఈ జైలులో ఏడాదిన్నర.. 18 నెలలు గడిపేస్తాను కార్తీక్. నీ నామస్మరణలో అలా గడిపేస్తాను. కానీ నీ సంగతి ఏంటి.. ఈ కాలంలో నిన్ను వాళ్లు మాయ చేస్తే ఎలా.. నాకు తక్కువ టైమ్ అయినా.. నిన్ను మార్చేయడానికి వారికి ఎక్కువ సమయం. అసలే దీప.. మామూలు ఆడది కాదు. ఈ సమయంలో దీప మాయలో కార్తీక్ పడితే.. అందరు కలిసి నా కార్తీక్‌ను మాయ చేస్తారేమో.. అయినా అంతా సమయం, ఛాన్స్ ఎలా ఇస్తాను. అలా ఇస్తే నేను ఎలా మోనితను అవుతాను అని మోనిత తనలో తాను అనుకొంటూ బయటకు చిటికెలు వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X